Operation Sindoor ఎఫెక్ట్.. డైరెక్ట్‌‌గా ఓటీటీలోకి స్టార్ హీరో మూవీ, రిలీజ్ ఎప్పుడంటే?

జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఏప్రిల్ 22న 26 మంది పర్యాటకులను పొట్టన పెట్టుకున్న ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం మే 7న ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై మెరుపు దాడులకు దిగిన సంగతి తెలిసిందే. 9 ప్రాంతాల్లో ఉన్న ఉగ్రవాద స్థావరాలను భారత సైన్యం నేలమట్టం చేసి 100 మందికి పైగా తీవ్రవాదులను హతమార్చింది. ఈ పరిణామాలతో భారత్ - పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతవరణం నెలకొంది. ఇండియా దాడులకు కౌంటర్‌గా పాకిస్తాన్ సైతం డ్రోన్లు, మిస్సైళ్లతో మనదేశంలోని కీలక మిలటరీ స్థావరాలను టార్గెట్ చేయగా భారత సైన్యం గాల్లోనే వాటిని నేలకూల్చింది.

భారత్ - పాక్ మధ్య ఉద్రిక్తతలు

భారత్ - పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2025)ని బీసీసీఐ రద్దు చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భారత సైన్యం ఇప్పటికే హెచ్చరించిన నేపథ్యంలో బహిరంగ ప్రదేశాలు, జనం భారీ ఎత్తున గుమిగూడే కార్యక్రమాలపై ప్రభుత్వం సూచనలు చేసింది. ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో సినిమాల విడుదలలు, ఇతర ఈవెంట్స్‌ను భారతీయ చిత్ర పరిశ్రమ రద్దు చేసింది. ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ హీరో రాజ్ కుమార్ రావు నటించిన సినిమా విడుదల విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకున్నారు నిర్మాతలు.

Bhool Chuk Maaf OTT Release here is the Rajkummar Rao and Wamiqa Gabbi s Movie ott streaming details

ధనశ్రీ వర్మ స్పెషల్ సాంగ్

రాజ్‌కుమార్ రావు, వామికా గబ్బీ కీలకపాత్రల్లో నటించిన చిత్రం భూల్ చుక్ మాఫ్. రొమాంటిక్, కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాపై బాలీవుడ్‌లో భారీ అంచనాలున్నాయి. కరణ్ శర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. సీమా పహ్వా, సంజయ్ మిశ్రా, జకీర్ హుస్సేన్, రఘుబీర్ యాదవ్, ఇస్తియాక్ ఖాన్, జయ్ థక్కర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్, మద్దూక్ ఫిలిమ్స్ బ్యానర్‌పై దినేష్ విజాన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. భూల్ చుక్ మాఫ్ చిత్రానికి కేతన్ సోదా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించగా.. తనిష్క్ బాగ్చి స్వరాలు అందించారు. సందీప్ ఛటర్జీ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. ఇక టీమిండియా స్టార్ క్రికెటర్ యజువేంద్ర చాహల్‌ మాజీ భార్య ధనశ్రీ వర్మ ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడంతో బజ్ నెలకొంది.

మే 9ని లాక్ చేసిన చిత్ర యూనిట్

ఛావాతో రూ.800 కోట్లకు పైగా కలెక్షన్స్‌తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మద్దూక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై భూల్ చుక్ మాఫ్ సినిమా రావడంతో బాలీవుడ్‌లోనూ అంచనాలు మిన్నంటాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్‌లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. సమ్మర్ కానుకగా మే 9న భూల్ చుక్ మాఫ్ సినిమాను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అయితే ప్రస్తుతం భారత్- పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్ధితుల నేపథ్యంలో థియేట్రికల్ రిలీజ్‌ను చిత్ర యూనిట్ రద్దు చేసింది.

దేశ భద్రతే మాకు ముఖ్యం

ఈ మేరకు సోషల్ మీడియాలో అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది. దానికి బదులుగా నేరుగా ఓటీటీలో ఈ సినిమాను రిలీజ్ చేయాలని నిర్ణయించింది. దేశ భద్రతకు, స్పూర్తిగా తాము మొదటి ప్రాధాన్యత ఇస్తామని చిత్ర నిర్మాణ సంస్థ తెలిపింది. మే 16 నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా భూల్ చుక్ మాఫ్‌ను అందుబాటులో ఉంచుతున్నట్లు ప్రకటించింది. మరి వరుస విజయాలతో ఊపులో ఉన్న రాజ్‌కుమార్ రావు ఈ సినిమాతో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో వేచి చూడాలి.

More from Filmibeat

Read more about: rajkummar rao wamiqa gabbi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X