Bigg Boss Non-Stop : చీపురుకట్టతో వచ్చి పరువు తీసేసిన అషురెడ్డి తల్లి.. యాంకర్ శివ లవ్ సీక్రెట్?
తెలుగులో బిగ్ బాస్ కు ఎంత క్రేజ్ ఉందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే టీవీ సీజన్స్ కు అదనంగా ఒటీటీ సీజన్ కూడా మొదలు పెట్టారు. ఇక డానికి బిగ్ బాస్ నాన్ స్టాప్ అనే పేరు కూడా పెట్టారు. ఇక ప్రతి సీజన్ లో ఫ్యామిలీ ఎపిసోడ్స్ ఆసక్తికరంగా సాగుతయన్న సంగతి తెలిసిందే. ఇక ఈ వారం ఫ్యామిలీ ఎపిసోడ్స్ ఉండబోతున్నాయని లీకులు ఇచ్చిన విధంగా గురువారం నాడు టెలికాస్ట్ అయ్యే ప్రోమోలో ఫ్యామిలీ ఎంట్రీ ఇచ్చినట్టు చూపించారు. ప్రస్తుతం హౌస్‌లో పది మంది కంటెస్టెంట్స్ ఉండగా వారి తరుపున ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే

ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి
బిగ్ బాస్ నాన్ స్టాప్ లో ఫామిలీలు ఎంట్రీ ఇచ్చారు. ఇక వీకెండ్‌లో కంటెస్టెంట్స్ తరుపున వాళ్ల ఫ్రెండ్స్ కూడా బిగ్ బాస్ స్టేజ్‌పై కనిపించే అవకాశం ఉందని అంటున్నారు. ఒకరకంగా చెప్పాలి అంటే బిగ్ బాస్ హౌస్‌లో ఫ్యామిలీ ఎపిసోడ్ వచ్చింది అంటే అది ఇక ప్రీ ఫైనల్ అనే చెప్పాలి. ఎందుకంటే హౌస్‌లో ఉన్న వాళ్లకి బయట ఏం జరుగుతుందో ఎవరికీ ఐడియా ఉండదు. హౌస్ లో ఎవరికి క్రేజ్ ఉందో మనకు తెలుసు కానీ లోపలి వాళ్ళకు తెలియదు కదా. అందుకే ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి హింట్స్ వెళ్లిన తర్వాత గేమ్ స్వరూపం మారుతూ ఉంటుంది.

క్రేజ్ ఎక్కువ ఉంది
లోపలికి వచ్చిన వాళ్లు మాట్లాడే ప్రతి మాట గేమ్‌కి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుందని చెప్పక తప్పదు. ఇక ఈ సీజన్ విషయానికి వస్తే బాబా భాస్కర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన సమయంలో బిందు మాధవిని సేవ్ చేయడం ద్వారా ఆమెకు బయట క్రేజ్ ఎక్కువ ఉంది అని అర్థం అయ్యేలా చేశారు. ఈ వారం ఫ్యామిలీ ఎపిసోడ్‌లో భాగంగా ఇంటి సభ్యులకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ హౌస్‌లోకి అడుగుపెట్టేశారు.

ఎందుకు వచ్చావ్.. ఏం చేస్తున్నావ్
అలా ముందుగా అషురెడ్డి తల్లి చీపురు పట్టుకొని మరీ ఎంట్రీ ఇచ్చి అసలు నువ్ హౌస్‌లోకి ఎందుకు వచ్చావ్.. ఏం చేస్తున్నావ్ అంటూ చురకలేసింది. నువ్వు వచ్చింది గేమ్ ఆడి గెలవడానికా లేక ఎమోషన్స్ పెంచుకోవడానికా ? అంటూ ఫైర్ అయింది. దానికి అషు అమ్మ పరువు తీయకే అంటూ వెళ్లి హగ్ చేసుకుంది.

శివ చెల్లెలు
ఆ తరువాత గేం లో నీ ఫేవరేట్ ఎవరు అని అడిగితే ఏమీ మాట్లాడదు. నేనని చెప్పచ్చు కదా అంటే కాదని అంటుంది. ఇక ఆమె వెళ్ళిన తరువాత శివ చెల్లెలు యమున వస్తుంది. ఆమె రావడంతో అందరూ సాదరంగా ఆహ్వానిస్తారు.

నటరాజ్ మాస్టర్ కుమార్తె ఎంట్రీ
ఇక మీ అన్న పార్టనర్ చూశావా? అంటే అన్నా మన ఊరి అమ్మాయేనా అని అడుగుంతుంటే శివ కాదని సిగ్గు పడుతూ ఉండగా బిందు మాధవి నవ్వుతూ కనిపిస్తోంది. అషు ఆల్రెడీ సెట్ చేసుకున్నాడా? అని అడగడం కనిపిస్తోంది. ఇక ఆ తరువాత నటరాజ్ మాస్టర్ భార్య, కూతురు హౌస్‌లో సందడి చేశారు. ఇక పాపతో మిగతా హౌస్ సభ్యులు కూడా చాలా ఎంజాయ్ చేశారు.


Click it and Unblock the Notifications











