Bigg Boss Nominations: ఆమెతో అఖిల్ అసభ్య ప్రవర్తన.. యాంకర్ శివ ఫైటింగ్.. అలా మీదకొస్తే బాగోదంటూ!

ఈ మధ్య కాలంలోనే తెలుగు బుల్లితెరపైకి ఎన్నో రకాల కార్యక్రమాలు పరిచయం అయ్యాయి. అయితే, అందులో అన్నీ ప్రేక్షకాదరణను సొంతం చేసుకోలేదు. కేవలం కొన్ని షోలు మాత్రమే భారీ రెస్పాన్స్‌ను అందుకుని సక్సెస్ అయ్యాయి. అలాంటి వాటిలో రియాలిటీ ఆధారంగా నడిచే బిగ్ బాస్ ఒకటి. సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచేలా ఇందులో కంటెంట్‌ను చూపిస్తూ నిర్వహకులు మరింత రెస్పాన్స్‌ను తెప్పిస్తున్నారు. ఇప్పుడు ఓటీటీ వెర్షన్ కూడా అలాగే సాగుతోంది.

ఇక, ఈ సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో యాంకర్ శివ పలువురితో గొడవకు దిగినట్లు ప్రోమోలో చూపించారు. దీంతో ఈ ఎపిసోడ్ మొత్తం రసవత్తరంగా సాగనున్నట్లు తెలుస్తోంది. అసలేం జరిగిందో మీరే చూడండి!

మరింత వినోదాన్ని పంచుతోంది

మరింత వినోదాన్ని పంచుతోంది

తెలుగులో బిగ్ బాస్ సూపర్ డూపర్ హిట్ అవడంతో ఓటీటీ వెర్షన్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఇది ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగుతోంది. మరీ ముఖ్యంగా డబుల్ మీనింగ్ డైలాగులు, బూతులు, బోల్డు బ్యూటీల రచ్చ, గొడవలతో రచ్చగా నడుస్తోంది. ఫలితంగా నాన్ స్టాప్‌గా వినోదాన్ని అందిస్తూ ముందుకు సాగుతోంది.

8 వారాల్లో... వాళ్లంతా ఎలిమినేట్

8 వారాల్లో... వాళ్లంతా ఎలిమినేట్

ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లోకి మొత్తం 17 మంది సెలెబ్రిటీలు కంటెస్టెంట్లుగా వచ్చారు. ఇందులో కొత్త వాళ్లతో పాటు మాజీ కంటెస్టెంట్లు కూడా హౌస్‌లోకి అడుగు పెట్టారు. వీళ్లలో నుంచి 8 వారాలకు గానూ ముమైత్, శ్రీ రాపాక, ఆర్జే చైతూ, సరయు, తేజస్వీలు, ముమైత్ ఖాన్ (రెండోసారి), స్రవంతి చోకారపు, మహేశ్ విట్టా, అజయ్‌లు ఎలిమినేట్ అయిపోయారు.

అన్నింటి కంటే ఇదే ప్రాధాన్యం

అన్నింటి కంటే ఇదే ప్రాధాన్యం

బిగ్ బాస్ రియాలిటీ షోలో ఎన్నో టాస్కులు.. మరెన్నో చిత్ర విచిత్రమైన పరిణామాలు జరుగుతూ ఉంటాయి. అయితే, అన్నింటి కంటే ఎంతో ముఖ్యమైన ఘట్టం నామినేషన్స్ ప్రక్రియే. వారం మొదలైన రోజు అంటే ప్రతి సోమవారం దీన్ని ప్రసారం చేస్తుంటారు. నాన్ స్టాప్ సీజన్‌లో ఊహించని ఎలిమినేషన్స్ జరుగుతుండడంతో 9వ వారం నామినేషన్స్‌పై అందరూ ఫోకస్ చేశారు.

9వ వారం నామినేషన్స్ ప్రక్రియ

9వ వారం నామినేషన్స్ ప్రక్రియ

9వ వారానికి సంబంధించి జరిగే నామినేషన్స్ ప్రక్రియ డైరెక్టుగానే జరగనున్నట్లు తాజాగా విడుదలైన ప్రోమోలో చూపించారు. ఇందులో ఒక కంటెస్టెంట్.. తాను నామినేట్ చేయాలనుకున్న ఇద్దరు ఇంటి సభ్యుల ముందు ఉన్న దిష్టిబొమ్మపై కుండను పెట్టి పగలగొట్టాల్సి ఉంటుంది. అందుకు సరిపోయే కారణాలను కూడా చెప్పాలి. అఖిల్ కెప్టెన్ కావడంతో అతడిని వదిలిపెట్టారు.

నటరాజ్ మాస్టర్‌తో శివ గొడవతో

నటరాజ్ మాస్టర్‌తో శివ గొడవతో

సోమవారం రాత్రి ప్రసారం కానున్న నామినేషన్స్ టాస్కులో యాంకర్ శివ.. నటరాజ్ మాస్టర్‌ను నామినేట్ చేసినట్లు ప్రోమోలో చూపించారు. అంతేకాదు, కెప్టెన్‌గా ఉన్నప్పుడు తన మాట వినలేదని కారణం చెప్పాడు. 'నేను కెప్టెన్‌గా ఉన్నప్పుడు నా మీద మీదకు వచ్చి మాట్లాడుతున్నారు. ఇంకోసారి అలా మీదకు వచ్చి మాట్లాడితో బాగోదు' అంటూ వార్నింగ్ ఇచ్చేశాడు.

అఖిల్‌తో కూడా గొడవ పడుతూ

ఈ ప్రక్రియలో అఖిల్ యాంకర్ శివను నామినేట్ చేశాడు. ఆ సమయంలో ఇద్దరికీ గొడవ జరిగింది. అప్పుడు అఖిల్ 'రెండోసారి షోకు వచ్చానంటే రిమార్కులు తీసుకోడానికి రాలేదు' అని అన్నాడు. దీనికి శివ 'అసలు నామినేషన్స్‌లో అమ్మాయి బాత్రూం టాపిక్ ఎత్తడమే పెద్ద తప్పు' అన్నాడు. దీంతో అఖిల్‌కు చిర్రెత్తుకొచ్చింది. దీనికి శివ కూడా ధీటుగానే బదులిచ్చాడు.

ఆరియానా.. హమీదాలు కూడా

ఆరియానా.. హమీదాలు కూడా

యాంకర్ శివ ఆ తర్వాత మిత్రా శర్మతో కూడా గొడవ పెట్టుకున్నాడు. అనంతరం ఆరియానా గ్లోరీ, హమీదా మధ్య కూడా బిగ్ ఫైట్ జరిగింది. మొత్తానికి 9వ వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియ ఎన్నో గొడవలతో రసవత్తరంగా సాగినట్లు తెలుస్తోంది. ఇక, ఈ వారానికి గానూ బిందు మాధవి, అఖిల్ సార్థక్ మినహా మిగిలిన వాళ్లంతా నామినేట్ అయినట్లు ఓ న్యూస్ లీకైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X