Bigg Boss Non Stop: అషు రెడ్డికి అఖిల్ మదర్ షాక్.. ఆ పనులు చేయడానికే వచ్చావా అని ముఖం మీదే!

టెలివిజన్ హిస్టరీలోనే దేశ వ్యాప్తంగా సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన షోలలో రియాలిటీ ఆధారంగా నడిచే బిగ్ బాస్ ఒకటి. చాలా భాషల్లో ప్రసారం అవుతోన్న దీనికి ప్రేక్షకుల నుంచి ఆదరణ భారీ స్థాయిలోనే లభిస్తోన్న సంగతి తెలిసిందే. అందుకే ఈ షో ప్రసారం అయిన ప్రతిసారీ ఆయా భాషల్లో నెంబర్ వన్ స్థానంలో నిలుస్తోంది. మరీ ముఖ్యంగా తెలుగులో దీని ప్రభావం కాస్త ఎక్కువగానే ఉంది.

అందుకే నిర్వహకులు వరుసగా సీజన్ల మీద సీజన్లను ప్రసారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌ను నడుపుతున్నారు. ఇందులో ఫ్యామిలీ మెంబర్లు ఎంట్రీ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే అఖిల్ సార్థక్ తల్లి.. బోల్డ్ బ్యూటీ అషు రెడ్డికి కోలుకోలేని షాక్ ఇచ్చారు. అసలేం జరిగిందో మీరే చూడండి!

ఆదరణ పెంచేందుకు ప్రయత్నం

ఆదరణ పెంచేందుకు ప్రయత్నం

సాధారణంగా ఏ షో అయినా రేటింగ్ కోసమే ప్రసారం అవుతోంది. అందులోనూ భారీ ఖర్చుతో రూపొందిన బిగ్ బాస్‌కు అది చాలా ముఖ్యం. అందుకే ప్రేక్షకులు ఎటువంటి కంటెంట్‌ను ఎక్కువగా చూస్తారో.. దానినే ప్రసారం చేస్తున్నారు. ఇందులో భాగంగానే కంటెస్టెంట్ల మధ్య గొడవలు.. లవ్ ట్రాకులు.. ముద్దులు.. హగ్గులతో పాటు బోల్డు కంటెంట్‌పైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు.

ఫ్యామిలీ మెంబర్ల సందడి షురూగా

ఫ్యామిలీ మెంబర్ల సందడి షురూగా

బిగ్ బాస్ షోలో కొన్ని ఎపిసోడ్స్ తర్వాత అత్యధిక స్థాయిలో రెస్పాన్స్ వచ్చేది కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులు అడుగు పెట్టినప్పుడే. ప్రతి సీజన్‌లోనూ ఈ పార్ట్ బాగా హైలైట్ అవుతోంది. మొదటి సీజన్ నుంచి మొదలు పెడితే ఐదో సీజన్ వరకు మంచి ఫలితాలను రాబట్టింది. ఇప్పుడు బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్‌లోనూ గురువారం ఎపిసోడ్ నుంచి వాళ్ల ఎంట్రీలు మొదలయ్యాయి.

 మొదటి రోజు ఆ ముగ్గురు ఎంటర్

మొదటి రోజు ఆ ముగ్గురు ఎంటర్

బిగ్ బాస్ హౌస్‌లోకి కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్ల రాక మొదలవడంతో సందడి వాతావరణం కనిపిస్తోంది. గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో యాంకర్ శివ సోదరి, అషు రెడ్డి తల్లి, నటరాజ్ మాస్టర్ భార్య, పాప ఎంట్రీ ఇచ్చారు. వాళ్ల రాకతో కంటెస్టెంట్లు ఫుల్ ఖుషీ అయిపోయారు. మరీ ముఖ్యంగా నటరాజ్ పాప లక్ష్య మాత్రం ఈ సీజన్ మొత్తానికే స్పెషల్ అట్రాక్షన్ అయింది.

రెండో రోజు ఎవరెవరు వచ్చారంటే

రెండో రోజు ఎవరెవరు వచ్చారంటే

ఫ్యామిలీ మెంబర్ల ఎంట్రీ నేపథ్యంలో రెండో రోజైన శుక్రవారం ఎపిసోడ్‌లో ముందుగా ఆరియానా గ్లోరీ తరపున ఆమె స్నేహితుడు ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత అఖిల్ సార్థక్ తరపున వాళ్ల మదర్ అడుగు పెట్టారు. ఇక, చివర్లో మిత్రా శర్మ కోసం ఒకరు ఎంటరయ్యారు. ఈ ముగ్గురి రాక కూడా సందడిగా సాగింది. ఇక, ఈ ఎపిసోడ్ కొంత ఎమోషనల్‌గా సాగిందనే చెప్పుకోవాలి.

అఖిల్ మదర్ సరదా.. డ్యాన్స్‌లు

అఖిల్ మదర్ సరదా.. డ్యాన్స్‌లు

బిగ్ బాస్ హౌస్‌లోకి రెండోసారి ఎంట్రీ ఇచ్చిన అఖిల్ మదర్.. చాలా సరదాగా కనిపించారు. ముందుగా అందరికీ స్వీట్లు తినిపించిన ఆమె.. ఆ తర్వాత అందరి దగ్గరా ప్లస్‌లు మైనస్‌లను ప్రస్థావించారు. మరీ ముఖ్యంగా యాంకర్ శివను ఆమె ఓ ఆట ఆడుకున్నారు. అలాగే, బిందు మాధవితో ప్రేమగా మాట్లాడారు. షో తర్వాత తమ ఇంటికి రావాలని ఆమెను ఆహ్వానించారు.

అషు రెడ్డికి అఖిల్ మదర్ ఝలక్

అషు రెడ్డికి అఖిల్ మదర్ ఝలక్

బిగ్ బాస్ హౌస్‌లో తెగ సందడి చేసిన అఖిల్ సార్థక్ మదర్.. కంటెస్టెంట్లు అందరూ చక్కగా ఆడుతున్నారని, ఇక్కడ ఎమోషన్స్ పెట్టుకోకూడదని సూచించారు. అంతేకాదు, తన కొడుకుతో కూడా పదే పదే ఎమోషన్స్ గురించే మాట్లాడారు. ఈ క్రమంలోనే హౌస్‌లోని కంటెస్టెంట్లు అందరితో సరదాగా మాట్లాడారు. కానీ, అషు రెడ్డికి మాత్రం అఖిల్ మదర్ కోలుకోలేని షాక్ ఇచ్చారు.

ఆ పనుల కోసమే వచ్చావా అంటూ

ఆ పనుల కోసమే వచ్చావా అంటూ

అషు రెడ్డి దగ్గరకు వెళ్లిన అఖిల్ సార్థక్ మదర్ 'అషు.. చక్కగా ఆడు. ఇక్కడకు ఆట ఆడడానికి మాత్రమే రావాలి. ఎమోషన్స్ పెట్టుకోడానికి కాదు. నువ్వు అందరితో ఎమోషనల్‌గా బాండ్ అవడానికే వచ్చావా? అలా చేస్తే ఇక్కడ నెగ్గుకు రాలేరు' అని ముఖం మీదే చెప్పి షాకిచ్చారు. దీంతో అషు 'ఆమె నాతో డైరెక్టుగా అన్నారు. ఇక నుంచి దూరంగా ఉండాలి' అని అనుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X