నెల కాకముందే OTTలోకి రాబోతున్న బిగ్‌బాస్ కంటెస్టెంట్ సినిమా, ఎలా చూడాలంటే?
ఈ మధ్య అనేక సినిమాలు నెల రోజులు కూడా కాకముందే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. చిన్న, పెద్ద సినిమాలు అనే తేడా లేకుండా అనేక చిత్రాలు డిజిటల్ లో స్ట్రీమింగ్ అవుతూ తెగ సందడి చేస్తున్నాయి. అయితే ఇటీవలే థియేటర్లలో విడుదల అయిన ఓ బిగ్ బాస్ కంటెస్టెంట్ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధం అయింది. అయితే ఆ సినిమా ఏంటి, ఎప్పటి నుంచి ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
బిగ్ బాస్ కంటెస్టెంట్ సోహైల్ హీరోగా వచ్చిన తాజా సినిమా బూట్ కట్ బాలరాజు. బెక్కెం బబిత సమర్పణలో గ్లోబల్ ఫిలిమ్స్, లక్కీ మీడియా బ్యానర్స్‌పై బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన ఈ సినిమాకు శ్రీ కొన్నేటి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో సయ్యద్ సోహైల్ సరసన మేఘలేఖ హీరోయిన్ గా నటించి మెప్పించింది. అలాగే అనన్య నాగళ్ల, ఇంద్రజ, వెన్నెల కిశోర్, బ్రహ్మాజీ, ఆనంద చక్రపాణి, ఝూన్సి, సిరి హన్మంత్, జబర్దస్త్ రోహిణి, మాస్టర్ రామ్ తేజస్ లు ప్రధాన పాత్రల్లో నటించారు.

కేవలం హీరోగా చేయడమే కాకుండా సోహైల్ ఈ చిత్రాన్ని తొలిసారి నిర్మించాడు కూడా. అయితే ఫిబ్రవరి 2వ తేదీన థియేటర్లలో విడుదల అయిన ఈ చిత్రానికి ఆదరణ కరువైంది. ఎవరూ ఈ సినిమాను చూసేందుకు పెద్దగా ఆసక్తి కనబర్చలేదు. ఇదంతా గుర్తించిన సోహైల్ కంటతడి పెట్టుకున్నాడు. బిగ్ బాస్ లో ఉండగా మెసేజ్ లు చేసిన మీరంతా ఎక్కడున్నారు.. థియేటర్లకు వచ్చి సినిమాలు చూడండంటూ చాలా ఎషమోనల్ అయ్యారు. సోహైల్ బిహేవియర్ పై పెద్ద ఎత్తు కామెంట్లు వచ్చాయి. విపరీతమైన వైరల్ గా మారాయి ఆయన కామెంట్లు.
అయితే తాజాగా ఈ కుర్ర హీరో సినిమా ఓటీటీలోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బూట్ కట్ బాలరాజు సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన ఆహా దక్కించుకుంది. అయితే ఈ సినిమాను త్వరగానే విడుదల కూడా చేయబోతున్నామని ప్రకటించింది. ముఖ్యంగా ఫిబ్రవరి 26వ తేదీ నుంచి ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ఎక్స్ వేధికగా ప్రకటించింది. అలాగే ఊరువాడా, చిన్నాపెద్దా అంతా సిద్ధంగా ఉండండి అంటూ వివరించింది. ముఖ్యంగా 26వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి ప్రీమియర్స్ చూసే వెసులు బాటు కల్పించింది.
మిగిలిన వాళ్లకు మాత్రం ఈ సినిమా ఆ తర్వాతి రోజు నుంచే చూసే అవకాశం ఉంటుంది. అంటే 27వ తేదీ నుంచి. ఇంకా ఎందుకు ఆలస్యం థియేటర్లలో చూడని వాళ్లంతా ఈ సినిమా ఓటీటీ వేధికగా చూసి ఫుల్ గా ఎంజాయ్ చేయండి. ముఖ్యంగా మరో రెండు రోజుల్లో స్ట్రీమింగ్ కు సిద్ధంగా ఉన్న ఈ సినిమాను చూసేందుకు రెడీగా ఉండండి.


Click it and Unblock the Notifications











