ఓటీటీలో టాప్ 2 ట్రెండింగ్‌లో ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్.. ఎక్కడ చూడొచ్చంటే?
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ యూవీ కాన్సెప్ట్ బ్యానర్‌పై ప్రశాంత్ రెడ్డి చంద్రపు దర్శకత్వంలో అజయ్ కుమార్ రాజు నిర్మించిన చిత్రం భజే వాయువేగం. యువ హీరో కార్తీకేయ గుమ్మకొండ నటించిన ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ థియేట్రికల్ రిలీజై మంచి విజయాన్ని అందుకొన్నది.
ఈ చిత్రంలో ఐశ్వర్య మీనన్, రాహుల్ టైసన్, తనికెళ్ల భరణి, రవిశంకర్, శరత్ లోహితస్వ తదితరులు నటించారు. ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ ముగించుకొని వచ్చి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ ట్రెండింగ్‌గా నిలిచింది. ఇక ఈ సినిమా వివరాల్లోకి వెళితే..

భజే వాయువేగం సినిమాను ఖర్చుకు వెనుకడాకుండా క్వాలిటీతో రూపొందించడంతో ఈ మూవీ బడ్జెట్ 12 కోట్ల రూపాయలు అయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ సుమారుగా తెలుగు రాష్ట్రాల్లో 5.5 కోట్ల రూపాయలు, మొత్తంగా 6 కోట్ల మేర జరిగింది.
ఇక ఈ మూవీ సుమారుగా 650 స్క్రీన్లలో థియేట్రికల్ రిలీజ్ అయి.. సుమారుగా 12 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. దాంతో ఈ సినిమా హిట్‌గా బాక్సాఫీస్ వద్ద నిలిచింది. ఇక హిట్ రేసు నుంచి ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల ప్రశంసలు అందుకొంటున్నది.

భజే వాయువేగం సినిమా ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ ఫ్యాన్సీ రేటు చెల్లించి సొంతం చేసుకొన్నది. దాంతో ఈ సినిమాను నెటిఫ్లిక్స్ ప్రేక్షకుల వద్దకు తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో టాప్ ట్రెండింగ్‌గా నిలిచింది. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో రెండో స్థానంలో నిలిచింది.


Click it and Unblock the Notifications











