OTTలోకి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ.. ప్రతి సీన్‌కు దిమ్మతిరిగే ట్విస్ట్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఓటీటీలోకి సరికొత్త మరో ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ రాబోతుంది. ప్రతి సీన్ కు దిమ్మతిరిగే ట్విస్టులు ఉండనున్నాయి. ఇలాంటి సినిమాలకు ఓటీటీలో మంచి రెస్పాన్స్ ఉంటుంది. అందుకే ఓటీటీ సంస్థలు సైతం ఇలాంటి సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేస్తున్నాయి. తాజాగా అలాంటి కొత్త సినిమాను ప్రేక్షకుల కోసం తీసుకువచ్చింది. అసలు ఆ మూవీ ఏంటి.. ఎందులో చూడాలి అనే వివరాలు ఈ స్టోరీలో చూసేద్దాం పదండి.

ఫ్యాంటసీ డిటెక్టివ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్
ఇటీవల కాలంలో సినిమాలు రిలీజ్ అయిన నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మరో థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. ఆ సినిమా ఏదో కాదు.. తెలుగులో బాగా బజ్ క్రియేట్ చేసిన భూతద్దం భాస్కర్ నారాయణ మూవీ. ఈ సినిమా థియేటర్లలో విడుడలైన నాలుగు వారాల్లోనే డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేందుకు సిద్ధం అయిపోయింది. ఫ్యాంటసీ డిటెక్టివ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కింది ఈ చిత్రం.

Bhoothaddam Bhaskar Narayana Movie Streaming on Aha OTT From March 22 Full Details Here

ఈ సినిమాపై ప్రేక్షకులు ఆసక్తి
భూతద్దం భాస్కర్ నారాయణ మూవీలో యంగ్ హీరో శివ కందూకూరి హీరోగా నటించాడు. ఇక ఈ చిత్రంలో రాశి సింగ్, దేవీ ప్రసాద్, వర్షిణి సౌందరరాజన్ తదితరులు ఇతర పాత్రల్లో నటించి మెప్పించారు. పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహించగా.. మొదటి నుంచి ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. టీజర్లు, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు ఆసక్తి చూపించారు. ప్రమోషన్లు కూడా బాగానే నిర్వహించారు.

బాక్సాఫీస్ వద్ద మోస్తరు వసూళ్లు
మార్చి 1న భూతద్దం భాస్కర్ నారాయణ సినిమా థియేటర్లోకి వచ్చింది. ఇక విడుదల అయిన మొదటి రోజు నుంచే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ లభించింది. కథా, కథనాలు ఆసక్తికరంగా ఉండడంతో బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. కమర్షియల్ హిట్ కాకపోయినా... మంచి వసూళ్లను రాబట్టింది ఈ చిత్రం. ఇలా థియేటర్లలో ఆడియెన్స్ మెప్పు పొందిన భూతద్దం భాస్కర్ నారాయణ.. ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది.

Bhoothaddam Bhaskar Narayana Movie Streaming on Aha OTT From March 22 Full Details Here

దిమ్మతిరిగే ట్విస్టు..
భూతద్దం భాస్కర్ నారాయణ సినిమాను ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను కొనుగోలు చేసింది. ఈ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమా మార్చి 22వ తేదీ నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రానుంది. తాజాగా ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ఆహా ఓటీటీ ప్రకటించింది. 'బొమ్మ కనిపించే ప్రతీసారీ దిమ్మతిరిగే ట్విస్టు ఉంటది! అదెంటో తెలుసుకోవాలని ఉందా?' అంటూ ఆహా రాసుకువచ్చింది.

ఓటీటీలో స్ట్రీమింగ్
భూతద్దం భాస్కర్ నారాయణ సినిమాలో శివకుమార్, షఫీ, సురభి సంతోష్, శివన్నారాయణ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. స్నేహల్ జంగల, శశిధర్ కాశీ, కార్తిక్ ముడుంబి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. బేబీ ఫేమ్ విజయ్ బుల్గానిన్, శ్రీచరణ్ పాకాల సంగీతం అందించగా... గ్యారీ బీహెచ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో జరిగే వరుస హత్యల వెనక ఉన్న మిస్టరీని ఛేదించడమే ఈ సినిమా కథ. మరి ఇందులో హీరో చివరకు ఏం చేశాడు అనేది చూడాలనుకుంటే ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X