Veera Simha Reddy OTT: అందులోనే బాలయ్య మూవీ.. అప్పటి నుంచే స్ట్రీమింగ్.. అవి కూడా చూపిస్తారట

చాలా కాలం పాటు విజయాన్ని అందుకోలేక తెగ ఇబ్బందులు పడిన సమయంలో 'అఖండ'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కడంతో పాటు కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లను సొంతం చేసుకున్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. ఈ ఉత్సాహంతోనే ఆయన వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తోన్నారు. ఇందులో భాగంగానే గత సంక్రాంతికి 'వీర సింహా రెడ్డి' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ డేట్‌ను వచ్చింది. వివరాల్లోకి వెళ్తే...

వీర సింహా రెడ్డిగా బాలయ్య ఎంట్రీ

వీర సింహా రెడ్డిగా బాలయ్య ఎంట్రీ

నటసింహా బాలకృష్ణ - మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబోలో రూపొందిన మాస్ చిత్రమే 'వీర సింహా రెడ్డి'. ఈ చిత్రంలో శృతి హాసన్, వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్, హనీ రోజ్ వంటి స్టార్లు కీలక పాత్రలు చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యలమంచిలి రవి, నవీన్ యెర్నేని ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీకి ఎస్ థమన్ సంగీతాన్ని అందించాడు.

అలాంటి టాక్... ఓపెనింగ్స్ రికార్డు

అలాంటి టాక్... ఓపెనింగ్స్ రికార్డు

క్రేజీ కాంబినేషన్‌లో ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'వీర సింహా రెడ్డి' చిత్రానికి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కానీ, సంక్రాంతి సందర్భంగా విడుదల కావడంతో దీనికి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ఫలితంగా రికార్డు స్థాయిలో ఈ చిత్రానికి ఓపెనింగ్స్ దక్కాయి. దీంతో మొదటి రోజే బాలయ్య ఎన్నో రికార్డులు సాధించారు.

4 వారాల్లో ఇలా... షోలు పెంచారు

4 వారాల్లో ఇలా... షోలు పెంచారు

బాలకృష్ణ 'వీర సింహా రెడ్డి' నాలుగు వారాల్లో ఏపీ, తెలంగాణలో రూ. 69.14 కోట్లు రాబట్టింది. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా రూ. 79.76 కోట్లు షేర్‌, రూ. 133.85 కోట్లు గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. అంతేకాదు, ఐదో వారంలోనూ ఈ సినిమా విజయవంతంగానే ప్రదర్శితం అవుతోంది. మరీ ముఖ్యంగా ఈ వీకెండ్‌లో థియేటర్ల సంఖ్యను కూడా భారీగా పెంచారు. దీంతో రెస్పాన్స్ పెరిగింది.

ఓటీటీ రైట్స్ ఆ సంస్థకే.. భారీ డీల్

ఓటీటీ రైట్స్ ఆ సంస్థకే.. భారీ డీల్

'అఖండ' వంటి భారీ విజయం తర్వాత నందమూరి బాలకృష్ణ నటించిన 'వీర సింహా రెడ్డి' మూవీ హక్కుల కోసం భారీ స్థాయిలో పోటీ వచ్చింది. దీంతో థియేట్రికల్ రైట్స్ అత్యధిక ధరలకు అమ్ముడయ్యాయి. అలాగే, ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను తీవ్ర పోటీ నడుమ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ దక్కించుకుంది. ఇందుకోసం భారీ మొత్తాన్నే నిర్మాతలకు ముట్టజెప్పింది.

హాట్‌స్టార్‌లో ఆరోజు నుంచే స్టార్ట్

హాట్‌స్టార్‌లో ఆరోజు నుంచే స్టార్ట్

థియేటర్లలో ఇంకా సందడి చేస్తోన్న 'వీర సింహా రెడ్డి' మూవీకి సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ గురించి ఎన్నో రకాల ప్రచారాలు జరుగుతోన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ హక్కులు దక్కించుకున్న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ స్ట్రీమింగ్‌పై అధికారిక ప్రకటన చేసింది. ఇందులో ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 23, సాయంత్రం 6 గంటల నుంచి ప్రసారం చేస్తున్నట్లు వెల్లడించింది.

ఆ సీన్స్ కూడా కలిపే స్ట్రీమింగ్

ఆ సీన్స్ కూడా కలిపే స్ట్రీమింగ్

ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'వీర సింహా రెడ్డి' మూవీని ఫిబ్రవరి 23 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అంతేకాదు, సెన్సార్ లేకుండానే ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది. దీంతో థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన నందమూరి అభిమానులు, ప్రేక్షకులు ఓటీటీలో చూసేందుకు ఆసక్తిని చూపుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X