Bigg Boss Non Stop: చివరి కెప్టెన్ ఆయనే.. ఓటమిని తట్టుకోలేక ఘోరంగా.. షోలో తొలిసారి ఇలా!
తెలుగు బుల్లితెరపై ఎన్నో రకాల షోలు వస్తున్నాయి. కానీ, అందులో రియాలిటీ ఆధారంగా నడచే షోలు మాత్రం చాలా తక్కువగానే ఉంటున్నాయి. అలాంటి వాటిలో బిగ్ బాస్ షో ఒకటి. ఇండియాలో ఎప్పుడో పరిచయం అయినా.. తెలుగులోకి మాత్రం చాలా ఆలస్యంగా వచ్చిందీ షో. అయినప్పటికీ ఊహించని రీతిలో ప్రేక్షకుల మద్దతును కూడగట్టుకుని సక్సెస్‌ఫుల్ షోగా మారింది.
ఇలా ఐదు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్ ఫస్ట్ సీజన్ కూడా భారీ స్పందనతో సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో ఇందులో చివరి కెప్టెన్సీ టాస్క్ జరిగింది. మరి దీనిలో ఎవరు గెలిచారు? దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం!

వాటిని మించేలా సాగుతోంది
బిగ్ బాస్ తెలుగులో ఎప్పుడు ప్రసారం అయినా స్పందనను అందుకుంటోంది. దీంతో ఓటీటీ వెర్షన్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌పై అంచనాలు భారీగా నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే ఇది ఆరంభం నుంచే రసవత్తరంగా సాగుతోంది. మరీ ముఖ్యంగా డబుల్ మీనింగ్ డైలాగులు, బూతులు, బోల్డు బ్యూటీల రచ్చ, గొడవలతో రచ్చగా నడుస్తూ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తోంది.

8 వారాలు.. వాళ్లంతా అవుట్
ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్ ఫస్ట్ సీజన్‌లోకి 17 మంది సెలెబ్రిటీలు కంటెస్టెంట్లుగా అడుగు పెట్టారు. ఇందులో కొత్త వాళ్లతో పాటు మాజీ కంటెస్టెంట్లు కూడా హౌస్‌లోకి అడుగు పెట్టారు. వీళ్లలో నుంచి 8 వారాలకు గానూ ముమైత్, శ్రీ రాపాక, ఆర్జే చైతూ, సరయు, తేజస్వీలు, ముమైత్ ఖాన్ (రెండోసారి), స్రవంతి చోకారపు, మహేశ్ విట్టా, అజయ్‌లు షో నుంచి ఎలిమినేట్ అయ్యారు.

చివరి దశకు చేరుకోవడంతో
ముందు అనుకున్నట్లుగానే బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ భారీ రెస్పాన్స్‌ను అందుకుంటోంది. దీంతో నిర్వహకులు గతంలో ఎన్నడూ చూడని కంటెంట్‌ను ప్రసారం చేస్తూ ప్రేక్షకులకు మజాను పంచుతున్నారు. ఇక, ఇప్పుడు ఇది చివరి దశకు చేరుకోవడంతో మరింత కొత్త కాన్సెప్టులను తీసుకు వస్తున్నారు. దీంతో ఇది మరింత రంజుగా మారుతూ రసవత్తరంగా సాగుతోంది.

అతడికి సీక్రెట్ టాస్క్ ఇచ్చి
నటరాజ్ మాస్టర్‌కు బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగానే ఆయన హౌస్‌లో ఉన్న కొందరిని టాస్కుల ద్వారా చంపాలని సూచించాడు. దీనికి నటరాజ్ మాస్టర్ కూడా వెంటనే ఓకే చెప్పేశాడు. ఏమాత్రం సందేశం రాకుండా జాగ్రత్త పడాలని చెప్పాడు. అలాగే ఓ మొబైల్ ఇచ్చి సంకేతాలు పంపేవాడు. ఇందులో నటరాజ్ మాస్టర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

కెప్టెన్సీ కంటెండర్ల ఎంపిక
ఈ వారానికి సంబంధించి జరిగిన కెప్టెన్సీ కంటెండర్ల టాస్కులో నటరాజ్ సీక్రెట్ టాస్కును పూర్తి చేసి పోటీదారుగా నిలిచాడు. అతడు మొత్తంగా యాంకర్ శివ, అనిల్ రాథోడ్, అఖిల్ సార్థక్, హమీదాలను కిల్ చేశాడు. అలాగే, అతడి చేతిలో చంపకుండా ఉండిపోయిన బిందు మాధవి, బాబా భాస్కర్, మిత్రా శర్మ, అషు రెడ్డిలు ఈ వారం కెప్టెన్సీ కంటెండర్లుగా ఎంపిక అయ్యారు.

బ్రిక్స్‌తో ఉత్కంఠభరితంగా
బిగ్ బాస్ నాన్ స్టాప్‌లో చివరి కెప్టెన్సీ టాస్క్ అని చెబుతూ.. ఈ వారానికి బ్రిక్స్ ఛాలెంజ్ ఇచ్చారు. ఇందులో ఒక్కో కంటెస్టెంట్ ఒక్క ఇటుకను తీసి.. పైన పేర్చాల్సి ఉంటుంది. ఇలా చివరి వరకూ ఎవరు మిగులుతారో వాళ్లే ఈ హౌస్‌కు చివరి కెప్టెన్ అవుతారని బిగ్ బాస్ చెప్పాడు. షోలో తొలిసారి ఉత్కంఠను రేపిన ఈ టాస్కులో బిందు మాధవి, అషు రెడ్డి త్వరగానే ఓడిపోయారు.

బాబా కెప్టెన్.. ఓటమి బాధతో
ఆరంభం నుంచే నరాలు తెగేంత ఉత్కంఠతో సాగిన ఈ టాస్కులో నటరాజ్ పలుమార్లు పొరపాటు చేసినా.. సంచాలకురాలు ఆరియానా మరో ఛాన్స్ ఇచ్చింది. ఇక, చివరకు ఇందులో బాబా భాస్కర్ విజయం సాధించి కెప్టెన్ అయ్యాడు. అలాగే, మిత్రా శర్మ సెకెండ్ పొజిషన్‌లో నిలిచింది. ఇందులో ఓడిపోయినందుకు నటరాజ్ తట్టుకోలేకపోయాడు. వెక్కివెక్కి ఏడ్చేశాడు.


Click it and Unblock the Notifications











