Bigg Boss Non Stop: ‘బిందు, శివ దుప్పట్లో దడదడ.. ఆమెకు గుండు కొట్టించాలి’ అంటూ అఖిల్ బ్యాచ్ నీచంగా!

తెలుగు బుల్లితెరపై ఎన్నో రకాల షోలు వచ్చినా.. రియాలిటీ ఆధారంగా నడిచేవి మాత్రం చాలా తక్కువగానే ఉన్నాయి. ఈ లోటు భర్తీ చేస్తూ ఐదేళ్ల క్రితం పరిచయం అయిన కార్యక్రమమే బిగ్ బాస్. కొంత మంది కంటెస్టెంట్లను ఓ ఇంట్లో ఉంచి.. వాళ్లతో చిత్ర విచిత్రమైన టాస్కులను ఆడించి.. ప్రేక్షకుల ఓట్ల ద్వారా విజేతను నిర్ణయించడమే ఈ షో నేపథ్యం.

ఇప్పటికే ఇది ఐదు సీజన్లను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ నడుస్తోంది. ఇందులో గతంలో ఎన్నడూ లేని విధంగా బోల్డు కంటెంట్ కనిపిస్తోంది. ఇందులో భాగంగానే బిందు మాధవి, శివ గురించి అఖిల్ బ్యాచ్ సభ్యులు అనుచిత వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది. అసలేం జరిగిందో మీరూ చూడండి మరి!

గతం కంటే ఎక్కువ వినోదంతో

గతం కంటే ఎక్కువ వినోదంతో

ఆరంభం నుంచే భారీ అంచనాలను ఏర్పరచుకున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ గత నెల నుంచి ప్రేక్షకులను అలరిస్తోంది. ఇది ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగుతోంది. గత సీజన్ల కంటే ఎక్కువగానే గొడవలు, డబుల్ మీనింగ్ డైలాగులు, బూతులు, బోల్డు బ్యూటీల రచ్చతో అంతకంతకూ రంజుగా మారుతోంది. దీంతో అనుకున్న దాని కంటే ఎక్కువ వినోదం అందుతోంది.

ఫేవరెట్‌ బిందు.. శివ హైలైట్‌గా

ఫేవరెట్‌ బిందు.. శివ హైలైట్‌గా

ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లోకి మొత్తం 17 మంది కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. ఇందులో కొత్త వాళ్లతో పాటు మాజీ కంటెస్టెంట్లు కూడా ఉన్నారు. మొత్తంగా చూస్తే ఇందులో ప్రముఖ హీరోయిన్ బిందు మాధవి టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. అలాగే, కాంట్రవర్శీ యాంకర్ శివ కూడా ఊహించని రీతిలో ఆడుతూ అంతకంతకూ హైలైట్ అవుతున్నాడు.

బిందు అతడితో ఎక్కువ క్లోజ్‌

బిందు అతడితో ఎక్కువ క్లోజ్‌

తెలుగులో ఎన్నో సినిమాలు చేసిన బిందు మాధవి.. తమిళ బిగ్ బాస్ సీజన్ 1లో కంటెస్టెంట్‌గా వెళ్లింది. మళ్లీ చాలా కాలం తర్వాత నాన్ స్టాప్ సీజన్‌తో తెలుగులోకి వచ్చింది. ఇక, ఈ సీజన్‌లో ఈమె ఆరంభం నుంచే యాంకర్ శివతో క్లోజ్‌గా ఉంటోంది. అతడితోనే మాట్లాడుతూ.. ఆడుకుంటూ కనిపిస్తోంది. అలాగే, శివకు మద్దతుగా పలుమార్లు కొందరితో గొడవలు కూడా పెట్టుకుంది.

బిందు వర్సెస్ అఖిల్ బ్యాచ్‌గా

బిందు వర్సెస్ అఖిల్ బ్యాచ్‌గా

బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో బిందు మాధవి కాకుండా అఖిల్ సార్థక్ కూడా టైటిల్ ఫేవరెట్ అనిపించుకుంటున్నాడు. దీంతో ఈ ఇద్దరి మధ్యనే ఎక్కువ పోటీ కనిపిస్తోంది. అందుకే వీళ్లే తరచూ గొడవలకు దిగుతున్నారు. మరీ ముఖ్యంగా అఖిల్ బ్యాచ్ అంటే నటరాజ్, అషు, అజయ్‌లు బిందును టార్గెట్ చేస్తున్నారు. దీంతో ఇప్పటికే ఎన్నో వివాదాలు కూడా చెలరేగాయి.

బిందు, శివపై నీచమైన టాక్

తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో అఖిల్, అజయ్, అషు, నటరాజ్ మాస్టర్ మధ్య బిందు, శివ గురించి చర్చ జరిగింది. ఇందులో అఖిల్.. బిందు, శివ గురించి చెప్పండి అనగానే అజయ్ 'దుప్పట్లో దడదడ' అన్నాడు. అప్పుడు అషు 'ముసుగులో గుద్దులాట' అంది. తర్వాత అజయ్ 'గోడకేసి గుద్దుడే' అన్నాడు. నటరాజ్ అయితే ఏవేవో బూతులు మాట్లాడగా అవి మ్యూట్ చేశారు.

బిందుకు గుండు చేయించాలి

మరో సందర్భంలో నటరాజ్ మాట్లాడుతూ.. 'బిగ్ బాస్ ఒక టాస్క్ పంపండి బిందును కొట్టాలి' అన్నాడు. దీనికి అఖిల్ 'బిందు, హమీదాను ఆయన పక్కన పెట్టండి. ఏంటి ఇప్పుడు మా పండు (బిందు)ను కొడతారా' అని అన్నాడు. దీనికి నటరాజ్ అవును అన్నట్లు తలూపాడు. ఇక అషు 'స్కిట్‌లో బిందుకు గుండు చేయాలి' అని అనుచితంగా మాట్లాడి వికృతానందం పొందింది.

మరీ ఇంత నీచంగానా అంటూ

మరీ ఇంత నీచంగానా అంటూ

ఇక, బిందు, శివ గురించి అఖిల్ బ్యాచ్ మాట్లాడుకున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆడవాళ్లపై ఏమాత్రం మర్యాద లేకుండా మాట్లాడతారా అంటూ వాళ్లందరినీ బిందు ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్లంతా తప్పుబడుతున్నారు. మరీ ముఖ్యంగా అషు రెడ్డిని ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. మరి దీనిపై నాగార్జున స్పందిస్తాడో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X