Bigg Boss Non Stop: పదో వారం ఊహించని ఎలిమినేషన్.. ఆమెను సేవ్ చేసి.. ఈమెకు షాకిచ్చారుగా!
తెలుగు బుల్లితెరపైకి ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చి.. భారీ స్థాయిలో ప్రేక్షకాదరణను సొంతం చేసుకుని సూపర్ డూపర్ హిట్ షోగా ఎదిగిపోయింది బిగ్ బాస్. గతంలో ఎప్పుడూ చూడని కంటెంట్‌తో ప్రసారం అవుతోన్నా.. సరికొత్త టాస్కులు.. ఊహించని సంఘటనలు.. ఆసక్తిని కలిగించే ఎలిమినేషన్స్ ఇలా ఎన్నో రకాల పరిణామాలతో ఇది ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతోంది.
ఈ క్రమంలోనే ఇప్పుడు బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ నాన్ స్టాప్ మొదటి సీజన్ కూడా ప్రేక్షకులకు మజాను పంచుతోంది. మరీ ముఖ్యంగా ఇందులో ఊహించని ఎలిమినేషన్స్ కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే పదో వారం కూడా షాకింగ్ ఎలిమినేషన్ జరిగినట్లు తెలిసింది. ఆ వివరాలేంటో చూద్దాం పదండి!

బోల్డు కంటెంట్‌తో మజా పంచి
ఓటీటీలో ప్రసారం అవుతోన్నా బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌కు భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. ఇందులో గతంలో ఎన్నడూ చూడని కాన్సెప్టులు, టాస్కులు, బోల్డు సీన్స్‌ను చూపిస్తున్నారు. ఫలితంగా దీనికి వాటికి మించిన రేటింగ్ అందుతోంది. ఇక, ఇప్పుడు ఇది చివరి దశకు చేరుకోవడంతో మరింత ఆసక్తికరంగా సాగుతూ ప్రేక్షకులకు మజాను పంచుతోంది.

9 వారాల్లో.. 9 మంది బయటకు
ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లోకి 17 మంది సెలెబ్రిటీలు కంటెస్టెంట్లుగా వచ్చారు. ఇందులో కొత్త వాళ్లతో పాటు మాజీ కంటెస్టెంట్లు కూడా ఉన్నారు. వీళ్లలో నుంచి గడిచిన 8 వారాలకు గానూ ముమైత్, శ్రీ రాపాక, ఆర్జే చైతూ, సరయు, తేజస్వీలు, ముమైత్ ఖాన్ (రెండోసారి), స్రవంతి చోకారపు, మహేశ్ విట్టా, అజయ్, హమీదాలు షో నుంచి ఎలిమినేట్ అయిపోయారు.

అలాంటి ఎలిమినేషన్స్‌తో షాక్
బిగ్ బాస్ షోలో ఎవరు ఉండాలి? ఎవరు వెళ్లిపోవాలి? అనేది ప్రేక్షకులు వేసే ఓటింగ్ మీద ఆధారపడి ఉంటుందన్న విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగానే తక్కువ ఓట్లు వచ్చే కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవుతుంటారు. అయితే, బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్‌లో మాత్రం దీనికి భిన్నంగా స్ట్రాంగ్ కంటెస్టెంట్లే వెళ్లిపోతున్నారు. దీంతో ఈ ప్రాసెస్‌పై అనుమానాలు వస్తున్నాయి.

ఈ వారం ఏడుగురు నామినేట్
ఎప్పటి లాగే బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో పదో వారానికి జరిగిన నామినేషన్స్ ప్రక్రియ గతంలో మాదిరిగానే ఎన్నో గొడవలతో సాగింది. ఇందులో మరీ ముఖ్యంగా బిందు - మిత్రా, అఖిల్ - శివ, అఖిల్ - ఆరియానా ఇలా కొందరి మధ్య వాగ్వాదాలు కనిపించాయి. చివరకు బిందు మాధవి, శివ, అఖిల్, మిత్రా శర్మ, అనిల్ రాథోడ్, ఆరియానా, అషు రెడ్డిలు నామినేట్ అయ్యారు.

పోటాపోటీగా.. వాళ్లంతా సేఫ్‌గా
పదో వారానికి జరిగిన ఓటింగ్‌లో చివరకు అఖిల్ సార్థక్‌కు ఎక్కువ ఓట్లు పోలయ్యాయని అంటున్నారు. ఆ తర్వాతి స్థానంలో బిందు మాధవి ఉందట. వీళ్లిద్దరి మధ్య పాయింట్ శాతమే తేడా ఉందని తెలుస్తోంది. వీళ్లిద్దరితో పాటు యాంకర్ శివ, ఆరియానా గ్లోరీ, మిత్రా శర్మ కూడా ఈ వారం ఎక్కువ ఓట్లు సాధించారని తెలిసింది. దీంతో వీళ్లందరూ కూడా సేఫ్ అయిపోయారని టాక్.

బిగ్ బాస్ నుంచి ఆమె అవుట్
తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం.. పదో వారానికి సంబంధించిన ఎలిమినేషన్ ప్రక్రియ శనివారమే పూర్తైందట. అందరూ అనుకున్నట్లుగా ఇందులో మరో స్ట్రాంగ్ అండ్ పాపులర్ కంటెస్టెంట్ అషు రెడ్డి ఎలిమినేట్ అయిందని తెలిసింది. మూడో సీజన్‌లో కంటెస్టెంట్‌గా వచ్చిన ఈమె మధ్యలోనే వెళ్లింది. ఇప్పుడు చివరి వరకూ వచ్చి షో నుంచి వెళ్లిపోయిందని సమాచారం.

ఆమెను సేఫ్ చేసిన బిగ్ బాస్
బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో ఆరంభం నుంచీ ఎలిమినేషన్ షాకింగ్‌గానే జరుగుతోంది. కానీ, ఈ వారం మాత్రం అషు రెడ్డినే చివరి స్థానంలో కొనసాగింది. అయితే, వారాంతానికి ఫలితం మారుతుండడంతో ఆమె స్థానంలో మరొకరు బలవుతారని అంతా అనుకున్నారు. కానీ, ఆమెనే పంపేశారని తెలిసింది. ఇక, మిత్రా శర్మ ఈ వారం కూడా సేవ్ అవడంపై డౌట్స్ వస్తూనే ఉన్నాయి.


Click it and Unblock the Notifications