ఓటీటీలోకి వెన్నులో వణుకు పుట్టించే క్రైమ్ థ్రిల్లర్.. ఎందులో వచ్చిందంటే!
గతంలో కంటే ఈ మధ్య కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో సైకో క్రైమ్ థ్రిల్లర్ మూవీలు ఎక్కువగా వస్తున్నాయి. అలాంటి వాటికి థియేటర్లతో పాటు ఓటీటీలోనూ అదిరిపోయే స్పందన లభిస్తోంది. ఫలితంగా ఇలాంటి సినిమాలు మంచి విజయాలను, ఫీడ్ బ్యాక్‌ను అందుకుంటున్నాయి. అలా ఇటీవలే విడుదలైన మరో క్రైమ్ థ్రిల్లర్ మూవీనే 'భూతద్దం భాస్కర్ నారాయణ'.
శివ కందుకూరి ప్రధాన పాత్రలో పురుషోత్తం రాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రమే 'భూతద్దం భాస్కర్ నారాయణ'. సీరియల్ కిల్లర్ కథకు పురాణాలను జోడించి ఈ సినిమాను తెరకెక్కించారు. దీంతో ఈ మూవీ ఆరంభంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఫలితంగా విడుదలకు ముందే భారీ స్థాయిలో అంచనాలను కూడా ఏర్పరచుకున్న విషయం తెలిసిందే.

క్రేజీ బజ్‌తో 'భూతద్దం భాస్కర్ నారాయణ' మూవీ మార్చి 1వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. కానీ, ఆరంభంలోనే ఈ సినిమాకు మంచి టాక్ రాలేదు. దీనికి కారణం ఇందులో పాయింట్ పర్‌ఫెక్ట్‌గా ఉన్నా.. దాన్ని చూపించిన విధానం కాస్త నిరాశ పరచడమే. ఫలితంగా ఈ చిత్రం టార్గెట్‌ను చేరుకోలేక పరాజయాన్ని మూటగట్టుకుంది.
వెన్నులో వణుకు పుట్టించే స్టోరీ లైన్‌తో రూపొందిన మూవీ కావడంతో పాటు విడుదలకు ముందే అంచనాలను ఏర్పరచుకోవడంతో 'భూతద్దం భాస్కర్ నారాయణ' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం ఓటీటీ సంస్థ నుంచి మంచి పోటీనే వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను తెలుగు ఓటీటీ సంస్థ ఆహా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

యంగ్ హీరో శివ కందుకూరి నటించిన 'భూతద్దం భాస్కర్ నారాయణ' మూవీని ఆహా సంస్థ గత ఆర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్‌కు తీసుకు వచ్చేసింది. సాధారణ సబ్‌స్క్రిప్షన్ ఉన్న వాళ్లు కూడా ఈ సినిమాను అందులో చూసేలా స్ట్రీమింగ్ చేస్తోంది. ఇక, థియేటర్లలో మాదిరిగా కాకుండా ఆహాలో 'భూతద్దం భాస్కర్ నారాయణ'కు మంచి రెస్పాన్స్ లభిస్తోందని తెలిసింది.
ఇదిలా ఉండగా.. శివ కందుకూరి - పురుషోత్తం రాజ్ కాంబినేషన్‌లో రూపొందిన 'భూతద్దం భాస్కర్ నారాయణ' చిత్రాన్ని మిలియన్ డ్రీమ్స్ క్రియేషన్స్, విజయ సారంగ ప్రొడక్షన్స్ బ్యానర్లపై స్నేహల్, కార్తీక్, శశిధర్‌లు నిర్మించారు. ఇందులో రాశీ సింగ్ హీరోయిన్‌గా.. అరుణ్ కుమార్, దేవీ ప్రసాద్, వర్షిణి తదితరులు నటించారు. శ్రీ చరణ్ పాకాల, విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











