For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Non Stop: నాగార్జునపై అషురెడ్డి ముద్దుల వర్షం.. ఆ వీడియో చూపించడం వల్లే!

  |

  బిగ్ బ్రదర్ అనే ఇంగ్లీష్ షో ఆధారంగా రూపొంది.. ఇండియాలో సూపర్ సక్సెస్ అయిన షోనే బిగ్ బాస్. ముందుగా హిందీలో మొదలైన ఈ కార్యక్రమం.. ఆ తర్వాత చాలా భాషల్లోకి వచ్చింది. ఇందులో భాగంగానే ఐదేళ్ల క్రితమే తెలుగులోకి పరిచయం అయింది. మన దగ్గర ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చినా.. చాలా తక్కువ సమయంలోనే సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో నిర్వహకులు వరుసగా సీజన్లను పూర్తి చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్‌ను అంతే ఉత్సాహంతో నడుపుతున్నారు. ఇక, తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో ఓ షాకింగ్ సీన్ కనిపించింది. స్టేజ్ మీదే నాగార్జునకు ఓ బోల్డ్ బ్యూటీ ముద్దు పెట్టేసింది. అసలేం జరిగింది? ఆ వివరాలేంటో చూద్దాం పదండి!

  బోల్డుగా సాగుతోన్న నాన్ స్టాప్ సీజన్

  బోల్డుగా సాగుతోన్న నాన్ స్టాప్ సీజన్

  ఆరంభంలోనే భారీ స్థాయిలో అంచనాలను ఏర్పరచుకున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్.. అందుకు అనుగుణంగానే యమ రంజుగా సాగుతోంది. ఇందులో గతంలో కంటే కొత్త కంటెంట్‌ను చూపించడంతో పాటు బోల్డు సీన్లను మరింత హైలైట్ చేస్తున్నారు. ఫలితంగా ఇది మజాను అందిస్తోంది. ఇక, ఇప్పుడు చివరి దశకు చేరుకోవడంతో మరింత ఆసక్తిగా మారింది.

  Samantha: శృతి మించిన సమంత హాట్ షో.. ఆమెను ఇంత గ్లామర్‌గా ఎప్పుడూ చూసుండరు!

  ఆదివారం ఎపిసోడ్‌ మరింత ఫన్‌తో

  ఆదివారం ఎపిసోడ్‌ మరింత ఫన్‌తో

  బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో హోస్ట్ అక్కినేని నాగార్జున ఆదివారం ఇంటి సభ్యులతో కలిసి సందడి చేస్తాడన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే గత ఎపిసోడ్‌లో ఆయన కంటెస్టెంట్లతో కలిసి సరదాగా కనిపించాడు. ముందుగా రివ్యూలు ఇచ్చే టాస్క్ ఆడించిన నాగ్.. ఆ తర్వాత ఆటపాటలతో సందడి చేశాడు. దీంతో ఈ ఎపిసోడ్ మొత్తం ఫన్నీగా జరిగింది.

  ఏడుగురు సభ్యులు నామినేషన్‌లో

  ఏడుగురు సభ్యులు నామినేషన్‌లో

  బిగ్ బాస్ షోలో సాధారణంగా నామినేషన్స్ ప్రక్రియలు ఎంత రచ్చ రచ్చగా సాగుతుంటాయో తెలిసిందే. ఇందులో భాగంగానే నాన్ స్టాప్ సీజన్‌లో 10వ వారానికి జరిగిన ప్రక్రియ కూడా ఎన్నో గొడవలతో సాగింది. మొత్తంగా ఇందులో ఏడుగురు సభ్యులు నామినేట్ అయ్యారు. అందులో బిందు మాధవి, శివ, అఖిల్, మిత్రా శర్మ, అనిల్ రాథోడ్, ఆరియానా, అషు రెడ్డిలు ఉన్నారు.

  Neil Kitchlu: కొడుకు ఫొటోతో కాజల్ బిగ్ సర్‌ప్రైజ్.. నీల్ కిచ్లూ ఎలా ఉన్నాడో చూశారంటే!

  బాబా భాస్కర్‌ పాస్‌ను వాడలేదుగా

  బాబా భాస్కర్‌ పాస్‌ను వాడలేదుగా

  ఆదివారం జరిగిన నామినేషన్స్ ప్రక్రియలో మిత్రా శర్మ, యాంకర్ శివ, అఖిల్ సార్థక్, బిందు మాధవి, అనిల్ రాథోడ్ ముందుగా సేఫ్ అయ్యారు. చివరకు క్లోజ్ ఫ్రెండ్ అయిన అషు రెడ్డి, ఆరియానా గ్లోరీ మాత్రమే మిగిలారు. ఆ సమయంలో బాబా భాస్కర్ గెలుచుకున్న ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ను వాళ్ల కోసం వాడతారా అని నాగార్జున ప్రశ్నించగా.. ఆయన దానికి ఒప్పుకోలేదు.

  షో నుంచి బోల్డ్ బ్యూటీ ఎలిమినేట్

  షో నుంచి బోల్డ్ బ్యూటీ ఎలిమినేట్

  బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లోకి ఎంతో మంది కంటెస్టెంట్లుగా వచ్చారు. అందులో కొందరు మాత్రమే ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. అలాంటి వారిలో అషు రెడ్డి ఒకరు. గతంలో కంటే ఇప్పుడు చక్కని ఆటతీరు ఆకట్టుకున్న ఈ భామ.. అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ నేపథ్యంలో గత ఎపిసోడ్‌లో జరిగిన ప్రక్రియలో షో నుంచి ఎలిమినేట్ అయిపోయింది.

  బాత్రూంలో శ్రీయ హాట్ సెల్ఫీ: వామ్మో తల్లైనా అస్సలు తగ్గకుండా అందాల ఆరబోత

  ఆ వీడియో చూపించగానే ముద్దు

  ఆ వీడియో చూపించగానే ముద్దు

  ఎలిమినేట్ అయిన తర్వాత అషు రెడ్డి స్టేజ్ మీదకు వచ్చి నాగార్జునకు హగ్గుల మీద హగ్గులు ఇచ్చింది. ఆ తర్వాత ఆమె జర్నీ వీడియో చూపించారు. అందులో ఆమె నాగార్జునకు ముద్దు పెట్టిన విజువల్స్ కూడా ప్లే చేశారు. అనంతరం అషు రెడ్డి మరోసారి నాగార్జునకు ముద్దు పెట్టేసింది. ఇలా షోలోకి వచ్చినప్పుడు.. బయటకు వెళ్లేటప్పుడు వీళ్లిద్దరి ముద్దు సీన్ తెగ హైలైట్ అయింది.

  కూరగాయలతో పోల్చుతూ ఇలా

  కూరగాయలతో పోల్చుతూ ఇలా

  బిగ్ బాస్ షో నుంచి ఎలిమినేట్ అయిన వాళ్లకు టాస్క్ ఇస్తుంటారు. ఇందులో భాగంగానే అషు రెడ్డికి కూరగాయలు, పండ్లు ఇచ్చి.. హౌస్‌లోని కంటెస్టెంట్లను వాటితో పోల్చమని చెప్పాడు నాగార్జున. దీంతో అన్నీ చేదు అనుభవాలనే అన్న ఉద్దేశ్యంలో శివను కాకరకాయతో పోల్చింది. అలాగే, పైకి ఎలా ఉన్నా లోపల మాత్రం మంచోడు అంటూ నటరాజ్‌ను కొబ్బరికాయతో పోల్చింది.

  English summary
  Bigg Boss Telugu Non Stop OTT First Season Running Successfully. Ashu Reddy Kiss To Nagarjuna After Elimination.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X