OTTలో బిగ్ బాస్ ఫేమ్ ఇనయా సుల్తానా కొత్త సినిమా.. ఎప్పుడు? ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?
బిగ్ బాస్ రియాలిటీ షో ఎంతోమందికి పేరు తీసుకొచ్చింది. ఎక్కువగా గుర్తింపు లేని సెలబ్రిటీలకు విపరీతమైన ఫాలోయింగ్ పెరిగేలా చేసింది. అలాగే సినీ అవకాలు లేని వారికి బిగ్ బాస్ షో మంచి వేదికగా మారింది. ఎలాంటి అంచనాలు లేకుండా బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ లోకి అడుగుపెట్టింది బ్యూటిఫుల్ ఇనయా సుల్తానా. తొందర్లోనే హౌజ్ నుంచి బయటకు వెళ్తుందనుకున్న ఇనయా ఊహించని విధంగా ఫాలోయింగ్ సంపాదించుకుంది. టైటిల్ విన్నర్ సింగర్ రేవంత్ కు సైతం గట్టి పోటి ఇచ్చి లేడీ టైగర్ అనిపించుకుంది. అయితే ఇప్పుడు ఈ ముద్దుగుమ్మను సినిమా అవకాశం వరించింది. దానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

ఆర్జీవీతో వైరల్ గా..
గతేడాది సెప్టెంబర్ 4న ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ లోకి మొత్తంగా 21 మంది సెలబ్రిటీల్లో ఒకరిగా ఎంట్రీ ఇచ్చింది ఇనయా సుల్తానా. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని ఇనయాకు సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ద్వారా ఫేమ్ వచ్చింది. తన బర్త్ డే పార్టీకి వచ్చిన ఆర్జీవీతో ఇనయా సుల్తానా కలిసి డ్యాన్స్ చేసింది. దీంతో ఆ అమ్మాయి ఎవరా అని విపరీతంగా తెలుసుకోవడం మొదలు పెట్టారు. అప్పుడే ఈ ముద్దుగుమ్మ తెగ వైరల్ అయింది.

గట్టి పోటీగా భావించి..
ఆర్జీవీతో కలిసి డ్యాన్స్ చేయడానికి ముందే పలు చిత్రాల్లో కూడా నటించింది ఇనయా. అయితే అవేవి గుర్తింపును తీసుకురాలేదు. ఆర్జీవీ ద్వారా పాపులర్ కావడంతో బిగ్ బాస్ కి అవకాశం లభించింది. దీంతో బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ లోకి ఎలాంటి అంచనాలు లేకుండా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. సీజన్ రెండు వారాల్లోనే వెళ్లిపోతుందని అంతా అనుకున్నారు. కానీ తనదైన ఆట తీరుతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా టైటిల్ విన్నర్ సింగర్ రేవంత్ కు గట్టి పోటీగా ఆడియెన్స్ భావించారు.

ప్రపోజ్ చేసి..
ఈ బిగ్ బాస్ ఆరో సీజన్ లో 14వ వారం జరిగిన ఎలిమినేషన్ లో భాగంగా ఇనయా సుల్తానా ఎవరూ ఊహించని విధంగా ఎలిమినేట్ అయి హౌజ్ ను వీడింది. హౌజ్ లో ఉన్నప్పుడు ఆర్జే సూర్యతో ఇనయా మంచి బాండింగ్ ఏర్పర్చుకుంది. తరచు ఇద్దరు కలిసి మాట్లాడుకోవడం, హగ్స్ ఇచ్చుకోవడం వంటివి జరిగాయి. హౌజ్ ను వీడాకా ఆర్జే సూర్యతో కలిసి చక్కర్లు కొట్టినట్లు వార్తలు వచ్చాయి. అలాగే సయ్యద్ సోహైల్ కు ఓసారి ప్రపోజ్ చేసి షాక్ ఇచ్చింది ఈ భామ.

బిగ్ బాస్ కు ముందు..
ఇక బీబీ జోడీ డ్యాన్స్ రియాలిటీ షోలోనూ కొద్దిరోజులు కంటెస్టెంట్ గా పాల్గొంది లేడీ టైగర్ ఇనయా సుల్తానా. ఇదిలా ఉంటే బిగ్ బాస్ షో ద్వారా ఇనయా సుల్తానా రేంజ్ పెరిగిపోయిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆమె ఎందుకోసం అయితే బిగ్ బాస్ లోకి వచ్చిందో ఆ కల నెరవేరింది. బిగ్ బాస్ కు ముందు ఎన్నో చిత్రాల్లో నటించిన ఈ భామకు ఫేమ్ రాలేదు. ఇప్పుడు బిగ్ బాస్ తర్వాత సినిమా అవకాశాన్ని దక్కించకుంది ఈ ముద్దుగుమ్మ.

ట్రెడిషనల్ లుక్ లో..
బిగ్ బాస్ లో ఆటాడించిన ఇనయా సుల్తానా క్రాంతి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ని తాజాగా సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. నిర్విక, జాన్విక సమర్పణలో వస్తున్న ఈ సినిమాకు వి. భీమ శంకర్ దర్శకత్వం వహించగా.. భార్గవ్ మన్నే నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. క్రాంతి ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఇనయా ట్రెడిషనల్ లుక్ లో ఆకట్టుకునేలా ఉంది. థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం నేరుగా ఓటీటీలో విడుదలైంది.
ప్రముఖ ఓటీటీలో..
బిగ్ బాస్ ఇనయా సుల్తానా తాజా చిత్రం క్రాంతి ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహాలో మార్చి 3 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో రాకేందు మౌళి హీరోగా చేశాడు. ఇదిలా ఉంటే.. సినిమాలపై ఇష్టంతో నగరి నుంచి పారిపోయి వచ్చిన ఇనయా సినీ ఇండస్ట్రీలో ఒంటరి ప్రయాణం చేసింది. చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ మోడలింగ్ లోకి అడుగుపెట్టింది. అనంతరం ఏవమ్ జగత్ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బుజ్జీ ఇలా రా, నట రత్నాలు, యద్భావం తద్భవతి వంటి చిత్రాల్లో నటించింది.


Click it and Unblock the Notifications











