Veera Simha Reddy: ఓటీటీలోకి వీర సింహా రెడ్డి.. సరికొత్తగా ట్రైలర్.. ఎలా ఉందంటే?
నందమూరి నటసింహం బాలకృష్ణ గతేడాది అఖండ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాడు. దీంతో సినిమాలపై జోరు పెంచిన బాలయ్య బాబు మరోసారి గర్జించిన చిత్రం వీర సింహా రెడ్డి. టాలీవుడ్ లో బడా నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి మాస్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. చాలా కాలం తర్వాత ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఊర మాస్ లుక్ లో బాలయ్య బాబు నట విశ్వరూపం చూపించిన చిత్రమే వీర సింహా రెడ్డి. థియేటర్లలో అత్యధిక వసూళ్లు సాధించిన ఈ మూవీ ఓటీటీ విడుదల కోసం ఎంతోమంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే వీర సింహా రెడ్డి డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేయగా.. తాజాగా దీనికి సంబంధించిన కొత్త ట్రైలర్ ను రిలీజ్ చేసి ఆశ్చర్యపరిచారు.

జై బాలయ్య నినాదంతో..
నట సార్వభౌమ, స్వర్గీయ సీనియర్ ఎన్టీఆర్ వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ తనదైన స్టైల్ లో క్రేజ్ సంపాదించుకున్నాడు. నందమూరి నటసింహం బాలకృష్ణను అభిమానులు బాలయ్య బాబు అని ముద్దుగా పిలిచుకుంటారన్న విషయం తెలిసిందే. ఇక ఎక్కడికెళ్లిన.. విదేశాల్లో చూసిన బాలయ్య బాబు క్రేజ్ మాములుగా ఉండదు. జై బాలయ్య అనే నినాదంతో మారు మోగాల్సిందే. ఇక బాలకృష్ణ నుంచి ఫ్యాక్షన్ నేపథ్యంలో ఓ సినిమా వస్తుందంటే చాలు సినిమాపై అంచనాలే కాకుండా అభిమానుల్లో బీభత్సమైన క్యూరియాసిటీ నెలకొంటుంది. అలా వచ్చిన చిత్రమే వీర సింహా రెడ్డి.

కీలక పాత్రల్లో పాపులర్ స్టార్స్..
నటసింహం బాలకృష్ణ, టాలీవుడ్ మాస్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కిన పవర్ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ వీర సింహా రెడ్డి. ఈ సినిమాలో బ్యూటిఫుల్ శ్రుతిహాసన్, హనీ రౌజ్ హీరోయిన్లుగా అలరించగా.. వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ వంటి పాపులర్ స్టార్ట్స్ కీలక పాత్రలు పోషించి సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లారు. టాలీవుడ్ లో అగ్ర నిర్మాణ సంస్థ అయిన మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై యలమంచిలి రవి, నవీన్ యెర్నేని ఈ మూవీని నిర్మించగా.. ఎస్ఎస్ తమన్ సంగీతం అందించాడు.

భారీ స్థాయిలో పోటీ..
ఇక బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన వీర సింహా రెడ్డి సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. సినిమా మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోయింది. దీంతో ఈ సినిమా హిట్ ఖాతాలోకి వెళ్లిపోయింది. అయితే ఈ సినిమా ఓటీటీ విడుదల కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. దీంతో వీర సింహా రెడ్డి సినిమా ఓటీటీ హక్కుల కోసం భారీ స్థాయిలో పోటీ వచ్చింది.
సెన్సార్ లేకుండా స్ట్రీమింగ్..
ఫైనల్ గా వీర సింహా రెడ్డి డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను తీవ్ర పోటీ మధ్యలో ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ దక్కించుకుంది. ఇందుకోసం భారీ మొత్తాన్నే నిర్మాతలకు ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 23న సాయంత్రం 6 గంటల నుంచి ప్రసారం చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది. అంతేకాకుండా సెన్సార్ లేకుండానే ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా వీర సింహా రెడ్డి ఓటీటీ ట్రైలర్ ను రిలీజ్ చేసింది డిస్నీ ప్లస్ హాట్ స్టార్.
నేను శవాలు విసురుతా..
కారులో వెళ్తున్నప్పుడు జింక అడ్డు వస్తే ఎవడైనా హారన్ కొడతాడు. అదే ఎదురు వచ్చింది సింహం అయితే.. అంటూ ప్రారంభమైన ఈ ట్రైలర్ లో డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. కట్టేయడానికి నువ్ పెంచిన కుక్కలు ఎన్నైనా రాని.. సింహం ఇక్కడ, ఎండ నడినెత్తికెక్కేలోపు.. కొడుకుల్ని నరికి ఈ మట్టికి ఎర వేసి పోతా, సవాలు విసరకు..నేను శవాలు విసురుతా.. అంటూ బాలకృష్ణ పవర్ ఫుల్ డైలాగ్ లతో ట్రైలర్ ను కట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.


Click it and Unblock the Notifications











