Bigg Boss OTT: లిప్ లాక్స్‌తో అంతకుమించి.. బిగ్‌బాస్ హౌసా? పోర్న్ హౌసా? సల్మాన్‌పై నెటిజన్ల మండిపాటు
బిగ్ బాస్ అంటేనే కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ అని అందరికీ తెలిసిన విషయమే. ఇక లిమిట్స్ దాటడంలో కంటెస్టెంట్స్ చాలా వరకు కొంత ఆలోచించినప్పటికీ హోస్ట్ మాత్రం వారిని ఆ ఆలోచనలను బ్రేక్ చేసి హద్దులు దాటించేలా ఉత్తేజపరుస్తూ ఉంటారు. ఇది దాదాపు అన్ని భాషలలో జరిగేది ఇదే. ముఖ్యంగా తెలుగులోనే ఆ మధ్య రొమాన్స్ తో కొంత మంది ఊహించిన విధంగా షాక్ అయితే ఇచ్చారు.
ఇక హిందీలో అయితే ఈ మధ్య మరింత దారుణంగా తయారయ్యారు. ఓటీటీ లోకి వచ్చాక అయితే ఇక అడ్డుగోడాలన్నీ తొలగించి బి గ్రేడ్ సినిమాలను తలపిస్తున్నారు. ఒకరి దుప్పట్లో మరోకరు దూరడం అనేది చాలా కామన్ అయిపోయింది. ఇక ఇద్దరి మధ్య ఏదో ఉంది అనే బోల్డ్ కామెంట్స్ కూడా చాలా నార్మల్ గానే మారిపోయాయి. ఇక కాస్త క్లోజ్ గా ఉన్నా కూడా ఒక జంటతో చివరి వరకు ఊహించిన విధంగా రొమాంటిక్ సీన్లతో అయితే ప్రేక్షకులను మోసం చేస్తూనే ఉంటారు.

ఇక హిందీ బిగ్ బాస్ ఓటీటీ లో కూడా ఈ మధ్య కంటెస్టెంట్స్ హద్దులు దాటించి ప్రవర్తిస్తున్నారు అనే కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఇటీవల మొదలైన హిందీ బిగ్ బాస్ ఓటీటీ సెకండ్ సీజన్ మొదట్లో కాస్త బోరింగ్ గా కొనసాగింది. అయితే రీసెంట్ గా మళ్లీ సల్మాన్ ఖాన్ ఒక్కసారిగా అలర్ట్ చేయడంతో అందరూ కూడా సీరియస్ గా గేమ్ ఆడుతున్నారు.
అయితే ఈసారి ఇద్దరు కంటెస్టెంట్స్ అయితే ఒక టాస్క్ లో భాగంగా హద్దులు దాటి మరి లిప్ కిస్సులతో షాక్ అయ్యేలా చేశారు. సౌత్ ఇండస్ట్రీలో కూడా కొన్ని సినిమాలు చేసిన ఆకాంక్ష పూరి అలాగే బాలీవుడ్ నటుడు జోధ్ ఒకరినొకరు లిప్ కిస్సులతో షాక్ అయ్యేలా హైలెట్ చేసుకున్నారు. మొదట ఆకాంక్ష పూరి అసలు నాకు టచ్ చేయడం అంటేనే ఇష్టం ఉండదు అని చెప్పగా ఈసారి జాద్ తో ఏకంగా నోటిలో నోరు పెట్టి రొమాంటిక్ డోస్ పెంచింది.
ఇక వారిని చూసిన మిగతా కంటెస్టెంట్స్ కూడా కానివ్వండి కానివ్వండి అనే తరహాలో కామెంట్ చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. అసలు బిగ్ బాస్ ఎటు వెళుతోంది అనే తరహాలో జనాలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. జనాలను ఆకర్షించాడానికి మరి ఈ స్థాయికి దిగజారుతారా? ఇంతకు బిగ్‌బాస్ హౌసా? లేదా పోర్న్ హౌసా? అని కూడా మరి కొందరు కామెంట్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











