Bigg Boss 7 Telugu: ఆగిపోయిన బిగ్ బాస్ షో.. మళ్లీ అప్పుడే మొదలు.. కారణం ఏంటంటే!
తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకుల మన్ననలు అందుకుని సక్సెస్‌ఫుల్ షోగా పేరు సంపాదించుకుంది బిగ్ బాస్. ఇండియాలో చాలా భాషల్లో ప్రసారం అవుతోన్నా.. మన దగ్గర మాత్రమే దీనికి అత్యధిక రేటింగ్ దక్కుతోంది. ఫలితంగా తెలుగు షో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలుస్తోంది. దీంతో నిర్వహకులు రెట్టించిన ఉత్సాహంతో సీజన్ల మీద సీజన్లను జరుపుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడో సీజన్‌ను మొదలెట్టారు.
తెలుగులో విజయవంతం అయిన బిగ్ బాస్ షో ఏడో సీజన్ గత ఆదివారమే ఎంతో గ్రాండ్‌గా ప్రారంభం అయింది. దీనికి తగ్గట్లుగానే దీన్ని ఉల్టా పుల్టా అంటూ సరికొత్త కంటెంట్, ట్విస్టులు, సర్‌ప్రైజ్‌లతో నడుపుతూ ఆసక్తిని పెంచుతూనే ఉన్నారు. ప్రీమియర్ ఎపిసోడ్ నుంచి ఈ షో ఏ రేంజ్‌లో ఉండబోతుంది అనేది స్పష్టంగా చూపించారు. ఫలితంగా ఇది మజాను పంచుతోంది.

రెగ్యూలర్ బిగ్ బాస్ షో సెన్సార్‌తో బుల్లితెరపై ప్రసారం అవుతుంది. అయితే, ఈ మధ్యనే దీనికి సంబంధించిన 24 గంటల స్ట్రీమింగ్ కూడా అందుబాటులోకి వచ్చింది. దీనికి ఎలాంటి కట్స్, బీప్స్ ఉండడం లేదు. దీంతో ఈ షో ఆరంభం నుంచే రచ్చ రచ్చగా సాగుతోంది. దీంతో 24 గంటల స్ట్రీమింగ్‌కు కూడా మంచి స్పందనే వస్తోంది. ఇది డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో వస్తోంది.
ఏడో సీజన్‌కు సంబంధించి ఒకవైపు బుల్లితెరపై గంట ఎపిసోడ్ ప్రసారం అవుతుండగానే.. మరోవైపు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో సైతం లైవ్ స్ట్రీమింగ్ నడుస్తోంది. ఇది టీవీలో వచ్చే ఎపిసోడ్ కంటే ఒకరోజు ముందుగానే స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో చాలా విషయాలు ముందే లీక్ అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గత రాత్రి నుంచి ఏడో సీజన్ హాట్‌స్టార్‌లో లైవ్ స్ట్రీమింగ్‌ను నిలిపివేశారు.
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో బిగ్ బాస్ ఏడో సీజన్ 24 గంటల లైవ్ స్ట్రీమింగ్‌ను నిలిపివేశారు. దీనికి కారణం అన్నీ ముందుగానే లీక్ అవడంతో పాటు.. శని, ఆదివారాల్లో వీకెండ్ ఎపిసోడ్స్ ప్రసారం అవ్వాల్సి ఉండడమే అని తెలుస్తోంది. ఇక దీన్ని ఆదివారం రాత్రి 10:30 గంటల నుంచి మళ్లీ స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని బిగ్ బాస్ టీమ్ అధికారికంగా వెల్లడించింది.


Click it and Unblock the Notifications











