Pawan Kalyan Birth Day పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు మెగా ట్రీట్.. పక్కాగా బండ్ల గణేష్ స్కెచ్!
టాలీవుడ్ కమెడియన్ బండ్ల గణేష్ తీరు ఈ మధ్యకాలంలో నిత్యం చర్చల్లో నిలుస్తుండటం చూస్తున్నాం. ఓ నటుడిగా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా ఆయన వెళుతున్న తీరు హాట్ టాపిక్ అవుతోంది. రీసెంట్‌గా హీరో అవతారామెత్తి బండ్లన్న తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు . ఇంతలో పవన్ కళ్యాణ్ బర్త్ డే రావడంతో పక్కాగా స్కెచ్చేసి రంగంలోకి దిగుతున్నారు. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటి? బండ్ల గణేష్ స్టెప్ ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం..

పవన్ కళ్యాణ్‌పై కామెంట్స్.. దుమ్ము దుమారం
సినీ నటుడిగా, నిర్మాతగా ఎంత ఫేమ్ సంపాదించారో.. పవన్ కళ్యాణ్ భక్తుడిగా బండ్ల గణేష్ అంతకు మించిన పాపులారిటీ కూడగట్టుకున్నారు . ఏ చిన్న అవకాశం దొరికినా పవన్ కళ్యాణ్‌పై ప్రశంసలు గుప్పిస్తూ రెచ్చిపోయి కామెంట్స్ చేయడం బండ్లన్న నైజం. ఇలా సినిమా ఫంక్షన్ల వేదికలపై బండ్ల గణేష్ చేసే కామెంట్స్, ఆయన స్పీచ్ ఏ రేంజ్‌లో అట్రాక్ట్ చేశాయో ప్రతి ఒక్కరికీ తెలుసు.

సోషల్ మీడియా ట్రెండ్.. మంత్రికి కౌంటర్
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కూడా హవా నడిపిస్తున్నారు బండ్ల గణేష్. సినీ, రాజకీయ పరిస్థితులపై ఆయన పెడుతున్న పోస్టులు జనాల్లో హాట్ ఇష్యూస్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ విషయమై ఏపీ మంత్రికి బండ్ల గణేష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చి సెన్సేషన్ క్రియేట్ చేశారు . మంత్రి అంబటి రాంబాబుపై మాటల తూటాలతో అటాక్ చేసి సంచలనం సృష్టించారు.

బండ్ల గణేష్ తీరు.. అనుమానాలు
గత కొన్ని రోజులుగా ఎక్కువగా రాజకీయ అంశాలపై దృష్టి పెడుతున్నారు బండ్ల గణేష్. గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పొలిటికల్ జర్నీ చేసి బ్లేడ్ ఇష్యూతో హైలైట్ అయిన ఆయన.. తిరిగి ఇప్పుడు పొలిటికల్ జర్నీ స్టార్ట్ చేయబోతున్నారా? అనేలా అనుమానాలు రేకెత్తిస్తున్నారు. ముఖ్యంగా జనసేన పార్టీలోకి బండ్లన్న వస్తారా అనేది మెయిన్ డిస్కషన్‌గా మారింది.

బండ్లన్న స్టెప్.. జనం రియాక్షన్
ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బిజినెస్ మెన్‌గా కూడా సత్తా చాటుతున్న బండ్ల గణేష్.. డేగల బాబ్జీ సినిమాతో హీరో అయ్యారు. ఈ చిత్రానికి కొత్త డైరెక్టర్ వెంకట్ చంద్ర దర్శకత్వం వహించారు. థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఆశించిన సక్సెస్ సాధించలేక పోయింది. డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమా అయినప్పటికీ జనం బండ్లన్నను హీరోగా పెద్దగా రిసీవ్ చేసుకోలేదు.

బండ్ల గణేష్ పర్ఫెక్ట్ ప్లాన్
పవన్ భక్తుడైన బండ్ల గణేష్ తన వెరైటీని చాటుకుంటూ పవర్ స్టార్ పుట్టినరోజును డేగల బాబ్జీ సినిమా కోసం వాడేశారు. సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా తను టైటిల్ పాత్రలో నటించిన డేగల బాబ్జీ సినిమా ఆహా డిజిటల్‌లో రిలీజ్ కానుందని తెలుపుతూ ట్వీట్ పెట్టారు. తనను ఆశిర్వదించమని కోరారు. విడుదల తర్వాత కూడా సినిమాను ప్రమోట్ చేసుకోవడంలో ఇది పర్ఫెక్ట్ ప్లాన్ అనే చెప్పుకోవచ్చు.


Click it and Unblock the Notifications











