OTT: 18 దేశాల్లో డాకు మహారాజ్ హవా.. ఓటీటీలో టాప్ ట్రెండింగ్‌గా బాలయ్య మూవీ
నందమూరి బాలకృష్ణ నటించిన రీసెంట్ ఫిల్మ్ బ్లాక్ బాస్టర్ యాక్షన్ అడ్వేంచర్ ఫిల్మ్ 'డాకూ మహారాజ్'. మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. సితార ఎంటర్ టైన్ మెంట్స్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించారు. సూర్య దేవర నాగవంశీ నిర్మాతగా గ్రాండ్ స్కేల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సంక్రాంతి కానుకగా నందమూరి నటసింహం నుంచి 2025 జనవరి 12న గ్రాండ్ గా ఈ చిత్రం విడుదలైంది. బాలయ్య ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియెన్స్ కూడా మెప్పించిందీ చిత్రం. యాక్షన్ తోపాటు ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ తో సినిమా అలరించింది. డాకూగా బాలయ్య అదరగొట్టారు.
బాక్సాఫీస్ వద్ద డాకూ మహారాజ్ చిత్రం రూ.115 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. 2025లో థర్డ్ హయ్యేస్ట్ గ్రాసింగ్ తెలుగు ఫిల్మ్ గా ఈ చిత్రం రికార్డు క్రియేట్ చేసింది. థియేట్రికల్ రన్ సక్సెస్ అయిన తర్వాత ఫిబ్రవరి 21న, అంటే నాలుగు రోజుల కింద ఈ చిత్రం ఓటీటీలోకి విడుదలైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ డాకూ మహారాజ్ రైట్స్ ను సొంతం చేసుకుంది. కాగా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత బాలకృష్ణ 'డాకూ మహరాజ్' అదరగొడుతోంది. ఊహించని స్థాయిలో వ్యూయర్ షిప్ ను సాధించి ఓటీటీలో సంచనలంగా మారింది. ఓటీటీ ఫిల్మ్స్ ల్లోనే టాప్ ట్రెండింగ్ గా స్ట్రీమింగ్ అవుతూ రికార్డు క్రియేట్ చేసింది.

నాలుగు రోజుల్లోనే బాలయ్య డాకూ మహారాజ్ ఓటీటీని షేక్ చేస్తోంది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ #1 ట్రెండింగ్ గా స్ట్రీమింగ్ అవుతోంది. అంతేకాదు.. 18 దేశాల్లో డాకూ మహారాజ్ టాప్ ట్రెడింగ్ గా స్ట్రీమింగ్ అవుతుండటం విశేషం. ఇంతవరకు ఈ స్థాయిలో రికార్డు క్రియేట్ చేసిన చిత్రాలు అరుదు. ప్రస్తుతం బాలయ్య డాకూ మహారాజ్ ఓటీటీలో హవా కొనసాగిస్తోంది. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ ఓటీటీలో విడుదలైంది.
థియేట్రికల్ రన్ మిస్ అయిన ఆడియెన్స్ ఓటీటీలో దుమ్ములేపుతున్నారు. ఈ రేంజ్ లో స్ట్రీమింగ్ అవుతుండటంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. డాకూ మహారాజ్ గా బాలకృష్ణ ఇచ్చిన పెర్ఫామెన్స్ కు ఫ్యాన్సే కాదు.. నార్మల్ ఆడియెన్స్ కూడా ఫిదా అయ్యారు. ఎప్పటిలాగే బాలయ్య ఈ చిత్రంలోనూ మాస్ డైలాగ్స్, గూస్ బంప్స్ తెప్పించే యాక్షన్ సీన్లతో అదరగొట్టారు. అలాగే ఒక గ్రామానికి నీళ్లు ఇప్పించే సివిల్ ఇంజనీర్ గా అద్భుతమైన పెర్ఫామెన్స్ ఇచ్చారు.
డాకూ మహారాజ్ లో బాలకృష్ణకు జోడీగా ప్రాగ్యా జైశ్వాల్, బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశీ రౌటేలా నటించారు. ఇక ఊర్వశీ రౌటేలా తన స్పెషల్ డ్యాన్స్ తోనూ బాలయ్య ఫ్యాన్స్ ను, ఆడియెన్స్ ను ఉర్రూతలూగించింది. 'దబిడి దిబిడి' సాంగ్ తో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ సాంగ్ లోని లిరిక్స్, డ్యాన్స్ పైనా కాస్తా విమర్శలు వచ్చినా.. పెద్దగా సినిమాను ఎఫెక్ట్ చేయలేకపోయాయి. నెక్ట్స్ బాలకృష్ణ - బోయపాటి కాంబోలో 'అఖండ 2' రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే పలు గాసిప్స్ తో ఈ మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ పై అంచనాలు పెరుగుతున్నాయి.


Click it and Unblock the Notifications











