చడీచప్పుడు లేకుండా ఓటీటీలోకి వచ్చేసిన ఛత్రపతి సినిమా.. ఎక్కడ చూడాలంటే?

అల్లుడు శీను సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇటీవలే బాలీవుడ్ కు కూడా ఎంట్రీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే 2005లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో వచ్చి సూపర్ డూపర్ హిట్టుగా నిలిచిన చిత్రం ఛత్రపతిని.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రీమేక్ చేశారు. తెలుగులో వచ్చిన ఈ సినిమాను హిందీలోనూ తీయగా.. వివి వినాయక్ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా బాలీవుడ్ లో డిజాస్టర్ గా నిలిచింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం భారీ పరాజయాన్ని చవిచూసింది.

బెల్లంకొండ శ్రీనివాస్ కు హిందీలో బాగానే ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన చేసిన చాలా సినిమాలు హిందీలోకి డబ్ అయ్యాయి. వాటికి మంచి స్పందన రాగా.. బాలీవుడ్ లోనే సెటిలైపోవాలని ఆయన ప్లాన్ చేశారు. ఈక్రమంలోనే చాలా కష్టపడి ఛత్రపతి చిత్రంలో ఇరగదీశారు. అయితే ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పక్కన బాలీవుడ్ నటి నుష్రత్ భరుచ్చా హీరోయిన్ గా నటించింది. అలాగే భాగ్య శ్రీ, శరద్ కేల్కర్, శివం పాటిల్ సహా పలువురు కీలక పాత్రలు పోషించారు. దాదాపు 25 కోట్ల రూపాయలతో తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కోటి రూపాయలు కూడా వసూలు చేయలేకపోయింది. కానీ ఈ సినిమా రిజల్ట్స్ దారుణంగా ఉండడంతో అంతా సైలెంట్ అయిపోయారు.

 Bellamkonda Sai Srinivas Hindi Movie Chatrapathi OTT Streaming Details Here

ప్రభాస్ హీరోగా వచ్చిన ఛత్రపతి సినిమా చాలా బాగుండడంతో.. దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఈ చిత్రాన్ని చూసేశారు. ముఖ్యంగా తెలుగులో వచ్చిన ఈ చిత్రానికి యూట్యూబ్ లో హిందీ ఆడియో కూడా అందుబాటులో ఉండడంతో అంతా ఈ చిత్రాన్ని చూసేశారు. సినిమా వచ్చిన చాలా ఏళ్ల తర్వాత మళ్లీ ఇదే చిత్రాన్ని తీసుకురావడం.. అప్పటికే అంతా ఈ సినిమా చూసి ఉండండ, ముఖ్యంగా యూట్యూబ్ లో ఇప్పటికీ అందుబాటులో ఉండడంతో ఎక్కువ మంది థియేటర్లకు వెళ్లి ఈ చిత్రాన్ని చూసేందుకు ఆసక్తి చూపించలేరు. ఇలా ఈ చిత్రం అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది.

సినిమా ప్లాప్ అవ్వడంతో.. ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడో అసలు ఓటీటీలోకి తీసుకు వస్తారో లేదో కూడా క్లారిటీ ఇవ్వలేరు మూవీ టీం. కానీ చడీచప్పుడు లేకుండా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వేదికగా ఈ హిందీ ఛత్రపతి చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. అయితే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ యాక్టింగ్ ఎలా ఉందో తెలుసుకోవాలంటే మాత్రం ఓసారి ఈ సినిమాపై లుక్కేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X