OTTలోకి వచ్చేసిన బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్... స్ట్రీమింగ్ ఎందులో అంటే?
వీకెండ్ వచ్చిదంటే ఏదో ఒక సినిమా ఓటీటీలో సందడి చేస్తునే ఉంటుంది. వారం వారం కొత్త కొత్త సినిమాలు, సిరీసులను తీసుకువస్తున్నాయి ఓటీటీ సంస్థలు. ఇక ఈ వారం ఓ కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ ప్రధాన పాత్రల్లో నటించిన మిస్టేక్ మూవీ.. ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. అసలు ఆ మూవీ కథేంటి... ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది.. అందులో ప్రధాన పాత్రల్లో నటించింది ఎవరు అనే వివరాలు తెలుసుకుందాం.
ఓటీటీ వేదికలు ప్రతి వారం కొత్త కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇక ఈ వారం మరో కొత్త మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. రామ్ అసుర వంటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన అభినవ్ సర్దార్... ఇటీవల తాజాగా నటించిన చిత్రం మిస్టేక్. ఇక ఈ మూవీ ఆగస్టు 4న ప్రేక్షకుల ముందుకు థియేటర్లలో రిలీజ్ అయింది. ఇక ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మిక్స్ డ్ టాక్ వచ్చింది. ప్రేక్షకులు ఈ సినిమాకు అంతగా పట్టించుకోలేదు.

అయితే ఈ మూవీలో ఒకప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ప్రేక్షకులకు దగ్గరైన అజయ్ కతుర్వార్ ఓ కీలక పాత్రలో నటించాడు. ఇతను బిగ్ బాస్ ఓటీటీ సీజన్ లో కంటెస్టెంట్. ఇక బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ ఈ కుర్రాడు... ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. తనదైన ఆటతో మెప్పించాడు. కానీ బిగ్ బాస్ ఓటీటీ సీజన్ చాలా మందికి నచ్చలేదు. బుల్లితెరపై కాకుండా ఓటీటీలో మాత్రమే స్ట్రీమింగ్ అయ్యే సరికి ఎవరూ దీనిని అంతగా పట్టించుకోలేదు. అందులోనూ అంతగా తెలిసిన మొహాలను కాకుండా.. ఎవరిరెవరినో తీసుకువచ్చారని విమర్శలు వచ్చాయి.
అయితే ఇప్పుడు బిగ్ బాస్ షోతో అంతో ఇంతో క్రేజ్ తెచ్చుకున్న ఈ కుర్రాడు మిస్టేక్ సినిమాలో నటించాడు. ఇక ఈ సినిమాకు భరత్ కొమ్మాలపాటి దర్శకత్వం వహించాడు. ఈ కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో అజయ్ కతుర్వార్ తో పాటు... సుజిత్ కుమార్, తేజ అయినంపూడి, కరిష్మా కుమార్, తానియా కల్రా, ప్రియా పాల్, రాజా రవీంద్ర, సమీర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక పెద్దగా ప్రమోషన్స్ చేయకపోవడం వల్ల కూడా ఈ సినిమా జనాల్లోకి వెళ్లలేకపోయింది.

థియేటర్లలో నిరాశపర్చిన ఈ మిస్టేక్ సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ వచ్చేసింది. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో ఈ సినిమా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఈ శుక్రవారం (అక్టోబర్ 13) నుంచి ఈ మూవీ ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. మీరు కనుక ఓ కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చూడాలనుకుంటే.. ఓసారి ఈ సినిమాను ఇంట్లోనే కూర్చొని హ్యాపీగా చూసేయొచ్చు.


Click it and Unblock the Notifications











