BMW OTT: భర్త మహాశయులకు విజ్ఞప్తి ఓటీటీ రిలీజ్‌పై ట్విస్ట్... రవితేజ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

వరుస ఫ్లాపులతో సతమతమవుతోన్న మాస్ మహారాజా రవితేజ ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో చేసిన సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి. కిశోర్ తిరుమల దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రవితేజ సరసన డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రం వరల్డ్ వైడ్‌గా విడుదలైంది. థియేట్రికల్ రన్‌ను ముగించుకుని దాదాపు నెల గడుస్తున్నా రవితేజ మూవీ ఇప్పటికీ ఓటీటీలోకి రాకపోవడం చర్చనీయాంశమైంది.

పెద్ద పండక్కి భర్త మహాశయులకు విజ్ఞప్తి కంటే వెనుక ముందు రిలీజైన ది రాజాసాబ్, మన శంకర వరప్రసాద్ గారు, అనగనగా ఒకరాజు, నారీ నారీ నారీ నడుమ మురారితో పాటు డబ్బింగ్ చిత్రం పరాశక్తి కూడా ఓటీటీలో రిలీజై రికార్డ్ వ్యూస్‌తో దూసుకెళ్తున్నాయి. కానీ భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ జాడ మాత్రం ఓటీటీలో లేదు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందనే చర్చ మొదలైంది? ఈ నేపథ్యంలో భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ ఓటీటీ విషయంలో ఏం జరుగుతోంది? అసలు సినిమా ఆన్‌లైన్‌లోకి వస్తుందా? లేదా? అనే వివరాలు పరిశీలిస్తే...

Bhartha Mahasayulaku Wignyapthi OTT Release Update Why Zee5 Delayed Ravi Teja s Film Streaming

భర్త మహాశయులకు విజ్ఞప్తి బడ్జెట్ ఎంత?
భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీలో సునీల్, సత్య, వెన్నెల కిశోర్, సుధాకర, మురళీధర్ గౌడ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. భీమ్స్ సిసిరిలియో సంగీత దర్శకత్వం వహించగా. ఏ శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా, ప్రసాద్ మూరేళ్ల సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీకి 40 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ సినిమా కోసం హీరో రవితేజ ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదు. .

భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత?
రవితేజ కొన్నేళ్లుగా వరుస డిజాస్టర్లతో సతమతమవుతున్న నేపథ్యంలో దాని ప్రభావం భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా బిజినెస్‌పై గట్టిగానే పడింది. ట్రేడ్ వర్గాలు అంతగా ఆసక్తి చూపించకపోవడంతో ఈ సినిమాకు చెప్పుకోదగ్గ స్థాయిలో థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ జరగలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆంధ్రా, నైజాం, సీడెడ్, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ మార్కెట్స్ కలిపి ఈ చిత్రానికి 20 కోట్ల రూపాయల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది. దాంతో రవితేజ మూవీ లాభాల్లోకి రావాలంటే 22 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్.. 45 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు బ్రేక్ ఈవెన్ నిర్దేశించారు.

భర్త మహాశయులకు విజ్ఞప్తి కలెక్షన్స్
భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీకి సంక్రాంతి సీజన్ కావడంతో మంచి వసూళ్లు రాబట్టింది. తొలిరోజు 2.6 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ రాబట్టగా.. తొలివారం 13.29 కోట్ల రూపాయలు, రెండో వారం 1.77 కోట్ల రూపాయలు చొప్పున థియేట్రికల్ రన్ ముగిసేసరికి ఇండియాలో 17.18 కోట్ల రూపాయల నెట్.. 20 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఓవర్సీస్‌లో 2.25 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తద్వారా వరల్డ్ వైడ్‌గా భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ 22 కోట్ల రూపాయలు మాత్రమే రాబట్టి నష్టాలను మిగిల్చింది. అయితే గత చిత్రాలతో పోలిస్తే భర్త మహాశయులకు విజ్ఞప్తి మాత్రం కాస్త ఊరటను కలిగించింది. సంక్రాంతికి భారీ సినిమాలు విడుదల కావడంతో రవితేజ సినిమాపై గట్టి ప్రభావం చూపిందని ట్రేడ్ విశ్లేషకులు తెలిపారు.

భర్త మహాశయులకు విజ్ఞప్తి ఏ ఓటీటీలో?
భర్త మహాశయులకు విజ్ఞప్తి డిజిటల్, శాటిలైట్ హక్కులను జీ గ్రూప్ దక్కించుకుంది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 13న ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్‌లోకి తీసుకురావాలని జీ గ్రూప్ భావించింది. అయితే చివరి నిమిషంలో ఈ సంస్థ తన నిర్ణయాన్ని మార్చుకుంది. దాదాపు వారం కావొస్తున్నా ఇంత వరకు భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ స్ట్రీమింగ్‌లోకి రాలేదు. దాంతో రవితేజ అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

భర్త మహాశయులకు విజ్ఞప్తి స్ట్రీమింగ్ ఎప్పుడు?
అయితే దీనికి కారణం సంక్రాంతి సినిమాలేనని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు మూవీ కూడా జీ5లోనే స్ట్రీమింగ్‌ అవుతూ ఓటీటీలో కొత్త రికార్డులు నెలకొల్పుతోంది. ఫిబ్రవరి 11న జీ5లో రిలీజైన మన శంకర వరప్రసాద్ గారు మూవీ కేవలం వారం రోజుల్లోనే 300 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్‌ మార్క్‌ను దాటేసింది. ఇప్పటికీ కూడా చిరంజీవి హవా చూపిస్తూనే ఇలాంటి దశలో రవితేజ సినిమా వస్తే.. రెండు చిత్రాలకు ఇబ్బంది కలుగుతుందని జీ5 డైలమాలో పడిందని, అందుకే భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌ను ప్రస్తుతానికి వాయిదా వేసినట్లుగా ఫిలింనగర్‌లో గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. అయితే మరో వెర్షన్ ప్రకారం ఫిబ్రవరి 20వ తేదీ శుక్రవారం భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీని ఓటీటీలోకి తీసుకొచ్చేందుకు జీ5 సిద్ధమైనట్లుగా వార్తలు వస్తున్నాయి. మరి ఈసారైనా రవితేజ మూవీ ఓటీటీలోకి వస్తుందా? లేక వాయిదా పడుతుందా? అనేది తెలియాలంటే కొద్దిగంటలు వెయిట్ చేయాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X