Bigg Bigg Non Stop Finale live.. టాప్ 5 నుంచి డ్రామా క్వీన్ అవుట్.. కంటతడి పెట్టుకొన్న కంటెస్టెంట్ బావ
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ రియాలిటీ షో నుంచి మిత్రా శర్మ ఎలిమినేట్ అయింది. అంతకు ముందు టాప్ 7 కంటెస్టెంట్స్ నుంచి బాబా భాస్కర్, అనిల్ రాథోడ్ ఎలిమినేట్ అయ్యారు. వేదికపైన సినీ తారల తళుకుబెళుకుల మధ్య నామినేషన్ ప్రక్రియను హోస్ట్ నాగార్జున చేపట్టారు. టాప్ 5లో ఉన్న అఖిల్ సార్థక్, బిందు మాధవి, యాంకర్ శివ, అరియానా గ్లోరి, మిత్రా శర్మతో ఫైనల్ ఎలిమినేషన్‌ను ఆసక్తికరంగా చేపట్టారు. టాప్ 5 కంటెస్టెంట్ల ఎలిమినేషన్‌ను ఎలా కొనసాగించారంటే..

గన్స్ పేల్చి ఎలిమినేషన్
టాప్ 5 కంటెస్టెంట్ ఎలిమినేషన్‌కు ముందు ఇంటి ఆవరణలో గన్స్ పెట్టి ప్రక్రియను ప్రారంభించారు. రెడ్ కలర్ వచ్చిన కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతారని చెప్పారు. అయితే మిత్రా శర్మ పేరు చెప్పగానే.. రెడ్ కలర్ రావడంతో హోస్ట్ నాగార్జున ఎలిమినేట్ అయ్యారని చెప్పారు. దాంతో మిత్రా శర్మ ఎలిమినేషన్ ప్రక్రియ ముగిసింది.

12 వారాల పాటు మిత్రా శర్మ జర్నీ
బిగ్‌బాస్ నాన్ స్టాప్ జర్నీ ముగిసిన వెంటనే ఇంటి సభ్యులకు వీడ్కోలు చెబుతూ ఎమోషనల్‌గా మాట్లాడారు. ఇంత వరకు నా జర్నీ రావడం గొప్పగా ఫీలవుతున్నాను. సాధారణమైన కంటెస్టెంట్‌గా వచ్చి 12 వారాలపాటు ఇంటిలో ఉండటం ద్వారా మంచి ఫ్యామిలీని సంపాదించుకొన్నాను అని మిత్రా శర్మ అన్నారు.

సెన్సేషనల్ డ్రామా క్వీన్‌గా ఎలిమినేషన్
ఎలిమినేషన్ తర్వాత ఇంటి నుంచి బయటకు వస్తూ.. హరిహర శంభో శంకర అంటూ శంకరుడిని కీర్తించింది. శివనామ స్మరణతో చేస్తూ ఇంటి నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేసింది. సెన్సషనల్ డ్రామా క్వీన్ అనే టైటిల్‌ను సంపాదించుకొన్నాను. హ్యాష్ ట్యాగ్ డ్రామా అంటూ ఇంటి నుంచి బయటకు వచ్చి హోస్ట్ నాగార్జునతో వేదిక మీదకు చేరింది.

టాప్ 5లో ఉండటం హ్యాపీగా
హోస్ట్ నాగార్జునతో మిత్రా శర్మ మాట్లాడుతూ.. నా జర్నీతో నేను పూర్తిగా సంతృప్తి చెందాను. పరిస్థితులను ఆకలింపు చేసుకోవడం, ఎదురయ్యే పరిస్థితులను అంగీకరించడం నేర్చుకొన్నాను. టాప్ 5లో ఉండటం నాకు చాలా హ్యపీగా ఉంది. 12 వారాల పాటు ప్రేక్షకుల నుంచి మద్దతు లభించింది. అదే నాకు గర్వంగా ఉంది అని మిత్రా శర్మ చెప్పింది.

బావ కంటతడి పెట్టడంతో..
బిగ్‌బాస్ వేదికపైన నాగార్జునతో మాట్లాడుతుంటే.. మిత్రా శర్మ ఎమోషనల్ అయ్యారు. మిత్రా శర్మ మాట్లాడుతుంటే.. ఆమె బావ కంటతడి పెట్టుకొన్నారు. అది గమనించిన నాగార్జున.. మీ బావ కన్నీళ్లు పెట్టుకొన్నారు. మీరు అతడి వద్దకు వెళ్లి కూర్చొండని చెప్పడంతో మిత్రా శర్మ ఎమోషనల్ జర్నీ బిగ్‌బాస్ నాన్ స్టాప్‌లో ముగిసింది.


Click it and Unblock the Notifications











