BMW OTT Release: ఎట్టకేలకు భర్త మహాశయులకు విజ్ఞప్తి ఓటీటీ రిలీజ్.. ఎక్కడ? ఎప్పుడు చూడొచ్చంటే?

మాస్ మహారాజా రవితేజ హీరోగా యువ తారలు ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి జంటగా నటించిన చిత్రం భర్త మహాశయులకు విజ్ఞప్తి. SLV సినిమాస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో సెన్సిబుల్ డైరెక్టర్ కిషోర్ తిరుమల ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సునీల్, సత్య, వెన్నెల కిషోర్, సుధాకర్, మురళీధర్ గౌడ్ తదితరులు నటించారు.

ఈ సినిమాకు యువ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరెలియో సంగీతం అందించారు. ప్రసాద్ మూరేళ్ల సినిమాటోగ్రఫి, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, ఏఎస్ ప్రకాశ్ ఆర్ట్ విభాగాలను పర్యవేక్షించారు. రొమాంటిక్, ఫన్, ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ సినిమా జనవరి 13వ తేదీన గ్రాండ్‌గా రిలీజైంది. ఈ మూవీ బడ్జెట్ ఎంత? ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వాల్యూ ఎంత? ఈ చిత్రం థియేట్రికల్ రన్‌లో వసూలు చేసిన కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

BMW OTT Release

భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ సుమారుగా 40 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించారు. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ వాల్యూ సుమారుగా 20 కోట్ల రూపాయలుగా నిర్ణయించారు. ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 22.7 కోట్ల రూపాయల గ్రాస్, 12 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లను వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక థియేట్రికల్ రన్‌లో ఈ సినిమా సుమారుగా 60 శాతంపైగా రికవరీని సాధించింది అని పేర్కొన్నారు.

అయితే సంక్రాంతి రేసులో బరిలోకి దిగిన అలన్ని సినిమాలు కూడా ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. కానీ భర్త మహాశయుకులకు మాత్రం రిలీజ్ కాకపోవడంపై అనేక రూమర్లు మీడియాలో వినిపించాయి. కొన్ని ఆర్థిక సమస్యలు, తేల్చాల్సిన లెక్కల విషయంలో సర్దుబాటు కాకపోవడం వల్ల ఈ సినిమా ఓటీటీ రిలీజ్ ఆగిపోయిందనే విషయంపై ఊహాగానాలు వచ్చాయి. అయితే ఈ సినిమా విడుదలై దాదాపు 50 రోజులు కావొస్తున్న ఓటీటీలోకి రాకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

కానీ ఆ రూమర్లన్నిటికి చెక్ పెడుతూ, అనేక రకాల అడ్డంకులను దాటుకొని ఓటీటీలోకి రిలీజ్ వస్తున్నదనే వార్త మాస్ మహారాజా ఫ్యాన్స్‌కు ఆనందాన్ని అందిస్తున్నది. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను జీ5 సంస్థ దక్కించుకొన్నది. అన్ని రకాల సమస్యలను దాటుకొని ఈ సినిమాను మార్చి 13వ తేదీన రిలీజ్ చేసేందుకు నిర్ణయించారు. అయితే ఇంకా ఓటీటీ రిలీజ్ గురించి అధికారికంగా ఎలాంటి వార్త రాకపోవడంతో మళ్లీ సందేహాలే వ్యక్తమవుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అయి.. మాస్ ఆడియెన్స్‌కు జోష్ పెంచుతుందని ఆశిద్దాం.

More from Filmibeat

Read more about: bmw ravi teja ashika ranganath
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X