OTT: ఓటీటీలో భాగ్యశ్రీ భోర్సే ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా.. మిస్టర్ బచ్చన్ మూవీ మీరు చూశారా?

గడిచిన ఈ కొన్నేళ్ల లోనే తెలుగు సినిమా దగ్గర పలువురు యంగ్ హీరోయిన్స్ పరిచయం అయ్యారు. పలు సినిమాలు చేసేసారు అప్పుడే ఫేడ్ అవుట్ అవ్వడం కూడా జరిగిపోయింది. అయితే ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్స్ ఇండస్ట్రీలోకి వస్తుండడం ఒక నిరంతర ప్రక్రియగా మన తెలుగు సినిమాలో జరుగుతూనే ఉంటుంది. కాగా అలా ఈ ఏడాదిలో తెలుగు సినిమాలో ఓ రేంజ్ లో మారుమోగిపోయిన హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది భాగ్యశ్రీ బోర్సే అని చెప్పాలి.

కాగా ఈమె మాస్ మహారాజ రవితేజ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన "మిస్టర్ బచ్చన్" తో అందులో తన గ్లామర్ షో తో ఓ రేంజ్ లో ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఇక ఈ సినిమా విషయంలోనే పలు కాంట్రవర్సీలు కూడా ఈమె విషయంలో బయటకి వచ్చాయి. కానీ సినిమా ఫలితం అనుకున్న రేంజ్ లో రాలేదు. అయినా భాగ్యశ్రీ కోసం మాత్రం చాలా మంది మాట్లాడుకున్నారు.

Bhagyasri Borse s Chandu Champion streaming on OTT Who acted before mr bachchan

అయితే చాలా మంది భాగ్యశ్రీ తెరగేంట్రం చేసింది మిస్టర్ బచ్చన్ తోనే అని చాలా మంది అనుకుంటున్నారు. కానీ మిస్టర్ బచ్చన్ కంటే ముందే ఓ సినిమాలో భాగ్యశ్రీ నటించింది అని మన తెలుగు ఆడియెన్స్ కి తెలియకపోవచ్చు. అది కూడా రీసెంట్ బిగ్ హిట్ సినిమాలో భాగ్యశ్రీ పాలు పంచుకుంది. కాగా ఇటీవల బాలీవుడ్ లో వచ్చిన హిట్ సినిమాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కార్తీక్ ఆర్యన్ నటించిన ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా "చందూ ఛాంపియన్" కూడా ఒకటి.

ఇంట్రెస్టింగ్ గా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ భాగ్యశ్రీ భోర్సే షైన్ అయ్యింది. ఉన్న కొంచెం సేపే అయినా కూడా ఆ సినిమాలో మంచి పాత్రనే చేసింది అని చెప్పాలి. కాగా ఈ సినిమా నిజ జీవిత సంఘటనలు ఆధారంగా తెరకెక్కించగా కార్తీక్ ఆర్యన్ అయితే ప్రాణం పెట్టేసాడు. కాగా ఈ సినిమా రీసెంట్ గానే ఓటిటిలోకి కూడా వచ్చింది.

Bhagyasri Borse s Chandu Champion streaming on OTT Who acted before mr bachchan

దీనిని చూడాలి అంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి ఉంది ఖచ్చితంగా మంచి ఎమోషనల్ స్పోర్ట్ డ్రామాని చూడాలి అనుకునే వారు తప్పకుండా ట్రై చేయవచ్చు. అన్నట్టు ఈ సినిమా హిందీ అయినప్పటికీ తెలుగు డబ్బింగ్ లో కూడా అందుబాటులోకి ఉంది. సో ఒక్క భాగ్యశ్రీ కోసమే అని కాదు కానీ మన హిస్టరీలో స్పోర్ట్స్ పరంగా ప్రాణం పెట్టిన మనకి తెలియని లెజెండ్స్ కోసం తెలుసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు..

సో తప్పకుండా ఈ ఎమోషనల్ స్పోర్ట్ డ్రామా తప్పకుండా అందరినీ మెప్పించి తీరుతుంది. బాలీవుడ్ లో భారీ వసూళ్లు అందుకున్న ఈ చిత్రాన్ని ప్రైమ్ వీడియోలో తప్పకుండా చూడొచ్చు, డోంట్ మిస్. ఇక భాగ్యశ్రీ అయితే మిస్టర్ బచ్చన్ పై చాలా అసలు పెట్టుకుంది కానీ ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. మరి మరిన్ని ఆఫర్స్ అనేది ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగానే ఉన్నట్టు వినికిడి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X