పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయితే .. ఓటీటీలోకి రొమాంటిక్ థ్రిల్లర్, ఎందులో అంటే?
ఇటీవలి కాలంలో ఓటీటీలు చిన్న సినిమాలను గట్టెక్కిస్తున్నాయి. థియేటర్‌లో సక్సెస్ కానీ సినిమాలో ఓటీటీ ప్లాట్‌ఫాంపై దుమ్మురేపుతున్నాయి. కంటెంట్ బాగుంటే ఓటీటీ లవర్స్ సినిమాలను నెత్తిన పెట్టుకుంటున్నారు. ఈ నమ్మకంతోనే పలు సినిమాలు ఓటీటీలో దిగి సంచనాలు నమోదు చేస్తున్నాయి. అయితే కొన్ని కొన్ని సినిమాలు నెలలు గడుస్తున్నా ఓటీటీలోకి రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఈ కోవలోకే వస్తుంది బిఫోర్ మ్యారేజ్ చిత్రం. డిఫరెంట్ కాన్సెప్ట్, స్క్రీన్‌ప్లేతో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు 14 నెలలు కావొస్తున్నా ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించలేదు. దీనికి కారణాలు తెలియరానప్పటికీ ఓ సెక్షన్ ఆడియన్స్‌ని మాత్రం బాగా డిజప్పాయింట్ చేస్తోంది. ఓటీటీ మార్కెట్‌కు కావాల్సిన అన్ని అంశాలు పుష్కలంగా ఉన్నప్పటికీ ఎందుకు ఈ సినిమా స్ట్రీమింగ్‌లోకి రాలేదని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు
హిట్ ఫేమ్ నవీన రెడ్డి నటించిన చిత్రం బిఫోర్ మ్యారేజ్. శ్రీధర్ రెడ్డి ఆటాకుల దర్శకత్వం వహించారు. హనుమ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎద్దుల జగదీశ్వర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. గతేడాది రిపబ్లిక్ డే కానుకగా బిఫోర్ మ్యారేజ్ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. టీజర్, ట్రైలర్లు రిలీజైన సమయంలోనే డిఫరెంట్ సబ్జెక్ట్‌గా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న బిహార్ మ్యారేజ్.. దాదాపు ఏడాది తర్వాత ఓటీటీలోకి రిలీజ్ కానుంది.

బిఫోర్ మ్యారేజ్ చిత్రంలో నాగ మహేశ్, సునీత మనోహర్, లక్ష్మణ్ కీలకపాత్రలు పోషించగా.. పెద్దపల్లి రోహిత్ సంగీతం అందజేశారు. క్షణికావేశంలో యువత తీసుకునే నిర్ణయాలు.. దాని వల్ల వారి జీవితంలో ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటాయనే ఇతివృత్తంతో బిఫోర్ మ్యారేజ్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఓ పల్లె నుంచి సిటీకి వచ్చే యువతి తన స్నేహితురాళ్లతో కలిసి ఒకేరూమ్‌లో ఉంటుంది.
ఈ ఫాస్ట్ కల్చర్‌కు అట్రాక్ట్ అయిన ఈ ముగ్గురు ఫ్రెండ్స్ తప్పుడు మార్గంలో వెళ్తుంటారు. ఈ క్రమంలోనే హీరోయిన్ అనుకోకుండా చేసిన తప్పువల్ల గర్భం దాలుస్తుంది. అదే సమయంలో ప్రియుడు ఆమెను మోసం చేస్తాడు. పెళ్లి కాకుండానే గర్భవతి అయిన హీరోయిన్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది? తండ్రి నుంచి ఎలాంటి సపోర్ట్ దొరికింది? తెలియాలంటే బిఫోర్ మ్యారేజ్ చూడాల్సిందే. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందినప్పటికీ కమర్షియల్‌గా సక్సెస్ కాలేకపోయింది. అయితే ఐఎండీబీలో 8.5 రేటింగ్ రావడం విశేషం.
నిన్నగాక మొన్న వచ్చిన సినిమాలు కూడా ఓటీటీలోకి స్ట్రీమింగ్ అవుతుండగా ఏడాది దాటిపోయినప్పటికీ బిఫోర్ మ్యారేజ్ ఇంకా ఓటీటీలోకి రాకపోవడం చర్చనీయాంశమైంది. థియేటర్‌లో ఫెయిలైన సినిమాలు ఓటీటీలో సక్సెస్ అయిన ఉదంతాల నేపథ్యంలో బిఫోర్ మ్యారేజ్ కూడా ఖచ్చితంగా హిట్ అవుతుందని చిత్ర యూనిట్ చెబుతోంది. తాజాగా ఈ నిరీక్షణకు తెర దించుతూ ఈ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి మేకర్స్ అధికారికంగా ప్రకటన విడుదల చేశారు.
ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో ఏప్రిల్ 15 నుంచి బిఫోర్ మ్యారేజ్ స్ట్రీమింగ్ అవుతోంది. సైలెంట్‌గా ఈ సినిమా ఓటీటీలో ప్రత్యక్షం కావడంతో ఆడియన్స్ సర్‌ప్రైజ్ అవుతున్నారు. మరి ఈ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ ఓటీటీలో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











