Bedurulanka 2012 OTT: ఓటీటీలోకి వచ్చిన యుగాంతం మిస్టరీ మూవీ.. ఏంటి అవి కూడా కలిపారా!

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది యంగ్ హీరోలు తమదైన చిత్రాలతో సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో కొందరు మాత్రం హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా దూసుకుపోతోన్నారు. అందులో కార్తికేయ గుమ్మకొండ ఒకడు. ఈ మధ్య పెద్దగా హిట్లను అందుకోలేకపోతోన్న అతడు.. ప్రయత్నాలను మాత్రం ఆపకుండా వరుస సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే ఈ టాలెంటెడ్ హీరో 'బెదురులంక 2012' అనే క్రేజీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు.

కార్తికేయ గుమ్మకొండ హీరోగా క్లాక్స్ తెరకెక్కించిన సినిమానే 'బెదురులంక 2012'. బెదురులంక అనే ఊరిలో యుగాంతం అనే కాన్సెప్టుతో రూపొందిన ఈ చిత్రం ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. అందుకు తగ్గట్లుగానే ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. అనుకున్న విధంగానే ఈ సినిమాకు మంచి టాక్ లభించింది. దీంతో దీనికి ఆడియెన్స్ రెస్పాన్స్ కూడా భారీగా దక్కింది. ఇంకేముందు ఈ సినిమాకు వసూళ్లు పోటెత్తాయి. ఫలితంగా అత్యధిక కలెక్షన్లతో లాభాలను కూడా అందుకుంది.

Bedurulanka 2012 Digital Streaming Started on Amazon Prime Video

ఫన్ అండ్ మిస్టీరియస్ కాన్సెప్టుతో రూపొందిన 'బెదురులంక 2012' మూవీపై అంచనాలు భారీగా నెలకొనడంతో దీని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. అందుకు అనుగుణంగానే చాలా ఓటీటీ సంస్థలు దీన్ని కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు జరిపాయి. చిన్న సినిమానే అయినా ఎక్కువ ప్రభావం చూపిన 'బెదురులంక 2012' చిత్రానికి సంబంధించిన డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ భారీ ధరకు సొంతం చేసుకుంది.

క్లాక్స్ దర్శత్వంలో కార్తికేయ గుమ్మకొండ నటించిన 'బెదురులంక 2012' మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ గురించి కూడా ఎన్నో రకాల ప్రచారాలు జరిగాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 22వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు అమెజాన్ ప్రైమ్ సంస్థ ప్రకటించింది. అందుకు తగ్గట్లుగానే నేటి అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ స్టార్ట్ చేసింది. ఇక, ఇందులో సెన్సార్‌లో కట్ అయిన కొన్ని సన్నివేశాలు, డైలాగులను సైతం యాడ్ చేసి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు తెలిసింది.

Bedurulanka 2012 Digital Streaming Started on Amazon Prime Video

ఇదిలా ఉండగా.. 'బెదురులంక 2012' సినిమాను లౌక్యా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ముప్పనేని రవీంద్ర బెనర్జీ నిర్మించారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతాన్ని సమకూర్చారు. ఇందులో నేహా శెట్టి హీరోయిన్‌గా, అజయ్ ఘోష్, శ్రీకాంత్ అయ్యంగార్, సత్య తదితరులు కీలక పాత్రలు చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X