Bhagavanth Kesari OTT: అమెజాన్‌లో బాలయ్య రికార్డు.. ఓటీటీలో హిస్టరీ క్రియేట్ చేసిన నటసింహం
తెలుగు చిత్ర పరిశ్రమలోని స్టార్ హీరోల్లో చాలా తక్కువ మంది మాత్రమే వరుసగా హిట్లను సాధిస్తూ సత్తా చాటుతోన్నారు. అలాంటి వారిలో నటసింహా నందమూరి బాలకృష్ణ ఒకరు. గతంలో వరుస ఫ్లాపులతో సతమతం అయిన ఆయన.. ఈ మధ్యన 'అఖండ', 'వీర సింహా రెడ్డి' వంటి బ్యాక్ టూ బ్యాక్ హిట్లు సాధించారు. ఈ జోష్‌లోనే 'భగవంత్ కేసరి' మూవీతో వచ్చారు.
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన రీసెంట్ మూవీనే 'భగవంత్ కేసరి'. దీన్ని సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించాడు. దీంతో ఎన్నో అంచనాలతో ఈ చిత్రం అక్టోబర్ 19వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ముందు నుంచీ అనుకుంటున్నట్లే ఈ సినిమాకు అంతటా పాజిటివ్ టాక్ లభించింది. ఫలితంగా దీనికి ప్రేక్షకుల నుంచి స్పందన భారీ స్థాయిలో వచ్చింది.

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 'భగవంత్ కేసరి' మూవీ థియేటర్లలో దాదాపు ఐదు వారాల పాటు సందడి చేసింది. ఇలా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకోవడంతో పాటు లాభాలను కూడా బాగానే రాబట్టుకుంది. ఈ విజయంతో బాలయ్య ఖాతాలో హ్యాట్రిక్ కూడా నమోదు అయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌కు కూడా అందుబాటులోకి వచ్చింది.
సందేశాత్మకమైన కథతో రూపొందిన 'భగవంత్ కేసరి' మూవీని అమెజాన్ తెలుగుతో పాటు తమిళం, కన్నడం, మలయాళంలో స్ట్రీమింగ్ చేస్తోంది. ఇందులో నందమూరి బాలకృష్ణ సినిమాకు అదిరిపోయే స్పందన లభిస్తోంది. ఫలితంగా ఈ మూవీకి వ్యూస్ కూడా భారీ స్థాయిలో వస్తున్నాయి. దీంతో ఈ చిత్రం 24 గంటలకు తిరగకముందే టాప్‌లో ట్రెండింగ్ అవుతోంది.

బాలకృష్ణ నటించిన 'భగవంత్ కేసరి' సినిమాకు దక్షిణాది ప్రేక్షకులు ఊహించని రీతిలో రెస్పాన్స్ అందిస్తున్నారు. ఫలితంగా ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో ఇండియా మొత్తంలో టాప్ మూవీగా ట్రెండ్ అవుతోంది. తద్వారా వరుసగా మూడు సార్లు ఈ ఘనత అందుకున్న హీరోగా బాలయ్య రికార్డును నమోదు చేసుకున్నారు.

ఇదిలా ఉండగా.. బాలయ్య కెరీర్‌లోనే విభిన్నమైన కథాంశంతో రూపొందిన 'భగవంత్ కేసరి' సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా.. శ్రీలీల కీలక పాత్రను చేసింది. అర్జున్ రాంపాల్ విలన్ రోల్‌ను పోషించాడు. దీనికి థమన్ సంగీతాన్ని అందించాడు. ఇక, ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రతిష్టాత్మకంగా ప్రొడ్యూస్ చేశారు.


Click it and Unblock the Notifications











