Netflix Top 10 Films: నెట్ ఫ్లిక్ లో టాప్ 10 సినిమాలు.. ఈ బ్లాక్ బస్టర్ మూవీస్ మీరు చూశారా?

Netflix Top 10 Films: రోజురోజుకు ఓటీటీ క్రేజీ పెరుగుతోంది. సినిమాలను థియేటర్లలో చూసే వారికంటే ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ ల్లో సినిమాలు చూసే వారి సంఖ్య పెరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ప్లాట్ఫార్మ్స్ ఉన్నప్పటికీ నెట్‌ ఫ్లిక్స్ (Netflix) కు మాత్రం అత్యధిక సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. ఈ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో నిత్యం సరికొత్త సినిమాలతో సందడి చేస్తుంది. ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందించడానికి స్ట్రాంగ్ కంటెంట్ ను అందిస్తోంది. నిత్యం కొత్త సినిమాలు, వెబ్ సీరిస్ లతో సందడి చేస్తోంది. అలా నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోన్న టాప్ 10 మూవీస్ ఏంటో ఓ లూక్కేయండి.

నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 మూవీస్ ...

భూల్ భులయ్యా 3 (Bhool Bhulaiyaa 3): బాలీవుడ్‌లో సూపర్ హిట్ ఫ్రాంఛైజీ భూల్ భులయ్యా నుంచి విడుదలైన మూడో సినిమా 'భూల్ భులయ్యా 3'. హారర్, కామెడీ, థ్రిల్లింగ్‌ గా తెరకెక్కింది ఈ మూవీ. ఈ సినిమాలో కార్తీక్‌ ఆర్యన్‌, తృప్తి డిమ్రి,విద్యాబాలన్‌, మాధురీ దీక్షిత్‌ నటించారు. ఈ మూవీ నవంబర్‌ 1న విడుదలైంది. అనీస్‌ బజ్మీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, మురాద్ ఖేతాని భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద రూ. 450 కోట్లు పైగానే కలెక్షన్స్‌ రాబట్టిన ఈ మూవీ Bhool Bhulaiyaa 3 డిసెంబర్ 27 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

Bhool Bhulaiyaa 3 Lucky Baskhar Laila Majnu amaran super hit Movies on Netflix Right Now

Lucky Baskhar: దీపావళి సందర్భంగా విడుదలైన సినిమాల్లో ఒక్కటి 'లక్కీ భాస్కర్'. ఈ సినిమాతో దుల్కర్ సల్మాన్ మరోసారి తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. అక్టోబర్‌ 31న థియేటర్స్‌లోకి వచ్చిన లక్కీ భాస్కర్‌ సుమారు రూ. 100 కోట్లకు పైగానే కలెక్షన్స్‌ చేసింది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా 'లక్కీ భాస్కర్' చిత్రాన్ని నిర్మించారు. తెలుగుతో పాటు తమిళ్‌, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో విడుదలై సూపర్ డూపర్ సక్సెస్ అయిన ఈ లక్కీ భాస్కర్ మూవీ నవంబర్‌ 28 నుంచి లక్కీ భాస్కర్‌ ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతోంది.

Amaran OTT: దీపావళి కానుకగా విడుదలైన సినిమాలలో బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా 'అమరన్'. తమిళనాడుకు చెందిన మేజర్ ముకుంద వరదరాజన్ ఉగ్రవాదులతో చేసిన పోరాటంలో అమరుడు అయ్యారు. ఆయన జీవితం ఆధారంగా 'అమరన్' సినిమాను రూపొందించారు. ఇందులో మేజర్ పాత్రలో కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్ నటించగా, సాయి పల్లవి మేజర్ భార్య ఇందు రెబెకా వర్గీస్ గా నటించింది. ఈ సినిమాకు రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించగా.. తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ నిర్మించారు. అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ టాక్ అందుకున్న ఈ మూవీ డిసెంబర్ 5 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

Bhool Bhulaiyaa 3 Lucky Baskhar Laila Majnu amaran super hit Movies on Netflix Right Now

సికందర్ కా ముఖద్దర్: తమన్నా లీడ్ లో నటించిన మూవీ సికందర్ కా ముఖద్దర్ (Sikandar Ka Muqaddar). ఈ మూవీకి నీరజ్ పాండే దర్శకత్వం వహిస్తున్నారు. సికందర్ కా ముఖద్దర్‌లో తమన్నా భాటియా, అవినాష్ తివారీ, జిమ్మీ షెర్గిల్, రాజీవ్ మెహతా, దివ్య దత్తా, జోయా అఫ్రోజ్ నటించారు. నటి టబు, అజయ్ దేవగన్ జంటగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ 'ఔరోన్ మే కహన్ దమ్ థా'కి కూడా నీరజ్ పాండే దర్శకత్వం వహించారు. ఈ మూవీ డైరెక్ట గా ఓటీటీలోనే నవంబర్ 29 న విడుదలైంది. ఇవే కాకుండా.. లైలా మజ్ను, సోర్గవాసల్, వీరే ది వెడ్డింగ్, విక్కీ విద్యా కా వో వాలా వీడియో, రేస్ 3, క్యారీ ఆన్ వంటి బ్లాక్ బస్టర్ మూవీ నెటిఫ్లిక్స్ లో స్టీమింగ్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X