For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Unstoppable with NBK: రెండు వారాలకే ఆగిపోయిన బాలయ్య షో.. చంద్రబాబు నుంచి మరో సర్‌ప్రైజ్

  |

  సుదీర్ఘ కాలంగా తెలుగు సినీ రంగంలో తనదైన హవాను చూపిస్తూ స్టార్‌గా వెలుగొందుతోన్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. బ్యాగ్రౌండ్‌తో వచ్చినా.. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్ ఇలా ఎన్నో విభాగాల్లో సత్తా చాటుతూ.. చాలా తక్కువ సమయంలో స్టార్‌గా ఎదిగిపోయారు. అప్పటి నుంచి ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో సినిమాల్లో నటించిన బాలయ్య.. ఇప్పుడు 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే' అనే షోతో హోస్టుగా పరిచయం అయ్యారు. ఇటీవలే రెండో సీజన్ కూడా మొదలైంది. తాజాగా ఈ సీజన్ ఆగిపోయింది. ఆ వివరాలు మీకోసం!

  హోస్టుగా మారిన బాలకృష్ణ

  హోస్టుగా మారిన బాలకృష్ణ

  ఆరు పదుల వయసులోనూ ఎంతో ఉత్సాహంగా కనిపించే నందమూరి బాలకృష్ణ.. కొన్ని నెలల క్రితమే 'Unstoppable with NBK' అనే టాక్ షోతో హోస్టుగా మారిన విషయం తెలిసిందే. ఆహా సంస్థ దీన్ని రూపొందించింది. దీపావళి పండుగను పురస్కరించుకుని గత నవంబర్‌లో ఈ టాక్ షోను మొదలెట్టారు. ఇది సూపర్ డూపర్ హిట్‌గా నిలిచి రికార్డులను క్రియేట్ చేసేసింది.

  బాత్‌టబ్‌లో అరాచకంగా దీపికా పదుకొనె: హాట్ షోలో గీత దాటేసిందిగా!

  రెండో సీజన్‌తో సంచలనం

  రెండో సీజన్‌తో సంచలనం

  టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ హోస్టుగా వచ్చిన 'Unstoppable with NBK' టాక్ షో మొదటి సీజన్ భారీ స్పందనను అందుకుని సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో ఆహా టీమ్ ఇప్పుడు రెండో సీజన్‌ను అక్టోబర్ 14వ తేదీ నుంచి మొదలు పెట్టింది. ఓటీటీ చరిత్రలోనే తొలిసారి ఈ షో కోసం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించి సంచలనం సృష్టించారు

  చంద్రబాబుతో మొదలైంది

  చంద్రబాబుతో మొదలైంది

  నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న 'Unstoppable with NBK 2' షోకు సంబంధించిన మొదటి ఎపిసోడ్‌ను అక్టోబర్ 14వ తేదీన స్ట్రీమింగ్ చేశారు. దీనికి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గెస్టుగా వచ్చారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఎపిసోడ్ కూడా మొదలైంది. దీనికి సూపర్ డూపర్ రెస్పాన్స్ వచ్చి.. రికార్డు స్థాయి వ్యూస్ దక్కాయి.

  యాంకర్ శ్యామల అందాల విందు: అలాంటి డ్రెస్‌తో రెచ్చగొడుతోందిగా!

  2వ ఎపిసోడ్‌ కోసం హీరోలు

  2వ ఎపిసోడ్‌ కోసం హీరోలు

  నటసింహా బాలయ్య 'Unstoppable with NBK 2' షోకు సంబంధించిన రెండో సీజన్‌కు టాలీవుడ్ యంగ్ హీరోలు మాస్ కా దాస్ విశ్వక్ సేన్, డీజే టిల్లు సిద్దు జొన్నలగడ్డలు హాజరయ్యారు. వీళ్లతో బాలయ్య ఓ రేంజ్‌లో సందడి చేశారు. మరీ ముఖ్యంగా కుర్ర హీరోలకు షాకిచ్చేలా ఆయన తనదైన హోస్టింగ్ అలరించారు. దీంతో ఈ ఎపిసోడ్ కూడా సక్సెస్ అయింది.

  మూడో ఎపిసోడ్ ఆలస్యంగా

  మూడో ఎపిసోడ్ ఆలస్యంగా

  ఆహా వీడియోలో 'Unstoppable with NBK 2' టాక్‌ షోను ప్రతి శుక్రవారం స్ట్రీమింగ్ అయ్యేలా ప్లాన్ చేశారు. అలాగే, రెండో ఎపిసోడ్‌ను కూడా రిలీజ్ చేశారు. దీంతో ఈ శుక్రవారం అంటే ఈరోజు మూడో ఎపిసోడ్ వస్తుందని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ, అది మాత్రం జరగలేదు. ఫలితంగా బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న టాక్ షో రెండు ఎపిసోడ్లకే పరిమితం అయినట్టైంది.

  సమంతకు ఏమైంది? ఇలా మారిపోయిందేంటి? షాకిస్తోన్న లేటెస్ట్ ఫొటోలు

  ఫ్యాన్స్‌కు మరో సర్‌ప్రైజ్

  ఫ్యాన్స్‌కు మరో సర్‌ప్రైజ్


  ఈ శుక్రవారమే 'Unstoppable with NBK 2' టాక్ షోకు సంబంధించిన మూడో ఎపిసోడ్ వస్తుందని అంతా అనుకుంటే.. అది కాస్తా ఆలస్యం అయింది. దీంతో ఈరోజు నుంచి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గెస్టుగా వచ్చిన ఎపిసోడ్‌ను ప్రసారం చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రకటన కూడా ఆహా సంస్థ వెల్లడించింది.

  ఎన్నో రహస్యాలు అంటూ

  ఎన్నో రహస్యాలు అంటూ

  నేటి నుంచి స్ట్రీమింగ్ కాబోతున్న నారా చంద్రబాబు నాయుడు అన్‌సెన్సార్ ఎపిసోడ్‌లో మొదటి దానిలో లేని కంటెంట్‌ను చూపించబోతున్నట్లు ఆహా వెల్లడించింది. అంతేకాదు, ఇందులో 'మనకు తెలియని మరెన్నో రహస్యాలు.. మనం వినని మరెన్నో విశేషాలతో ఈ ఎపిసోడ్ వచ్చేసింది' అని చెప్పింది. దీంతో ఈ ఎపిసోడ్‌పై అందరిలోనూ అంచనాలు ఏర్పడ్డాయి.

  English summary
  Nandamuri Balakrishna Did Unstoppable with NBK Show For Aha. Makers Now Telecasts Second Season From October 14th. Now This Show 3rd Episode Delay.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X