Bigg Boss Non Stop: అషు గలీజ్ మాటలు.. బిందు అతడి సెంటర్‌లో టచ్ చేసింది.. బాత్రూంలో చూడండంటూ!

తెలుగు బుల్లితెరపైకి ఆలస్యంగానే వచ్చినా.. ప్రేక్షకుల నుంచి ఊహించని రీతిలో స్పందనను అందుకుని.. టెలివిజన్ రంగంలో హవాను చూపిస్తూ నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. మన దగ్గర మాత్రమే కాదు.. భారీ టీఆర్పీ రేటింగ్‌ను సొంతం చేసుకుంటూ దేశంలోనే టాప్ షోగా ఎదిగిపోయింది. దీంతో నిర్వహకులు ఐదు సీజన్లను పూర్తి చేసి.. ఇప్పుడు ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్‌ను ప్రసారం చేస్తున్నారు. ఇది కూడా ఆరంభం నుంచే జనరంజకంగా సాగుతూ మజాను అందిస్తోంది. ఇక, ఇందులో బిందు వర్సెస్ అఖిల్ బ్యాచ్ ఫైట్ ఆసక్తికరంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో బిందుపై అషు రెడ్డి అసభ్యకర వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాలు మీకోసం!

ఓటీటీకి తగ్గట్లు బోల్డ్ కంటెంట్

ఓటీటీకి తగ్గట్లు బోల్డ్ కంటెంట్

గతంలో బిగ్ బాస్ షో బుల్లితెరపై ప్రసారం అయ్యేది. దానికి సెన్సార్ ఉండడంతో నిర్వహకులు బోల్డు కంటెంట్‌ను కట్ చేసి మామూలు సంఘటనలను చూపించేవారు. అయితే, ఇప్పుడు ఓటీటీ వెర్షన్ స్ట్రీమింగ్ అవుతుండడంతో ఇది ఆద్యంతం బోల్డుగానే సాగుతోంది. దీంతో ప్రేక్షకులకు నచ్చే అంశాలు చాలానే ఉంటున్నాయి. ఫలితంగా ఈ సీజన్ కూడా సక్సెస్‌ఫుల్‌గానే నడుస్తోంది.

వాళ్లిద్దరూ టైటిల్ ఫేవరెట్లుగా

వాళ్లిద్దరూ టైటిల్ ఫేవరెట్లుగా

బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లోకి మొత్తం 17 మంది కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. ఇందులో కొత్త వాళ్లతో పాటు మాజీ కంటెస్టెంట్లు కూడా అడుగు పెట్టారు. ఇక, ఇందులో తెలుగు హీరోయిన్ బిందు మాధవి, నాలుగో సీజన్ రన్నరప్ అఖిల్ సార్థక్ టైటిల్ ఫేవరెట్లుగా బరిలోకి దిగారు. వీళ్లిద్దరి మధ్య ఆట పరంగా, మైడ్‌గేమ్ పరంగా పోటీ కనిపిస్తోన్న సంగతి తెలిసిందే.

ఫైటింగ్స్‌తో బిందు టార్గెట్‌గా

ఫైటింగ్స్‌తో బిందు టార్గెట్‌గా

తాజాగా జరుగుతోన్న సీజన్‌లో ఆరంభం నుంచే బిందు మాధవి - అఖిల్ సార్థక్ మధ్య ఆరంభం నుంచే కోల్డ్ వార్ నడుస్తోంది. అందుకే వీళ్లే తరచూ గొడవలకు దిగుతున్నారు. మరీ ముఖ్యంగా అఖిల్ బ్యాచ్ అంటే నటరాజ్, అషు, అజయ్‌లు బిందును టార్గెట్ చేస్తున్నారు. దీంతో ఇప్పటికే ఎన్నో వివాదాలు కూడా చెలరేగాయి. దీంతో వీళ్లిద్దరూ మరింత హైలైట్ అవుతున్నారు.

హ్యూమన్స్ వర్సెస్ ఏలియన్స్

హ్యూమన్స్ వర్సెస్ ఏలియన్స్

ఎనిమిదో వారానికి సంబంధించిన కెప్టెన్సీ పోటీదారులను ఎంపిక చేసుకునేందుకు 'హ్యూమన్స్ వర్సెస్ ఏలియన్స్' టాస్కును ఇచ్చారు. ఇందులో గెలిచిన జట్టు సభ్యులే ఈ వారం కెప్టెన్సీకి పోటీ చేసే అర్హతను పొందుతారని బిగ్ బాస్ చెప్పాడు. ఇందులో హ్యూమన్స్‌గా అఖిల్, శివ, అషు, అనిల్, మిత్రాలు ఉన్నారు. మిగిలిన వాళ్లు ఏలియన్స్‌గా, బాబా భాస్కర్ సంచాలకుడిగా చేశారు.

రంగు ఒకరికి.. పాట్స్ వాళ్లకు

రంగు ఒకరికి.. పాట్స్ వాళ్లకు

హ్యూమన్స్ వర్సెస్ ఏలియన్స్ టాస్కులో భాగంగా ఏలియన్స్‌గా ఉన్న వాళ్లు మనుషుల అరచేతులకు రంగులు పూయాలి. అలాగే, మనుషులుగా ఉన్న వాళ్లు ఏలియన్స్ దగ్గరున్న పాట్స్‌ను దక్కించుకుని పగలగొట్టాలి. దీనిబట్టి బ్యాటరీకి పవర్స్ వస్తాయి. ఇందులో మొదటి రోజు హ్యూమన్సే ఆధిపత్యం చూపించారు. ఇక, ఈ టాస్క్ కూడా కొన్ని గొడవలతో రచ్చ రచ్చగా సాగింది.

అతడి సెంటర్‌ను టచ్ చేసి

అతడి సెంటర్‌ను టచ్ చేసి

హ్యూమన్స్ వర్సెస్ ఏలియన్స్ టాస్క్ మొదటి రోజు పూర్తైన తర్వాత అషు రెడ్డి, అఖిల్, నటరాజ్ మాస్టర్ మధ్య చర్చ జరిగింది. ఆ సమయంలో బిందు మాధవి గురించి గలీజ్ మాటలు వినిపించాయి. అషు రెడ్డి 'బిందు తన రంగు ఉన్న చేతులతో అఖిల్ సెంటర్‌లో టచ్ చేసింది. పాపం ఏకంగా అక్కడ ముట్టేసుకుంది' అంటూ వెటకారంగా చెప్పడం కనిపించింది.

బాత్రూంకు వెళ్లి చూడండని

బాత్రూంకు వెళ్లి చూడండని

టాస్కులో భాగంగా జరిగిన విషయాన్ని అషు రెడ్డి.. కావాలనే చేసినట్లు చెప్పుతుండగా.. అఖిల్ సిగ్గు పడిపోయాడు. అంతేకాదు, అషు 'ఏంటి మీరు నమ్మడం లేదా? అయితే, బాత్రూంలో ఆయన ప్యాంట్ ఆరేసి ఉంచాడు. దాన్ని చూడండి. కరెక్టుగా సెంటర్‌లోనే బిందు చేయి గుర్తు కనిపించింది' అని పదే పదే చెప్పింది. దీంతో నటరాజ్ మాస్టర్ కూడా పకపకా నవ్వాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X