OTT: ఓటీటీలోకి శివకార్తీకేయన్ "అమరన్" .. ఎప్పుడు ఎక్కడంటే?
ఈ ఏడాది ఫెస్టివల్స్ కి బాక్సాఫీస్ దగ్గర పలు చిత్రాలు సెన్సేషనల్ హిట్స్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ హిట్ లిస్ట్‌లో రీసెంట్ దీపావళి కానుకగా వచ్చిన సినిమాలు కూడా ఉన్నాయని చెప్పాలి. నిజానికి ఈ మొత్తం ఏడాదిలో వచ్చిన పండుగల బాక్సాఫీస్ యుద్ధంలో ఒక్క దీపావళి సీజన్ మాత్రమే బిగ్ హిట్స్ ని చూసింది అని చెప్పాలి.
ఆ టైంలో వచ్చిన దాదాపు అన్ని సినిమాలు కూడా మంచి పెర్ఫామెన్స్ ని కనబరిచాయి. కాగా ఈ దీపావళి కానుకగా సౌత్ లో మొత్తం నాలుగు సినిమాలు విడుదల కాగా వీటిలో మూడు సినిమాలు బిగ్ హిట్స్ అయ్యాయి. అయితే ఈ మొత్తం నాలుగుంటిలో మూడు సినిమాలు నెల లోపే ఓటిటి రిలీజ్ కి వచ్చేసాయి. కాగా థియేటర్స్ లో దీపావళి కానుకగా తెలుగు నుంచి "క", "లక్కీ భాస్కర్" సినిమాలు విడుదలకి రాగ కన్నడ నుంచి "బఘీర" తమిళ్ సినిమా నుంచి "అమరన్" సినిమాలు వచ్చాయి.

వీటిలో ఒక్క అమరన్ మినహా మిగతా సినిమాలు అన్నీ ఓటిటిలో విడుదలకి వచ్చేసాయి. అయితే సాయి పల్లవి, శివ కార్తికేయన్ నటించిన బిగ్గెస్ట్ హిట్ చిత్రం అమరన్ కూడా వీటి లానే నెల లోపే వచ్చేయాల్సిందే కానీ ఈ సినిమా కనబరుస్తున్న వసూళ్లు చూసి ట్రేడ్ పండితులే షాకయ్యారు. దాదాపు 300 కోట్లకి పైగా వసూళ్లు అందుకొని శివ కార్తికేయన్ కెరీర్ లోనే ఈ సినిమా హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచి తమిళ నాట పలువురు స్టార్స్ కూడా అందుకోని ఫీట్ ని సెట్ చేసింది.
దీనితో మేకర్స్ ఓ వారం తర్వాత మాత్రమే ఓటిటికి ఇవ్వాలని అనుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. దీనిలో భాగంగానే ఈ సినిమా ఓటిటి కొత్త డేట్ ఓ వారం తర్వాతే వచ్చింది. కాగా ఈ సినిమా ఓటిటి హక్కులు వరల్డ్ పాపులర్ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇపుడు ఫైనల్ గా వీరు ఈ అవైటెడ్ సినిమా రిలీజ్ కి డేట్ ని ఇచ్చేసారు.

దీనితో సెన్సేషనల్ హిట్ "అమరన్" చిత్రం వచ్చే గురువారం నుంచి స్ట్రీమింగ్ కి రాబోతున్నట్టుగా తెలిపారు. అంటే ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీ నుంచి పాన్ ఇండియా భాషల్లో అందుబాటులోకి రానుంది. సో ఎట్టకేలకి సినిమా బిగ్గెస్ట్ హిట్ అయ్యిన నేపథ్యంలో వారం ఆలస్యంగానే వస్తుంది అని చెప్పాలి.
Blockbuster #Amaran OTT Streaming From Dec 5th on #Netflix #Sivakarthikeyan #SaiPallavi #RajkumarPeriyasamy #GVPrakash pic.twitter.com/0YztEfV8Td
— Tamil TV Channel Express (@TamilTvChanExp) November 30, 2024
ఇక ఈ ఎమోషనల్ బయోపిక్ చిత్రాన్ని దర్శకుడు పెరియసామి తెరకెక్కించగా రియల్ లైఫ్ హీరో, అమరవీరుడు మేజర్ ముకుందన్ వరదరాజన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించారు. మరి ఈ సినిమా తెలుగులో కూడా భారీ వసూళ్లు అందుకొని మంచి లాభాలు అందించింది. సో ఈ అవైటెడ్ హిట్ సినిమాని చూడాలి అంటే అప్పటి వరకు ఆగాల్సిందే అని చెప్పాలి. కాగా ఈ చిత్రానికి జివి ప్రకాష్ సంగీతం అందించగా కమల్ హాసన్ నిర్మాణం వహించారు.


Click it and Unblock the Notifications











