Bigg Boss Non Stop: బిందు, శివపై అఖిల్ సంచలన వ్యాఖ్యలు.. ఆ వీడియోలు బయట పెట్టిస్తానంటూ!
బిగ్ బాస్.. బుల్లితెర ప్రియులకు అస్సలు పరిచయం అవసరం లేని పేరిది. అంతలా ఇది సుదీర్ఘ కాలంగా హవాను చూపిస్తూ టెలివిజన్ హిస్టరీలోనే నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది. మరీ ముఖ్యంగా తెలుగులో వచ్చే దానికి మాత్రమే అత్యధిక టీఆర్పీ రేటింగ్ దక్కుతోంది. దీంతో నిర్వహకులు ఇప్పుడు ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌ను మరింత జోష్‌తో నడుపుతున్నారు. ఇక, ఇది చివరి దశకు చేరుకోవడంతో మరింత రసవత్తరంగా సాగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో అఖిల్ సార్థక్.. యాంకర్ శివపై మండిపడ్డాడు. అంతేకాదు, ట్రాక్‌ను లాగుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అసలేం జరిగింది? ఆ వివరాలేంటో మీరే చూడండి!

చివరి దశలో మరింత ఆసక్తిగా
బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగుతోంది. ఇందులో గతంలో కంటే వినూత్నమైన సన్నివేశాలు కనిపించడంతో పాటు కొంత బోల్డునెస్ కూడా చూపిస్తున్నారు. దీనికితోడు ఇప్పుడు ఇది ఆఖరి దశకు చేరుకుంది. దీంతో మరిన్ని కొత్త టాస్కులు ఇస్తున్నారు. ఫలితంగా ఈ సీజన్ మరింత జనరంజకంగా సాగుతూ ముందుకు సాగుతోంది.

11వ వారం నామినేషన్స్ ఇలా
తాజా వారానికి జరిగిన నామినేషన్ ప్రక్రియను సరికొత్తగా డిజైన్ చేశారు. ఇందులో భాగంగా హౌస్‌లోని కంటెస్టెంట్లు నామినేట్ చేయాలనుకున్నవారిని ముగ్గురిని ఎంచుకోవాలి. వాళ్లను గార్డెన్ ఏరియాలో ఉన్న ఎగ్జిట్ బోర్డు కింద నిల్చోబెట్టాలి. ఆ తర్వాత అందుకు తగిన కారణాలను చెప్పాలి. ఈ వారానికి హౌస్‌లో కెప్టెన్ ఎవరూ లేకపోవడంతో అందరూ నామినేషన్స్‌లో భాగమయ్యారు.

ఎన్నో గొడవలతో సాగిన టాస్క్
టాప్ 5లో ఉండడానికి ఎవరు అర్హులు? ఎవరు అనర్హులు? అనేది చెప్పాలంటూ ఇచ్చిన టాస్కులో ఎన్నో గొడవలు జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా బిందు మాధవి.. అఖిల్ సార్థక్, నటరాజ్ మాస్టర్, మిత్రా శర్మలను నామినేట్ చేయగా.. వాళ్లంతా ఆమె క్యారెక్టర్‌పై పర్సనల్ ఎటాక్ చేశారు. అలాగే, ఆరియానా - మిత్రా మధ్య పెద్ద మాటల యుద్దమే జరిగిన విషయం తెలిసిందే.

ఆ ముగ్గురిని ఎంచుకున్న శివ
పదకొండో వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియ రెండో రోజు కూడా గొడవలతోనే సాగింది. ఇందులో భాగంగా యాంకర్ శివ.. తన వంతు వచ్చినప్పుడు టాప్ 5లో ఉండేందుకు అర్హత లేదంటూ అఖిల్ సార్థక్, నటరాజ్ మాస్టర్, మిత్రా శర్మలను ఎంపిక చేసుకున్నాడు. వాళ్లు ముగ్గురు యాథావిదిగానే అతడిపై గొడవకు దిగారు. అప్పుడు శివ వాళ్లకు ధీటుగానే బదులిచ్చాడు.

అఖిల్ - శివ మధ్య బిగ్ ఫైట్
ఈ నామినేషన్స్ ప్రక్రియలో యాంకర్ శివ తనను నామినేట్ చేయగానే అఖిల్ సార్థక్‌కు పట్టలేనంత కోపం వచ్చింది. దీంతో అతడిపై ఎన్నో కీలక వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు, 'నువ్వు బయటే ప్లాన్ చేసుకుని వచ్చావు. ఆ విషయం నాకు నీ ఫ్రెండే చెప్పాడు. ఈ విషయాన్ని కావాలంటే బయటకు వెళ్లిన తర్వాత ఫుటేజ్‌తో సహా చూపిస్తాను' అంటూ అఖిల్ బయట పెట్టేశాడు.

నీ భజన చేస్తేనే మంచోళ్లు
అఖిల్ తనను నామినేట్ చేసిన సమయంలో యాంకర్ శివ ధీటుగానే స్పందించాడు. 'ఇప్పుడేంటి అఖిల్ అఖిల్ అని పక్కన తిరిగితేనే నీ దృష్టిలో మంచోళ్లు. ఎప్పటికీ నీ భజన చేస్తూ ఉండాలి. లేకపోతే వాళ్లను టార్గెట్ చేస్తావు. అంతేకాదా.. ముందు నుంచీ నువ్వు చేసేది ఇదే. ఆ విషయం ఇక్కడ ఉన్న వాళ్లందరికీ తెలుసు. నేను అలా చేయట్లేదని నన్ను నామినేట్ చేశావ్' అన్నాడు.

ట్రాక్‌పై సంచలన వ్యాఖ్యలు
శివతో గొడవ పడుతోన్న సమయంలోనే అఖిల్ 'నువ్వు మామూలోడివి కాదు. అన్ని పక్కాగా సెట్ చేసుకున్నావు. అంతెందుకు ఎవరితో ఉంటే ప్లస్ అవుతుంది? ఎవరితో ట్రాక్ నడిపితే ప్లస్ అవుతుంది అనేవి చూసుకునే వచ్చావు. అలాగే, ఇప్పుడు హౌస్‌లో కంటిన్యూ అవుతున్నావు' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అంటే పరోక్షంగా బిందు, శివ మధ్య ట్రాక్‌ను ప్రస్తావించాడు.


Click it and Unblock the Notifications











