ఓటీటీలోకి వచ్చేసిన వణికించే హర్రర్ మూవీ.. ఒంటరిగా చూశారంటే అంతే!
ఎన్నో భాషల్లో అన్ని జోనర్లలో సినిమాలు వస్తుంటాయి. కానీ, కొన్ని మాత్రమే ప్రేక్షకులను థ్రిల్ చేస్తూ మంచి ఆదరణను సొంతం చేసుకుంటాయి. అలాంటి వాటిలో హర్రర్ సినిమాల పాత్ర ఎక్కువగా ఉంటుంది. ఈ తరహా మూవీలకు గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ రెస్పాన్స్ వస్తోంది. ఇలా చాలా రోజుల క్రితం విడుదలైన క్రేజీ హర్రర్ సినిమానే 'మిరల్' (Miral).
'ప్రేమిస్తే' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన భరత్ హీరోగా శక్తివేల్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమానే 'మిరల్'. మిస్టరీగా సాగే హర్రర్ కాన్సెప్టుతో తెరకెక్కిన ఈ సినిమా ఆరంభంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఫలితంగా ఈ సినిమా ఎన్నో అంచనాలను కూడా ఏర్పరచుకుంది. ఇలా భరత్ నటించిన ఈ చిత్రం గత ఏడాది నవంబర్ 11న రిలీజ్ అయింది.

అదిరిపోయే హర్రర్ ఎలిమెంట్స్‌తో రూపొందిన 'మిరల్' మూవీ ఆరంభంలోనే దీనికి మంచి టాక్ లభించలేదు. ఇందులో పాయింట్ పర్‌ఫెక్ట్‌గా ఉన్నా.. దాన్ని చూపించిన విధానం మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఫలితంగా ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ చిత్రం ఆశించిన రీతిలో వసూళ్లను రాబట్టలేదు. తద్వారా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశనే ఎదుర్కొంది.
డిఫరెంట్ కాన్సెప్టుతో రూపొంది విడుదలకు ముందే అంచనాలను ఏర్పరచుకోవడంతో 'మిరల్' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం ఓటీటీ సంస్థల నుంచి మంచి పోటీనే వస్తుందని అంతా అనుకున్నారు. కానీ, ఈ చిత్రం ఇప్పటి వరకూ తెలుగులో స్ట్రీమింగ్‌కు రాలేదు. ఈ పరిస్థితుల్లో ఆహా సంస్థ ఈ మూవీ హక్కులను తీసుకుంది. ఈ విషయాన్ని ఇటీవలే అధికారికంగా తెలిపింది.

కోలీవుడ్ హీరో భరత్ నటించిన 'మిరల్' మూవీని జూన్ 7వ తేదీ నుంచి ఆహా సంస్థ అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు తెలిపింది. అందుకు అనుగుణంగానే నేటి అర్ధరాత్రి నుంచి ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేస్తోంది. ఆహాలో ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోన్నట్లు తెలిసింది. చాలా మంది ఈ చిత్రాన్ని ఒంటరిగా చూడొద్దని సూచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. భరత్ - శక్తివేల్ కలయికలో రూపొందిన 'మిరల్' చిత్రాన్ని యాక్సెస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై జీ డిల్లీ బాబు నిర్మించారు. ఇందులో వాణి భోజన్ హీరోయిన్‌గా నటించగా.. కేఎస్ రవికుమార్, మీరా కృష్ణన్, రాజ్ కుమార్, అర్జాయి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ హర్రర్ మూవీకి ప్రసాద్ ఎస్‌ఎన్ మ్యూజిక్ కంపోజ్ చేశారు.


Click it and Unblock the Notifications











