Bhairavam: కళ్లు చెదిరే ధరకు భైరవం ఓటీటీ డీల్.. మంచు మనోజ్ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

వ్యక్తిగత సమస్యలు, కుటుంబంలో గొడవలతో గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు మంచు మనోజ్. అటు నారా వారి అబ్బాయి రోహిత్, బెల్లంకొండ సురేష్ తనయుడు సాయి శ్రీనివాస్ కూడా హిట్ కొట్టి చాలాకాలమే అవుతోంది. అలాంటి ఈ ముగ్గురు కలిసి మల్టీస్టారర్ చేస్తే. అదే భైరవం. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్, ప్రచార కార్యక్రమాలు ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. జూన్ 30వ తేదీన భైరవం ప్రేక్షకుల ముందుకొచ్చింది.

తమిళంలో గరుడన్ సంచలనం

తమిళంలో హిట్ అయిన గరుడన్‌కు రీమేక్‌గా భైరవంను తెలుగులో నిర్మించారు. తమిళ వెర్షన్‌లో సూరీ హీరోగా నటించగా.. అతని స్నేహితులుగా శశికుమార్, ఉన్నిముకుందన్ కీలకపాత్రలు పోషించారు. పూర్తిగా గ్రామీణ ప్రాంతంలో ఉండే గొడవలు, కుటుంబ బంధాలు, ఆధిపత్య పోరు బేస్ చేసుకుని ఆర్ఎస్ దురైసెంథిల్ ఈ సినిమాను తెరకెక్కించారు. రూ.20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన గరుడన్ చిత్రం ఏకంగా రూ.50 కోట్ల కలెక్షన్స్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. విలక్షణ దర్శకుడు వెట్రిమారన్ ఈ సినిమాకు కథ అందించడం విశేషం.

Bhairavam OTT Release when to expect Manchu Manoj and Nara Rohith s movie to stream online

తెలుగులో భారీ మార్పులు

గరుడన్ కథను తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేర్పులు చేసి భైరవంను తెరకెక్కించారు దర్శకుడు విజయ్ కనకమేడల. ఒరిజినల్ గరుడన్ ఇప్పటికే ఓటీటీలో ఉన్న నేపథ్యంలో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించేలా చిత్రీకరించినట్లు విజయ్ తెలిపారు. పెన్ స్టూడియెస్‌ డాక్టర్ జయంతి లాల్ గడా సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ ఈ భైరవం చిత్రాన్ని నిర్మించారు. అదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్లై ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించారు.

భైరవం ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే?

రిలీజ్‌కు ముందే టీజర్, ట్రైలర్, ప్రమోషనల్ కార్యక్రమాలతో భైరవం సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా మంచు మనోజ్ అంతా తానై ప్రమోషనల్ కార్యక్రమాలను నడిపిస్తున్నారు. దీంతో ఈ సినిమాకు థియేట్రికల్ నబిజినెస్ కూడా బాగానే జరిగినట్లు ఫిలింనగర్ టాక్. నైజాంలో రూ.6 కోట్లు, సీడెడ్‌లో రూ.2.5 కోట్లు, ఆంధ్రలో రూ.7.50 కోట్లు, కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో రూ.2.2 కోట్లు చొప్పున భైరవం చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ.18.20 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది. దీంతో ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే రూ.19 కోట్ల షేర్, రూ.38 కోట్ల గ్రాస్ రాబట్టాలని ట్రేడ్ వర్గాలు విలువ నిర్దేశించాయి.

భైరవం ఏ ఓటీటీలో అంటే?

ఇక భైరవం చిత్రాన్ని ఎప్పుడెప్పుడు ఓటీటీలో చూద్దామా అని ఆ సెక్షన్ ఆడియన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఆల్రేడీ ఒరిజినల్ తమిళ్ వెర్షన్ గరుడన్ ఓటీటీలో ఉన్నప్పటికీ దాని తెలుగు రీమేక్ అయిన భైరవం ఓటీటీ రైట్స్ కూడా భారీ ధర పలికినట్లు ఫిలింనగర్ టాక్. భైరవం డిజిటల్, శాటిలైట్ రైట్స్‌ను జీ 5 సంస్థ రూ.32 కోట్లు వెచ్చించి దక్కించుకుందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. థియేటర్‌లో రిలీజైన నాలుగు నుంచి 5 వారాల తర్వాత ఓటీటీలో రావాలనే నిబంధన మేరకు జూన్ చివరి వారంలో లేదా జూలై మొదటి వారంలో భైరవం ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అయితే థియేట్రికల్ రన్ ఆధారంగా ఇది ముందు రావొచ్చు, ఆలస్యం కావొచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X