BB Jodi: బెడ్ పై అఖిల్ తో తేజస్వి రొమాన్స్.. వీడియో నా భర్తకు పంపిస్తా అంటూ రాధ షాకింగ్ కామెంట్స్!

ఎన్నో అంచనాల నడుమ ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ ఇటీవల పూర్తయింది. మరో కొత్త సీజన్ తీసుకువచ్చేందుకు సమయం ఉండటంతో బుల్లితెర ప్రేక్షకులను, బిగ్ బాస్ లవర్స్ ను ఎంటర్టైన చేసేందుకు రియాలిటీ డ్యాన్స్ షోతో ముందుకు వచ్చారు మేకర్స్. బీబీ జోడీ పేరుతో తీసుకొచ్చిన ఈ డ్యాన్స్ షోలో గత సీజన్లలోని కంటెస్టెంట్లు తమ హాట్ పర్ఫామెన్స్ లతో అదరగొడుతున్నారు.

ముఖ్యంగా ఈ డ్యాన్స్ షోలో అఖిల్ సార్థక్-తేజస్వి మదివాడ మరింతగా ఆకట్టుకుంటున్నారు. తర్వాతి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఇందులో ఈ జంట పర్ఫామెన్స్ చూసిన న్యాయ నిర్ణేత రాధ షాకింగ్ కామెంట్స్ చేశారు.

 కంటెస్టెంట్లతో డ్యాన్స్..

కంటెస్టెంట్లతో డ్యాన్స్..

సెలబ్రిటీలకు అడ్డాగా ప్రారంభమైన బిగ్ బాస్ రియాలిటీ షోలో మొదట్లో పాపులర్ నటీనటులే ఎంట్రీ ఇచ్చారు. తర్వాత క్రమేణా సీజన్ లు పెరిగినకొద్ది.. సీరియల్ నటినటులు, సోషల్ మీడియా స్టార్స్, రివ్యూవర్స్, యాంకర్స్, జర్నలిస్ట్స్ ఇలా విభిన్న నైపుణ్యాలు కలిగిన వ్యక్తులను కంటెస్టెంట్లుగా తీసుకొచ్చారు. ఇక వాళ్లందరు బిగ్ బాస్ షోలో అడుగుపెట్టాక ఉదయం పూట డ్యాన్స్ చేస్తూ అలరించేవారు. ఈ కంటెస్టెంట్ల లోపల డ్యాన్సర్స్ దాగి ఉన్నారు. అందుకే వారందరిచేత బీబీ జోడీలో డ్యాన్స్ చేయిస్తున్నారు మేకర్స్.

జడ్జ్ గా స్టార్ హీరోయిన్..

జడ్జ్ గా స్టార్ హీరోయిన్..

బీబీ జోడీ డ్యాన్స్ రియాలిటీ షోలో జోడీలుగా అర్జున్ కల్యాణ్-వాసంతి కృష్ణన్, అఖిల్ సార్థక్-తేజస్వి మదివాడ, ఆర్జే సూర్య-ఫైమా, రవికృష్ణ-భాను, రోల్ రైడా-ఇనయా సుల్తానా, ఆర్జే చేతూ-ఆర్జే కాజల్, అవినాష్-అరియానా, మెహబూబ్-అషు రెడ్డి ఉన్నారు. వీరందరికి యాంకర్ గా బిగ్ బాస్ తెలుగు మూడో సీజన్ రన్నరప్, బుల్లితెర రాములమ్మ శ్రీముఖి వ్యవహరించనుంది. అలాగే అలనాటి స్టార్ హీరోయిన్ రాధతోపాటు గ్లామరస్ హీరోయిన్ సదా, ప్రముఖ కొరియోగ్రాఫర్ తరుణ్ మాస్టార్ జడ్జ్ లుగా ఉన్నారు.

ప్రాపర్టీ రౌండ్ లో..

ప్రాపర్టీ రౌండ్ లో..

బిగ్ బాస్ కంటెస్టెంట్లందరితో నిర్వహిస్తున్న ఈ బీబీ జోడీ డ్యాన్స్ షోను ప్రతి శని, ఆది వారాల్లో ప్రసారం చేస్తున్నారు. ఈ ఎపిసోడ్స్ కు సంబంధించిన ప్రోమోలను విడుదల చేస్తూ ఎపిసోడ్స్ పై క్యూరియాసిటీ పెంచేస్తున్నారు మేకర్స్. అందులో భాగంగానే తాజాగా తర్వాత వచ్చే ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో ప్రాపర్టీ రౌండ్ లో భాగంగా జోడీలంతా తమ డ్యాన్స్ లతో ఆకట్టుకున్నారు. మెహబుబ్ మాత్రం సోలో పర్ఫామెన్స్ ఇచ్చాడు.

బెడ్ పై రొమాన్స్..

బెడ్ పై రొమాన్స్..

ఇక లైగర్ సినిమాలోని మోస్ట్ రొమాంటిక్ సాంగ్ ఆఫత్ పై డ్యాన్స్ చేశారు అఖిల్ సార్థక్ అండ్ తేజస్వి మదివాడ. బెడ్ పై వీళ్లిద్దరు చేసిన రొమాన్స్ షోలో సెగలు పుట్టించింది. వాళ్ల సూపర్ హాట్ పర్ఫామెనస్ కు ప్రతి ఒక్కరు మైమరిచిపోయారు. తేజస్వి బ్యాక్ పై అఖిల్ సార్థక్ కొడుతూ చేసిన స్టెప్ హైలెట్ గా నిలిచింది. వీళ్ల హాట్ పర్ఫామెన్స్ చూసిన సదా.. దాదాపుగా చెమటలు పట్టించేశారు అని కాంప్లిమెంట్ ఇచ్చింది.

మా ఆయనకు పంపిస్తా..

మా ఆయనకు పంపిస్తా..

తర్వాత పేపర్ తో హీట్ ను చల్లారుస్తున్నట్లుగా చేశారు అలనాటి స్టార్ హీరోయిన్ రాధ. ఆ స్టెప్పులను ఫోన్ లో రికార్డ్ చేసి మా ఆయనకు పంపిస్తా.. ఈ డ్యాన్స్ పర్ఫామెన్స్ కూడా అని రాధ షాకింగ్ కామెంట్స్ చేశారు. రాధ ఇచ్చిన కాంప్లిమెంట్స్ కు అఖిల్ అండ్ తేజస్వి తెగ సంబరిపడిపోయారు. రాధ అన్న మాటలకు అఖిల్ కొంటెగా చూశాడు. ఈ ఎపిసోడ్ లో వీళ్లిద్దరి డ్యాన్స్ పర్ఫామెన్స్ హైలెట్ గా నిలవనున్నట్లు తెలుస్తోంది.

మేము కూడా స్ట్రాటజీస్ ఉపయోగించాలి..

అనంతరం అఖిల్ తేజు డ్యాన్స్ పర్ఫామెన్స్ కు వాసంతి కృష్ణన్-అర్జున్ కల్యాణ్ 8 మార్క్స్ ఇచ్చారు. దీనికి అఖిల్-తేజస్వి డిసప్పాయింట్ అయ్యారు. ఇక మేము కూడా స్ట్రాటజీస్ ఉపయోగించాలనుకుంటా అని తేజస్వి మదివాడ అంది. తర్వాత మీరే సరిగ్గా చేయనప్పుడు మీరు మాకు ఎలా మార్క్స్ ఇస్తారు అని అఖిల్ అన్నాడు. మరి ఈ మార్క్స్ అందరికి ఎందుకు ఇచ్చారు అని వాసంతి అనడంతో ఇద్దరు సైలెంట్ అయిపోయారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X