Bigg Boss Non Stop: అతడితో బిగ్ బాస్ డీల్.. సీక్రెట్‌గా ఫోన్ సౌకర్యం.. చెప్పినట్లు చేస్తే భారీ ఆఫర్
సరికొత్త టాస్కులు.. కంటెస్టెంట్ల మధ్య రకరకాల ఎమోషన్స్.. అన్నింటికీ మించి ఊహకే అందని మలుపులతో సాగుతూ ప్రేక్షకులకు మజాను అందిస్తోన్న కార్యక్రమమే బిగ్ బాస్. తెలుగులో ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చిన ఈ షో.. సూపర్ డూపర్ సక్సెస్ అయింది. ఫలితంగా ఐదు సీజన్లు కూడా భారీ రేటింగ్‌తో పూర్తయ్యాయి.
ఈ క్రమంలోనే ఇప్పుడు నడుస్తోన్న ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ కూడా భారీ రెస్పాన్స్‌ను అందుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో బిగ్ బాస్ ఓ కంటెస్టెంట్‌కు అదిరిపోయే డీల్ ఇచ్చాడు. అంతేకాదు, మొబైల్ ఫోన్‌ను సైతం అందించాడు. అసలేం జరిగింది? ఇంతకీ ఆ డీల్ ఏంటి? అనే విషయాలు చూద్దాం పదండి!

రెట్టించిన వినోదంతో సక్సెస్‌గా
తెలుగులో బిగ్ బాస్ ఎప్పుడు ప్రసారం అయినా సక్సెస్ అవుతోంది. దీంతో ఓటీటీ వెర్షన్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఇది ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగుతోంది. మరీ ముఖ్యంగా డబుల్ మీనింగ్ డైలాగులు, బూతులు, బోల్డు బ్యూటీల రచ్చ, గొడవలతో రచ్చగా నడుస్తోంది. ఫలితంగా రెట్టించిన వినోదం అందుతోంది.

8 వారాల్లో... వాళ్లంతా బయటకు
బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లోకి మొత్తం 17 మంది సెలెబ్రిటీలు కంటెస్టెంట్లుగా అడుగు పెట్టారు. ఇందులో కొత్త వాళ్లతో పాటు మాజీ కంటెస్టెంట్లు కూడా హౌస్‌లోకి అడుగు పెట్టారు. వీళ్లలో నుంచి 8 వారాలకు గానూ ముమైత్, శ్రీ రాపాక, ఆర్జే చైతూ, సరయు, తేజస్వీలు, ముమైత్ ఖాన్ (రెండోసారి), స్రవంతి చోకారపు, మహేశ్ విట్టా, అజయ్‌లు షో నుంచి బయటకు వెళ్లిపోయారు.

చివరి దశకు.. మరింత కొత్తగానే
బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ అనుకున్నట్లుగానే ప్రేక్షకుల ఆదరణను అందుకుంటోంది. దీంతో నిర్వహకులు గతంలో ఎన్నడూ చూడని కంటెంట్‌ను ప్రసారం చేస్తూ ప్రేక్షకులకు మజాను పంచుతున్నారు. ఇక, ఇప్పుడు ఇది చివరి దశకు చేరుకోవడంతో మరింత కొత్త కాన్సెప్టులను తీసుకు వస్తున్నారు. దీంతో ఇది ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ మజాను ఇస్తోంది.

కంటెస్టెంట్లను లోపలికి రమ్మని
తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో బిగ్ బాస్.. ఇంట్లోని కంటెస్టెంట్లు అందరినీ కన్‌ఫెషన్ రూమ్‌లోకి రమ్మని పిలిచాడు. ఒకరికి సీక్రెట్ టాస్క్ ఇచ్చేందుకు అందరినీ లోపలికి ఆహ్వానించాడు. అలా అయితే టాస్క్ ఇచ్చింది ఎవరికో తెలియకుండా ఉంటుందని ప్లాన్ చేశాడు. అందుకు అనుగుణంగానే అందరూ లోపలికి వెళ్లారు. కొందరిని సరదాగా కాసేపు ఉంచి బయటకు పంపించాడు.

వాళ్లతో ఆట ఆడకున్న బిగ్ బాస్
కన్‌ఫెషన్ రూమ్‌లోకి పిలిచిన కంటెస్టెంట్లతో బిగ్ బాస్ సరదాగ మాట్లాడాడు. 'మీరే కిల్లర్.. కాదు' అంటూ పంచ్ డైలాగులతో నవ్వించాడు. ఇక, యాంకర్ శివకు మాథ్స్‌కు సంబంధించిన ఒక సూత్రాన్ని ఇచ్చి ఆన్సర్ చెప్పాలని అన్నాడు. కానీ, అతడు తప్పు చెప్పాడు. ఇక, అషు రెడ్డితో ఒక సామెత చెప్పమన్నాడు. ఆ తర్వాత 'మీ నోటికి తాళం వేయండి' అంటూ షాకిచ్చాడు.

నటరాజ్ మాస్టర్‌కు సీక్రెట్ టాస్క్
కంటెస్టెంట్లను ఒక్కొక్కరిగా పిలుస్తూ చివరకు నటరాజ్ మాస్టర్‌కు బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగానే ఆయన హౌస్‌లో ఉన్న కొందరిని టాస్కుల ద్వారా చంపాలని సూచించాడు. దీనికి నటరాజ్ మాస్టర్ కూడా వెంటనే ఓకే చెప్పేశాడు. ఏమాత్రం సందేశం రాకుండా జాగ్రత్త పడాలని చెప్పాడు. ఇదే సక్సెస్‌ఫుల్‌గా చేస్తే మంచి బహుమతి లభిస్తుందన్నాడు.

మొబైల్ సౌకర్యం కూడా ఇచ్చేసి
సీక్రెట్ టాస్క్ చేస్తోన్న నటరాజ్ మాస్టర్ ఎప్పుడు ఎలాంటి పని చేయాలి అని చెప్పడం కోసం ఆయనకు ఒక మొబైల్ ఫోన్‌ను అందించాడు బిగ్ బాస్. ఇది రింగ్ అయినప్పుడు అతడు మాట్లాడి ఏం చేయాలో తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక, ఇప్పటికే నటరాజ్ మాస్టర్ పలు టాస్కులను పూర్తి చేసుకుని కొందరినీ చంపేశాడు. ఇందుకోసం అతడు ఆడిన ఆట అదిరిందనే చెప్పాలి.


Click it and Unblock the Notifications











