Bhagavanth Kesari OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న భగవంత్ కేసరి.. అవి కూడా యాడ్ చేసి మరీ!
టాలీవుడ్‌లో ఇప్పుడు సూపర్ డూపర్ ఫామ్‌లో ఉన్న హీరోల్లో నటసింహా నందమూరి బాలకృష్ణ ఒకరు. అంతలా ఆయన వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ సత్తా చాటుతోన్నారు. ఈ ఉత్సాహంతోనే ఈ సీనియర్ హీరో మరిన్ని ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తూ ముందుకు దూసుకుపోతోన్నారు. ఇందులో భాగంగానే ఇటీవలే బాలయ్య 'భగవంత్ కేసరి' అనే సినిమాను చేశారు.
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 'భగవంత్ కేసరి' మూవీని సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రూపొందించాడు. దీంతో ఎన్నో అంచనాలతో ఈ చిత్రం అక్టోబర్ 19వ తేదీన ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ముందు నుంచీ అనుకుంటున్నట్లుగానే ఈ సినిమాకు అంతటా పాజిటివ్ టాక్ లభించింది. ఫలితంగా దీనికి ప్రేక్షకుల నుంచి స్పందన భారీ స్థాయిలో దక్కింది.

నటసింహా బాలకృష్ణ హీరోగా నటించిన 'భగవంత్ కేసరి' మూవీ థియేటర్లలో దాదాపు ఐదు వారాల పాటు సందడి చేసింది. ఇలా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకోవడంతో పాటు లాభాలను కూడా సొంతం చేసుకుంది. తద్వారా బాలయ్యకు విజయాల హ్యాట్రిక్‌ను ఈ చిత్రం అందించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ వివరాలు వచ్చేశాయి.
'భగవంత్ కేసరి' మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు పోటీ కూడా ఏర్పడింది. అందుకు అనుగుణంగానే ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను మంచి ధరకు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇక, ఈ చిత్రాన్ని థియేటర్లలోకి వచ్చిన 30 రోజుల తర్వాత స్ట్రీమింగ్ చేసేలా నిర్మాతలు ఆ సంస్థతో ఒప్పందం చేసుకున్నారని సమాచారం.

బాలయ్య నటించిన 'భగవంత్ కేసరి' సినిమాను నవంబర్ 24 నుంచే స్ట్రీమింగ్ చేయబోతున్నారు. తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో నుంచి క్లారిటీ వచ్చేసింది. అంటే ఈ అర్ధరాత్రి నుంచే ఈ చిత్రం స్ట్రీమింగ్ కాబోతుంది. ఇక, ఇందులో దంచవే మేనత్త కూతురా సాంగ్‌తో పాటు సెన్సార్ బోర్డ్ కట్ చేసిన కొన్ని డైలాగులును, సన్నివేశాలను కూడా ఇందులో చూపిస్తారని సమాచారం.

ఇదిలా ఉండగా.. బాలయ్య కెరీర్‌లోనే విభిన్నమైన కథాంశంతో రూపొందిన 'భగవంత్ కేసరి' సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా.. శ్రీలీల కీలక పాత్రను చేసింది. అర్జున్ రాంపాల్ విలన్ రోల్‌ను పోషించాడు. దీనికి థమన్ సంగీతాన్ని అందించాడు. ఇక, ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.


Click it and Unblock the Notifications











