For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Non stop: యాక్ థూ అంటూ బాబా భాస్కర్ వింత ప్రవర్తన.. కన్నీళ్లు పెట్టుకున్న అరియనా

  |

  బిగ్ బాస్ నాన్ స్టాప్ షో చివరికి వచ్చేసింది. మరి కొద్ది రోజుల్లో ఈ సీజన్ కు సంబంధించిన ఫైనల్ ఎపిసోడ్ కూడా ప్రసారం అయ్యే అవకాశం కనిపిస్తోంది. అయినా సరే హౌస్ మేట్స్ మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అయితే అసలు ఏమీ గొడవ లేకుండా బాబా భాస్కర్ చేసిన వింత ప్రవర్తనకు అరియానా గ్లోరీ కన్నీళ్లు పెట్టుకోవడం హౌస్ లో హాట్ టాపిక్ గా మారింది. బాబా భాస్కర్ ఏమన్నాడు? అరియానా గ్లోరీ ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంది? అనే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

   పొద్దున లేస్తూనే

  పొద్దున లేస్తూనే

  ప్రతి రోజు లాగానే బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో ఒక సాంగ్ తో కంటెస్టెంట్స్ అందరిని నిద్ర లేపారు. చిరంజీవి హీరోగా విడుదలైన ఆచార్య సినిమా నుంచి భలే భలే బంజారా సాంగ్ తో కంటెస్టెంట్స్ అందరిని నిద్ర లేపడంతో అప్పటికే నిద్ర లేచి టీ చేస్తున్న బాబా భాస్కర్ అక్కడే నిలబడి డాన్స్ వేసి సందడి చేశారు. ఆ తర్వాత తన ఫ్రెండ్స్, తన కుటుంబ సభ్యులకు తన వాచ్ మెన్ సహా అందరికీ హాయ్ చెబుతూ కాసేపు సరదాగా మాట్లాడారు.

  ఎలా పంపాలో తెలుసు

  ఎలా పంపాలో తెలుసు


  ఆ తర్వాత నిద్ర లేచి వచ్చిన అరియానా, పొద్దుపొద్దున్నే నీ దర్శనం ఏమిటి బాబా? ప్లీజ్ కొన్ని రోజులు ఇలా పొద్దున్నే లేచి టీ పెట్టడం ఆపివేయవచ్చు కదా అని అడుగుతుంది. దీంతో బాబా భాస్కర్ అక్కడే కూర్చుని ఉన్న యాంకర్ శివతో ఇలాంటి అమ్మాయి మన హౌస్ లో ఉండటం అవసరమా అని ప్రశ్నిస్తాడు. అంతేగాక నామినేషన్స్ లో లేదు కదా ఎలా అయినా మాట్లాడుతుంది అయినా ఆవిడని ఎలా పంపించాలో మనకి తెలుసు కదా అంటూ కామెంట్స్ చేయడంతో యాంకర్ శివ, బాబా భాస్కర్ ఇద్దరు కలిసి నవ్వుకుంటారు.

  ఇక్కడే ఉంటా

  ఇక్కడే ఉంటా

  శివ మాట్లాడుతూ అవును ఈసారి మెయిన్ డోర్ నుంచి వెళ్లడమే అంటాడు. మళ్లీ లోపలికి వెళ్లి వస్తున్న ఆమె ఉదయం లేవగానే బయటకు రాగానే మీరే కనబడుతున్నారు దయచేసి కొన్నాళ్ళు ఇలా ఉదయాన్నే టీ పెట్టడం ఆపండి అందరూ లేచి డాన్స్ చేసిన తర్వాత మీరే టీ పెట్టుకోండి అంటుంది. నువ్వు చెప్పినట్లు ఇక్కడేమీ జరగదు, కావాలంటే ఉండు లేకపోతే వెళ్ళిపో అనడంతో నేను ఎందుకు వెళ్ళాలి నేను ఎక్కడికి వెళ్ళను బిగ్ బాస్ పంపించే వరకు ఇక్కడే ఉంటాను అని అంటుంది.

  ఇబ్బంది పడాల్సిన పనిలేదు

  ఇబ్బంది పడాల్సిన పనిలేదు

  దానికి బాబా భాస్కర్ కూడా అబ్బే పెద్దగా ఇబ్బంది పడాల్సిన పనిలేదు ఇంకా రెండు రోజులు శనివారం వచ్చేసింది ఆ రోజు వెళ్ళిపోవచ్చు అంటూ కామెడీ చేస్తారు. అప్పటికే ఆమెకు బాధ కలిగినా ఏ మాత్రం బయటపడకుండా, నేను ఎలా ఉన్నా కంటెంట్ ఇస్తున్నాను అంటే నేను బిగ్ బాస్ హౌస్ కి ఎంత మంచి కంటెస్టెంట్ ని మీరు అది కూడా కన్సిడర్ చేయండి బిగ్ బాస్ అంటూ కెమెరాలతో మాట్లాడుతుంది.

   కాండ్రించి ఉమ్మేస్తూ

  కాండ్రించి ఉమ్మేస్తూ

  ఆమె అలా అంటుంటే బాబా భాస్కర్ మాత్రం కాండ్రించి ఉమ్మేస్తూ థూ అంటాడు, ఒకరకంగా అక్కడే అరియాన బాగా హర్ట్ అయింది. ఏమనాలో అర్థం కాక మీ మీద మీరు ఉమ్మి వేసుకుంటున్నారా అయినా ఆ ఉమ్మి వేస్ట్ చేయడం ఎందుకు మంచినీళ్లు తాగడం ఎందుకు అంటూ ఎలా కవర్ చేసుకోవాలో అర్థం కాక కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇంతలో అక్కడే ఉన్న యాంకర్ శివ కూడా నవ్వడంతో నువ్వు కూడా నవ్వుతున్నావా గుడ్ రా శివ గుడ్ అంటుంది.

  ఏడుస్తూ

  ఏడుస్తూ


  నాకు మిమ్మల్ని చూస్తుంటే కోపం వస్తుంది అని బాబా భాస్కర్ మాస్టర్ తో అంటుంటే, ఆయన కూడా నిన్ను చూస్తుంటే మాకు కూడా వస్తుందని అంటాడు. మాకైతే పర్వాలేదు ఆడియన్స్ కు కూడా నీ మీద కోపం వస్తుందని అంటూ, టీ పోసుకుని సెల్ఫ్ హార్మింగ్ చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ, అది ఏమాత్రం కరెక్ట్ కాదనే విషయం మళ్ళీ ప్రస్తావిస్తారు. దీంతో ఆమె ఏడవడం మొదలు పెడుతుంది. ఇంతలో బిందు వచ్చి ఏమైంది అని అడిగితే, నిన్న వెళ్లిపోమంటే ఈరోజే వెళ్ళిపోతాను అంటుంది వాళ్ళ అమ్మ గుర్తొచ్చింది అంటాడు. చివరికి ఆమె ఏడుస్తున్న విషయం అర్థం చేసుకుని ఓదార్చే ప్రయత్నం చేస్తాడు. బాబా ప్రవర్తన ఏ మాత్రం బాలేదు అని కొంత మంది కామెంట్ చేస్తున్నారు.

  English summary
  In Bigg Boss Non stop Ariyana Glory cries due to Baba Bhaskar behavior.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X