Bigg Boss 6 Telugu: కంటెస్టెంట్ గా శ్రీహాన్ చోటు.. మంచి జాబ్ వదిలేసి.. షాకింగ్ విషయాలు

బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ పై ఈసారి కాస్త అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇక కంటెస్టెంట్స్ గా రాబోయే వారిలో అసలు విన్నర్ ఎవరో అవుతారు ఇక వారి మధ్య గొడవలు ఏ విధంగా జరుగుతాయి అనే ఎన్నో అంశాలు ప్రేక్షకుల్లో హాట్ టాపిక్ గా మారబోతున్నాయి. ఇక ఈసారి కంటెస్టెంట్లలో కొందరు చాలా హైలెట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇక అందులో శ్రీహన్ చోటు కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలవబోతున్నాడు. ఇతను బిగ్ బాస్ లోకి మూడవ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు. చిల్ బ్రో సాంగ్ తో ఎంట్రీ ఇచ్చిన శ్రీహాన్ ఈ విధంగా మాట్లాడాడు.
జూనియర్ నానిగా ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్నాడు. ఇక అతని పూర్తి వివరాల్లోకి వెళితే..

అలా గుర్తింపు

అలా గుర్తింపు

శ్రీహన్ చోటు షార్ట్ ఫిలిమ్స్ ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్నాడు. ఇక తర్వాత యూట్యూబ్లో ప్రత్యేకంగా కొన్ని వెబ్ సిరీస్ లు కూడా చేశాడు. విశాఖపట్నంకు చెందిన శ్రీహరి మొదటి నుంచి కూడా మంచి యాక్టర్ అవ్వాలి అనే ప్రయత్నాల మొదలుపెట్టాడు. ఇక అతను అనుకున్నంతగా సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు దొరకలేదు. ఇక తనే సొంతంగా కొన్ని షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ లు చేయడం స్టార్ట్ చేశాడు. వాటి ద్వారా అతనికి మంచి గుర్తింపు దక్కింది.

ఫస్ట్ షార్ట్ ఫిల్మ్

ఫస్ట్ షార్ట్ ఫిల్మ్

ఇక ముఖ్యంగా శ్రీహన్ గురించి తెలియాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటి అంటే.. అతను మూడేళ్లపాటు నేవీలో కూడా పనిచేశాడు. కానీ ఆ తర్వాత నటనపై ఎక్కువగా ఆసక్తి పెంచుకోవడంతో జాబ్ ను వదిలేసి హైదరాబాద్ కు వచ్చేసాడు. మొదట శ్రీహాన్.. చారీ లవర్ ఆఫ్ శ్రావణి అనే షార్ట్ ఫిలిమ్ ద్వారా అతను యాక్టింగ్ లోకి అడుగు పెట్టాడు. అందులో సిరి హనుమంతు అతనికి జోడిగా నటించింది.

 సీరియల్స్ లో కూడా

సీరియల్స్ లో కూడా


అలాగే శ్రీహాన్ సాఫ్ట్ వేర్ బిచ్చగాడు అనే మరొక షార్ట్ ఫిలిం ద్వారా యువతలో మంచి క్రేజ్ అందుకున్నాడు. ఒక ఈటీవీలో ప్రసారమైన పలు కామెడీ ప్రోగ్రామ్లలో కూడా శ్రీహన్ అవకాశాలు అందుకుంటూ వచ్చాడు. అలాగే కొన్ని సీరియల్స్ లో కూడా మంచి అవకాశాలు వచ్చాయి. అమ్మాయి క్యూట్.. అబ్బాయి నాటు అలాగే పిట్టగోడ అనే సీరియల్స్ లో నటించాడు. ఇక తర్వాత సిరి హనుమంతుతో కలిసి ప్రత్యేకంగా ఒక హే సిరి అనే యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశాడు.

 సిరితో బ్రేకప్ అంటూ..

సిరితో బ్రేకప్ అంటూ..


ఇక ఇప్పుడు బిగ్ బాస్ లోకి అతను ఒక కంటెస్టెంట్ గా అడుగుపెట్టి మళ్లీ తన కెరీర్ ను మరో రేంజ్ తీసుకురావాలని ఆలోచిస్తున్నాడు. సిరి హనుమంతు బాయ్ ఫ్రెండ్ గానే శ్రీహన్ హైలైట్ అవుతూ వచ్చాడు. ఇక మధ్యలో బ్రేకప్ అయ్యింది అని కూడా అనేక రకాల కథనాలు వెలువడ్డాయి. కానీ నిత్యం వారికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూనే ఉన్నాయి. ఇక బిగ్ బాస్ లో ఉన్నప్పుడు కూడా శ్రీహాన్ సిరి కి చాలా బాగా సపోర్ట్ చేశాడు. మరి ఇప్పుడు శ్రీహాన్ బిగ్ బాస్ 6వ సీజన్ లో పాల్గొంటున్నాడు. కాబట్టి సిరి నుంచి ఎలాంటి మద్దతు అందుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X