24 గంటల గ్యాప్‌లో ఓటీటీలోకి రెండు హార్రర్ థ్రిల్లర్స్.. స్ట్రీమింగ్ ఎందులో అంటే?
క్రైమ్, థ్రిల్లర్, సస్పెన్స్, హార్రర్ చిత్రాలకు ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. ఓటీటీల రాకతో ఇది పీక్స్‌కు చేరింది. వీటిని ఇష్టపడే ప్రేక్షకులు గతంలో సినిమాలు వచ్చినప్పుడే వాటిని చూడటానికి వీలుండేది కానీ ఇప్పుడు ఓటీటీల రాకతో భారతీయ చిత్రాలతో పాటు ప్రపంచంలోని ఏమూల ఉన్న సినిమాలనైనా క్షణాల్లో చూసే వీలు కలుగుతోంది. ప్రతి వారం ఏదో ఒక ఓటీటీలో హార్రర్ సినిమాలు వస్తూనే ఉన్నాయి. దీనికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఓటీటీ సంస్థలు పంచుకుంటూ ఉంటాయి. తాజాగా ఈ వారం కేవలం 24 గంటల వ్యవధిలో రెండు సినిమాలు ఓటీటీలో రిలీజ్ కానున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..
క్రైమ్ చిత్రాలకు కేరాఫ్‌గా మలయాళ ఇండస్ట్రీ
ఇండియాలో క్రైమ్, సస్పెన్స్, హార్రర్ సినిమాలకు మలయాళ చిత్ర పరిశ్రమ కేరాఫ్ అన్న సంగతి తెలిసిందే. కోవిడ్ సమయంలో ఓటీటీలోకి మలయాళ సినిమాలు పెద్ద ఎత్తున రావడంతో వీరి మేకింగ్ స్టైల్‌కు అంతా ఫిదా అయిపోయారు. ఓటీటీ ఇండస్ట్రీలో మలయాళ చిత్రాలదే డామినేషన్. కోవిడ్ లాక్‌డౌన్ నుంచి మలయాళం నుంచి వచ్చే సినిమాలకు ఓటీటీలో సెపరేట్ ఫాలోయింగ్ ఏర్పడింది. రీసెంట్‌గా రిలీజ్ అవుతున్న సినిమాలే కాకుండా పాత సినిమాలను కూడా ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకొస్తున్నారు. తాజాగా ఈ వారం కేవలం 24 గంటల వ్యవధిలో రెండు సినిమాలు ఓటీటీలో రిలీజ్ కానున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..

ఓటీటీలోకి డీమన్
తమిళంలో రెండేళ్ల క్రితం వచ్చిన డీమన్ చిత్రం తాజాగా ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్దమైంది. సచిన్ మణి, అబర్నతి, శృతి పెరియస్వామిలు నటించిన ఈ సినిమాకు రమేశ్ పళనివేల్ దర్శకత్వంలో వహించారు. విండోస్ బాయ్స్ పిక్చర్స్ బ్యానర్‌పై దీనిని ఆర్ సోమసుందరం ఈ చిత్రాన్ని నిర్మించారు. రోణి రాఫెల్ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చగా.. ఆర్ఎస్ ఆనందకుమార్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. 22 సెప్టెంబర్ 2023న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. థియేటర్‌లోకి వచ్చిన రెండు నెలలకు నవంబర్ 24, 2024న ఈ సినిమా ఓటీటీలో రిలీజైంది.
ఆహాలో డీమన్
తమిళంలో వచ్చినప్పటికీ తెలుగులో ఈ సినిమా రిలీజ్ అయినా తెలుగులో మాత్రం ఇంత వరకు ఈ సినిమా అందుబాటులోకి రాలేదు. తాజాగా ఈ సస్పెన్స్‌కు తెరదించింది ఆహా. మే 29 నుంచి ఈ డీమన్ చిత్రం ఆహా ఓటీటీలో ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. తమిళంలో ఆకట్టుకున్న ఈ సినిమా మరి తెలుగు ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
సన్ నెక్ట్స్‌లో బిగ్‌బెన్
ఇక ఓటీటీలోకి రానున్న మరో హార్రర్ చిత్రం బిగ్‌బెన్. బినో అగస్టీన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనుమోహన్, వినోయ్ పోర్ట్, అదితి రవి, మియా జార్జ్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాను వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. గతేడాది ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా హిట్‌గా నిలిచింది. దాదాపు ఏడాది పూర్తికావొస్తున్నా ఓటీటీ జాడ లేకపోవడంతో ప్రేక్షకులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. మే 30 నుంచి సన్ నెక్ట్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.


Click it and Unblock the Notifications











