Bigg Boss Non Stop: ఫైనలిస్టులకు ఊహించని ఆఫర్.. సూట్‌కేస్‌లో డబ్బులకు బదులు స్పెషల్ పాస్
తెలుగు బుల్లితెరపై సంచలనాలకు చిరునామాగా మారి.. దేశంలోనే ఏ షోకూ రాని విధంగా టీఆర్పీ రేటింగ్‌ను సొంతం చేసుకుంటోంది బిగ్ బాస్. దీంతో నిర్వహకులు రెట్టించిన ఉత్సాహంతో సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌ను కూడా తీసుకు వచ్చారు. ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగుతూ వచ్చిన ఈ సీజన్.. రెండు రోజుల్లోనే ముగియనుంది. దీంతో ఫినాలే కోసం అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం ప్రసారం అయ్యే ఫినాలేలో ఫైనలిస్టులకు బిగ్ బాస్ అదిరిపోయే ఆఫర్ ఇచ్చారని తాజాగా ఓ న్యూస్ లీకైంది. ఆ సంగతులేంటో మీరే చూడండి!

బిగ్ బాస్ నాన్ స్టాప్ ఫినాలేకు
ముందు నుంచీ అనుకున్నట్లుగానే అంగరంగ వైభవంగా మొదలైన బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ అదిరిపోయే స్పందనతో దూసుకుపోతోంది. ఇందులో గతంలో కంటే మంచి కంటెంట్ ఉండడంతో పాటు 24 గంటలు ప్రసారం అవడంతో అందరి దృష్టిలో పడింది. ఫలితంగా రెస్పాన్స్‌ను దక్కించుకుని ఇప్పుడు ఈ సీజన్ ఫినాలేకు కూడా చేరుకున్న సంగతి తెలిసిందే.

ఫినాలేలోకి ఏడుగురు ఎంటర్
సాధారణంగా బిగ్ బాస్ సీజన్లలో ఫినాలే రౌండ్‌కు ఐదుగురు కంటెస్టెంట్లు మాత్రమే మిగిలేవారు. ఈ టాప్ 5లో నిలిచేందుకు కంటెస్టెంట్లు చాలా ఇబ్బందులను ఎదుర్కొనేవాళ్లు. అయితే, బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్‌లో మాత్రం ఏకంగా ఏడుగురిని ఫినాలేకు పంపించారు. అందులో బిందు మాధవి, మిత్రా శర్మ, అఖిల్ సార్థక్, బాబా భాస్కర్, అనిల్ రాథోడ్, ఆరియానా, శివలు నిలిచారు.

జర్నీ వీడియోలతో మరంతగా
బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ మొదటి నుంచే రంజుగా సాగుతోంది. ఇందులో సరికొత్త టాస్కులు, ఊహించని ఎలిమినేషన్స్, కంటెస్టెంట్ల మధ్య గొడవలు, బోల్డు సన్నివేశాలు ఎక్కువగా చూపించారు. దీంతో ఇది మరింత ఆదరణను అందుకుంది. ఇక, ఇప్పుడు ఇందులో కంటెస్టెంట్ల బిగ్ బాస్ జర్నీ వీడియోలను చూపిస్తున్నారు. ఇది ఈరోజు కూడా కంటిన్యూ కాబోతుంది.

పూర్తైన షూట్... ముగ్గురు ఔట్
గ్రాండ్ ఫినాలేకు సంబంధించిన షూటింగ్ గురువారమే ప్రారంభం అయినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఆరోజు జరిగిన దాంట్లో భాగంగా ముగ్గురు కంటెస్టెంట్లను షో నుంచి ఎలిమినేట్ చేశారని అంటున్నారు. అందులో ఏడో స్థానంలో నిలిచిన అనిల్ రాథోడ్, ఆరో స్థానంలో ఉన్న బాబా భాస్కర్, ఐదో స్థానంలో నిలిచిన ఆరియానాలు ఫినాలే నుంచి తప్పుకున్నారట.

నలుగురిలో విజేత ఆమెనేనా
తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం.. ప్రస్తుతం జరుగుతోన్న షూటింగ్‌లో గ్రాండ్ ఫినాలేకు సంబంధించిన ఇద్దరు కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేయడంతో పాటు ఆటపాటలకు సంబంధించిన భాగాన్ని షూట్ చేయబోతున్నారట. ఇక, ఈ సీజన్‌లో బిందు మాధవి విజేతగా నిలవబోతున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే తెలుగు బిగ్ బాస్‌లో కొత్త చరిత్ర నమోదు అవుతుంది.

ఫైనలిస్టులకు స్పెషల్ ఆఫర్
సాధారణంగా బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌లో కంటెస్టెంట్లకు డబ్బులు ఆఫర్ చేస్తుంటారు. అది నచ్చిన వాళ్లు తీసుకుని పక్కకు వెళ్లిపోవచ్చు. ఇలా గతంలో నాలుగో సీజన్ సయ్యద్ సోహైల్ రియాన్ తీసుకున్నాడు. అయితే, బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ ఫినాలేలో టాప్ 4 కంటెస్టెంట్లకు నిర్వహకులు ప్రత్యేకమైన ఆఫర్ ఇవ్వబోతున్నట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది.

డబ్బుకు బదులు ఎంట్రీ పాస్
బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో ఫినాలేకు చేరిన వారిలో టాప్ -3గా నిలిచిన కంటెస్టెంట్లకు బిగ్ బాస్ డబ్బులు ఆఫర్ చేయడం లేదని తెలిసింది. దీనికి బదులుగా త్వరలోనే ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ ఆరో సీజన్‌లోకి ఎంట్రీ పాస్ ఇవ్వబోతున్నారట. అది నచ్చిన వాళ్లు టైటిల్ రేసు నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. మరి దీనికి ఎవరైనా ఒప్పుకుంటారో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











