Bigg Boss Non Stop: షోలో షాకింగ్ సీన్.. చేయి కోసుకుంటానన్న బిందు.. వెంటనే ఊహించని పని చేసిన అఖిల్

బుల్లితెరపై ఎప్పుడూ కనిపించని కాన్సెప్టుతో వచ్చినా.. చాలా తక్కువ సమయంలోనే విశేషమైన ఆదరణను అందుకుని సూపర్ డూపర్ హిట్ అయిన షో బిగ్ బాస్. ఊహించని సంఘటనలు.. గతంలో ఎప్పుడూ చూడని టాస్కులు.. కంటెస్టెంట్ల మధ్య చిత్ర విచిత్రమైన ఎమోషన్స్ ఇలా ఎన్నో రకాల పరిణామాలతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ ప్రేక్షకులకు మజాను అందిస్తోంది. ఫలితంగా నిర్వహకులు సీజన్ల మీద సీజన్లను పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్‌ మొదటి సీజన్ కూడా రంజుగా సాగుతోంది. ఇక, తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో బిందు మాధవి, అఖిల్ సార్థక్ మధ్య ఎవరూ ఊహించని సంఘటన ఒకటి జరిగింది. అదేంటో మీరే చూడండి మరి!

రంజుగా మారుతోన్న నాన్ స్టాప్

రంజుగా మారుతోన్న నాన్ స్టాప్

ఎన్నో అంచనాల నడుమ బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ మొదలైంది. అందరూ అనుకున్నట్లుగానే ఇది ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగుతోంది. అలాగే, గతంలో ఎన్నడూ చూడని కంటెంట్ కూడా ఇందులో కనిపిస్తోంది. దీంతో ఈ సీజన్‌కు ఆదరణ భారీ స్థాయిలో దక్కుతోంది. ఇక, ఇప్పుడు చివరి దశకు చేరుకోవడంతో షో మరింత రంజుగా మారుతూ వినోదాన్ని ఇస్తోంది.

టైటిల్ ఫేవరెట్లు.. స్పెషల్‌గానే

టైటిల్ ఫేవరెట్లు.. స్పెషల్‌గానే

బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లోకి మొత్తం 17 మంది కంటెస్టెంట్లుగా వచ్చారు. ఇందులో కొత్త వాళ్లతో పాటు మాజీ కంటెస్టెంట్లు కూడా ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే ఇందులో ఇద్దరు టైటిల్ ఫేవరెట్లుగా బరిలోకి దిగారు. అందులో ఒకరు ప్రముఖ హీరోయిన బిందు మాధవి కాగా.. మరొకరు మాజీ రన్నరప్ అఖిల్ సార్థక్. వీళ్లిద్దరే ఆరంభం నుంచే స్పెషల్‌గా కనిపిస్తున్నారు.

ఆటతో పాటు మైడ్ గేమ్ కూడా

ఆటతో పాటు మైడ్ గేమ్ కూడా

బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్‌లో టైటిల్ ఫేవరెట్లుగా ఉన్న బిందు మాధవి, అఖిల్ సార్థక్ ఇద్దరూ ఇద్దరే అన్నట్లుగా ఆడుతున్నారు. ఆట పరంగా ఇద్దరూ పోటీ ఇచ్చుకుంటూ దూసుకెళ్తున్నారు. అలాగే, మైండ్ గేమ్ పరంగానూ ఎవరికి వారే అనేలా వ్యవహరిస్తున్నారు. అయితే, ఆరంభం నుంచే వీళ్ల మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. దీంతో రెండు గ్రూపులుగా విడిపోయి రచ్చ చేస్తున్నారు.

ఇద్దరి మధ్య గొడవలతో గ్యాప్

ఇద్దరి మధ్య గొడవలతో గ్యాప్

ఆ మధ్య ఓ టాస్కులో యాంకర్ శివను సపోర్ట్ చేయడానికి బిందు మాధవి.. అతడిని ఓడించడానికి అఖిల్ సార్థక్ ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య బిగ్ ఫైట్ జరిగింది. అప్పటి నుంచి తరచూ వీళ్ల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇవి ఒక్కోసారి శృతి మించాయి కూడా. దీంతో ఈ ఇద్దరు టాప్ కంటెస్టెంట్ల మధ్య గ్యాప్ కూడా అంతకంతకూ పెరుగుతూనే వస్తోంది.

ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్కులతో

ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్కులతో

ప్రస్తుతం జరుగుతోన్న వారంలో బిగ్ బాస్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం టాస్కులు జరుగుతున్నాయి. దీనికోసం మొదటి రోజు మాజీ కంటెస్టెంట్ సిరి హన్మంత్ ఎంట్రీ ఇచ్చి.. ప్రస్తుతం హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లతో టాస్కులు ఆడించింది. ఆ తర్వాత మానస్ కూడా లోపలికి వచ్చి కొన్ని టాస్కులు ఇచ్చాడు. ఇలా మరో ముగ్గురు మాజీలు కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

చేయి కోసుకుంటానని బిందు

చేయి కోసుకుంటానని బిందు


తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో అఖిల్ సార్థక్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని అన్నం తింటున్నాడు. ఆ వెనకాల ఉన్న సోఫాలో అనిల్ రాథోడ్, యాంకర్ శివ, బిందు మాధవిలు కూర్చుని అతడిపై జోకులు వేసుకున్నారు. ఈ క్రమంలోనే ఫన్నీ కామెంట్స్ చేశారు. అప్పుడే బిందు 'అఖిల్ కోసం చేయి కోసుకుంటాను' అంటూ సరదాగా కోసుకున్నట్లుగా యాక్టింగ్ చేసి నవ్వులు పూయించింది.

ఆమెకు ముద్ద పెట్టిన అఖిల్

ఆమెకు ముద్ద పెట్టిన అఖిల్

బిందు అండ్ బ్యాచ్ తనపై జోక్స్ చేస్తున్నా అఖిల్ సార్థక్ లైట్ తీసుకున్నాడు. అతడు కూడా నవ్వుతూనే కనిపించాడు. అంతేకాదు, ఓ సందర్భంలో అన్నం తినే ప్లేట్‌తో వచ్చిన అఖిల్.. బిందు మాధవికి గోరుముద్దలు పెట్టాడు. దీంతో ఆమెతో పాటు యాంకర్ శివ, అనిల్ రాథోడ్ కూడా షాక్ అయ్యారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X