భర్త మహాశయులకు విజ్ఞప్తి ఓటీటీ రిలీజ్.. రవితేజ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడు?ఎక్కడంటే?

మాస్ మహారాజా రవితేజ హీరోగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఈ సినిమాలో రవితేజ సరసన డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలో భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందనే చర్చ మొదలైంది? ఈ నేపథ్యంలో రవితేజ మూవీ డిజిటల్ రైట్స్‌ని ఏ ఓటీటీ సంస్థ దక్కించుకుంది? స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి? అనే వివరాలు పరిశీలిస్తే...

భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీలో సునీల్, సత్య, వెన్నెల కిశోర్, సుధాకర, మురళీధర్ గౌడ్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. భీమ్స్ సిసిరిలియో సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఏ శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా, ప్రసాద్ మూరేళ్ల సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.

Bhartha Mahasayulaku Wignyapthi OTT Release When And Where To Watch Raviteja s Movie Online After Theatrical Run

భర్త మహాశయులకు విజ్ఞప్తి బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీకి 35 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ సినిమా కోసం హీరో రవితేజ ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదు. నిర్మాతలపై ఒత్తిడి తగ్గించేందుకు గాను ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత?
కొన్నేళ్లుగా వరుస డిజాస్టర్లతో సతమతమవుతున్న రవితేజకు ప్రస్తుతం ట్రాక్ రికార్డ్ ఏమంత బాగుండకపోవడంతో దాని ప్రభావం భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాపై గట్టిగానే పడింది. ట్రేడ్ వర్గాలు అంతగా ఆసక్తి చూపించకపోవడంతో ఈ సినిమాకు చెప్పుకోదగ్గ స్థాయిలో థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ జరిగలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆంధ్రా, నైజాం, సీడెడ్, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ మార్కెట్స్ కలిపి ఈ చిత్రానికి 20 కోట్ల రూపాయల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లుగా తెలుస్తోంది. దాంతో రవితేజ మూవీ లాభాల్లోకి రావాలంటే 25 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్.. 50 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు బ్రేక్ ఈవెన్ నిర్దేశించారు.

భర్త మహాశయులకు విజ్ఞప్తి ఏ ఓటీటీలో అంటే?
భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ డిజిటల్, శాటిలైట్ హక్కులను జీ స్టూడియోస్ సంస్థ దక్కించుకున్నట్లుగా ఫిలింనగర్ వర్గాలు తెలిపాయి. థియేటర్‌లో విడుదలైన నాలుగు వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ కావాలనే నిబంధన మేరకు ఈ డీల్ జరిగింది. అయితే ఈ డీల్ వాల్యూ ఎంత? ఎన్ని కోట్ల రూపాయలు? అనేది మాత్రం తెలియరాలేదు. దీని ప్రకారం ఫిబ్రవరి రెండో వారంలో భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే థియేట్రికల్ బిజినెస్‌ను బట్టి రవితేజ మూవీ స్ట్రీమింగ్ ఆలస్యంగా రావొచ్చు.. ముందుగానే ఓటీటీలో రిలీజ్ కావొచ్చు. దీనిపై త్వరలోనే జీ 5 సంస్థ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ సంక్రాంతికి చిన్నా, పెద్దా సినిమాలు కలిపి దాదాపు ఏడెనిమిది చిత్రాలు విడుదలవుతున్నాయి. ఈ పోటీలో భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రం ఎంత వరకు నిలబడుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X