OTT: ఓటీటీలోకి కల్కి 2898 AD.. బిగ్ చేంజ్ తో కిర్రాక్ అనిపించేలా!
చాలా కాలం తర్వాత తెలుగు సినిమా నుంచి వచ్చిన ఓ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసింది. మరి ఆ సినిమానే రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన అవైటెడ్ సెన్సేషనల్ ప్రాజెక్ట్ చిత్రం "కల్కి 2898 ఎడి" అని చెప్పాలి. మరి చాలా నెలలు నుంచి తెలుగు సినిమా నుంచి ఓ బిగ్ స్టార్ పాన్ ఇండియా సినిమా లేక థియేటర్స్ కూడా వెలవెలబోయాయి. ఇక ఒక్కసారి కల్కి ఆగమనంతో మూసుకుపోయిన థియేటర్స్ తలుపులు కూడా తెరుచుకున్నాయి.
ఇలా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ సక్సెస్ ని ఈ చిత్రం అందుకోగా ఈ చిత్రం థియేటర్స్ లో 5 వారాలకి పైగానే సక్సెస్ ఫుల్ గా మంచి రన్ తో కొనసాగింది. కాగా ఈ సమయంలో కల్కి ఓటిటి ఎంట్రీపై పలు రూమర్స్ కూడా వచ్చాయి. నిజానికి ఈ చిత్రాన్ని ప్రముఖ సంస్థ అమేజాన్ ప్రైమ్ వీడియో వారు సౌత్ భాషల్లో సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.

కాగా ఇందులో ఈ చిత్రం మొదటిగా సెప్టెంబర్ 6న వినాయక చవితి కానుకగా వస్తుంది అని పలు రూమర్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు కల్కి ఓటిటి ఎంట్రీపై మరికొన్ని ఆసక్తికర గాసిప్స్ వినిపిస్తున్నాయి. దీనితో ఈ చిత్రం ఓటిటి వెర్షన్ కి ఓ బిగ్ ఛేంజ్ తో రాబోతుందట. మాములుగా ఈ చిత్రం థియేటర్స్ లో 3 గంటల నిడివితో వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.
అయితే స్టార్టింగ్ లో సినిమా ఫస్టాఫ్ చాలా స్లో గా ఉందని కొన్ని సీన్స్ తీసేయాల్సింది అంటూ కామెంట్స్ వచ్చాయి కానీ సెకండాఫ్ బాగుండేసరికి జనం అలా ఉన్నా చూసేసారు. మరి ఇప్పుడు దీనిని ఓటిటి వెర్షన్ కి సెట్ చేయనున్నారట. దీనితో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం ట్రిమ్ చేసిన వెర్షన్ తో రానున్నట్టుగా ఇపుడు తెలుస్తుంది.

అలాగే ఈ చిత్రం రెంటల్ గా ఈ ఆగస్ట్ 23 నుంచే పాన్ సౌత్ భాషల్లో రానుండగా ఇందులో నుంచే సినిమా ఈ బిగ్ ఛేంజ్ తో స్ట్రీమ్ కానున్నట్టుగా ఇపుడు తాజా రూమర్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి అయితే ఇలా కల్కి చిత్రం సాలిడ్ మార్పులుతో రాబోతుంది అని చెప్పాలి. మరి ఈ మాసివ్ ప్రాజెక్ట్ లో ప్రభాస్ తో పాటుగా అనేకమంది స్టార్ హీరోస్ అండ్ హీరోయిన్స్ కూడా నటించారు.
యూనివర్సల్ హీరో కమల్ హాసన్ పవర్ ఫుల్ విలన్ గా కనిపించగా బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ఇటీవల కాలంలో బాలీవుడ్ లో కూడా చేయని ముఖ్య పాత్రలో సినిమా ఆద్యంతం కొనసాగారు. ఇక వీరితో పాటుగా దీపికా పదుకొనె, దిశా పటానిలు ఫీమేల్ లీడ్ లలో కనిపించారు. ఇంకా వీరితో పాటుగా దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రాజేంద్ర ప్రసాద్, శోభన వంటి ప్రముఖ నటులు కూడా ఈ చిత్రంలో ప్రామినెంట్ పాత్రల్లో కనిపించారు. అలాగే సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ వరల్డ్ క్లాస్ మ్యూజిక్ ని ఈ చిత్రానికి అందించగా నిర్మాత అశ్విని దత్ ఈ చిత్రాన్ని 600 కోట్లకి పైగా బడ్జెట్ తో నిర్మాణం వహించారు.


Click it and Unblock the Notifications











