Bigg Boss Non Stop: బిగ్ బాస్‌కే షాకిచ్చిన కంటెస్టెంట్.. టైటిల్ వద్దు గెట్ తెరిస్తే వెళ్లిపోతానంటూ!

బిగ్ బాస్.. తెలుగు బుల్లితెర ప్రియులకు అస్సలు పరిచయం అవసరం లేని పేరిది. అంతలా ఈ రియాలిటీ షో దాదాపు ఐదేళ్లుగా టెలివిజన్ రంగంలో హవాను చూపిస్తూ దూసుకుపోతోంది. ఫలితంగా సీజన్ల మీద సీజన్లను కూడా కంప్లీట్ చేసుకుంటోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌ను తీసుకు వచ్చారు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారం అవుతోన్న ఈ సీజన్‌కు కూడా ఆరంభం నుంచే ఆదరణ లభిస్తోంది. ఇలా ఇది ఫినాలే స్టేజ్‌కు చేరుకుంది. ఈ వారాంతంలోనే విజేత ఎవరో తేలిపోనుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ షోలో ఓ షాకింగ్ సంఘటన జరిగింది? ఓ కంటెస్టెంట్ బయటకు వెళ్లిపోతానని బిగ్ బాస్‌కే షాకిచ్చాడు. ఆ సంగతులేంటో మీరే చూడండి!

ఫినాలేకు చేరిన నాన్ స్టాప్ సీజన్

ఫినాలేకు చేరిన నాన్ స్టాప్ సీజన్

అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా అంగరంగ వైభవంగా మొదలైన బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌ ఆరంభం నుంచి అదిరిపోయే స్పందనతో దూసుకుపోతోంది. ఇందులో గతంలో కంటే మంచి కంటెంట్ ఉండడంతో పాటు 24 గంటలు ప్రసారం అవడంతో అందరి దృష్టిలో పడింది. ఫలితంగా రెస్పాన్స్‌ను దక్కించుకుని ఇప్పుడు ఈ సీజన్ ఫినాలేకు కూడా చేరుకుంది.

ఫినాలేకు ఏకంగా ఏడుగురు రాక

ఫినాలేకు ఏకంగా ఏడుగురు రాక

గతంలో బిగ్ బాస్ సీజన్లలో ఫినాలే రౌండ్‌కు ఐదుగురు కంటెస్టెంట్లు మాత్రమే మిగిలేవారు. ఈ టాప్ 5లో నిలిచేందుకు కంటెస్టెంట్లు చాలా ఇబ్బందులను ఎదుర్కొనేవాళ్లు. అయితే, బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్‌లో మాత్రం ఏకంగా ఏడుగురిని ఫినాలేకు పంపించారు. అందులో బిందు మాధవి, మిత్రా శర్మ, అఖిల్ సార్థక్, బాబా భాస్కర్, అనిల్ రాథోడ్, ఆరియానా, శివలు ఉన్నారు.

మరింత రంజుగా.. జర్నీ వీడియో

మరింత రంజుగా.. జర్నీ వీడియో

అనుకున్న దాని కంటే ఎక్కువ మజాను అందిస్తూ బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ మొదటి నుంచే రంజుగా సాగుతోంది. ఇందులో సరికొత్త టాస్కులు, ఊహించని ఎలిమినేషన్స్, కంటెస్టెంట్ల మధ్య గొడవలు, బోల్డు సన్నివేశాలు ఎక్కువగా చూపించారు. దీంతో ఇది మరింత ఆదరణను అందుకుంది. ఇక, ఇప్పుడు ఇందులో కంటెస్టెంట్ల బిగ్ బాస్ జర్నీ వీడియోలను చూపిస్తున్నారు.

మొదటి రోజు వాళ్లిద్దరి జర్నీలతో

మొదటి రోజు వాళ్లిద్దరి జర్నీలతో

బిగ్ బాస్ షోలో ఫినాలేకు చేరుకున్న కంటెస్టెంట్లకు వాళ్ల జర్నీ వీడియోలు చూపిస్తుంటారన్న విషయం తెలిసిందే. ఈ ఎపిసోడ్‌లకు మరింత ఎక్కువ స్పందన దక్కుతూ ఉంటుంది. ఇందులో భాగంగానే మొదటి రోజు యాంకర్ శివ, ఆరియానా గ్లోరీల జర్నీలను బిగ్ బాస్ నిర్వహకులు చూపించారు. దీంతో వీళ్లిద్దరూ తెగ ఎమోషనల్ అవడంతో పాటు వెక్కి వెక్కి ఏడ్చేశారు కూడా.

బాబా భాస్కర్ జర్నీ వీడియో కేక

బాబా భాస్కర్ జర్నీ వీడియో కేక

తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన బాబా భాస్కర్ జర్నీ వీడియోను చూపించారు. దాదాపు దీన్ని ముప్పై నిమిషాల పాటు ప్రసారం చేశారు. వాస్తవానికి ఆయన వచ్చి మూడు వారాలే అవుతోన్నా.. మొదటి నుంచీ ఉన్నట్లుగా విజువల్స్‌ను పొందు పరిచారు. దీంతో ఆయన జర్నీ ఎంత సక్సెస్‌ఫుల్‌గా, ఫన్నీ సాగిందో ఈ వీడియోను చూస్తే అర్థం అవుతుంది.

బయటకు పంపించడం అంటూ

బయటకు పంపించడం అంటూ

తన జర్నీ వీడియో చూసిన తర్వాత బాబా భాస్కర్ ఎమోషనల్ అయ్యాడు. 'నాకు నిజంగా ఏడుపు వచ్చింది. ఇంత బాగా చూపిస్తారని అనుకోలేదు. ఈ వీడియో వేరే లెవెల్. ఇది మూడు వారాల ఫుటేజ్‌లా లేదు. 87 రోజులు ఇంట్లో ఉన్నట్లే ఉంది. నా లైఫ్‌లో ఈ వీడియో చాలు. ఈ టైటిల్ వద్దు.. డబ్బు వద్దు.. ఇప్పుడు గేట్ ఓపెన్ చేసినా వెళ్లిపోతా' అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X