Bigg Boss Non Stop: అషు రెడ్డికి షాకిచ్చిన బిగ్ బాస్.. రోజంతా అది లేకుండానే.. షో చరిత్రలో తొలిసారి
బుల్లితెరపై ఎన్నో రకాల షోలు వస్తుంటాయి. అయితే, అందులో కొన్ని మాత్రమే ఊహలకే అందని విధంగా సక్సెస్ అవుతుంటాయి. అలాంటి వాటిలో రియాలిటీ ఆధారంగా నడిచే బిగ్ బాస్ ఒకటి. ఇది దేశంలోని చాలా భాషల్లో ప్రసారం అవుతోన్నా.. తెలుగులో మాత్రమే టాప్ రేటింగ్‌ను అందుకుని నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది. ఇలా ఇప్పటికే ఐదు సీజన్లు కూడా పూర్తయ్యాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రసారం అవుతోన్న నాన్ స్టాప్ మొదటి సీజన్ కూడా మరింత ఆసక్తికరంగా సాగుతోంది. ఇక, ఇందులో అషు రెడ్డి తన బోల్డ్ బిహేవియర్‌తో హాట్ టాపిక్ అవుతూనే ఉంటోంది. ఈ నేపథ్యంలో ఆమెకు బిగ్ బాస్ ఊహించని శిక్షను విధించాడు. అసలేం జరిగింది? ఆ వివరాలు చూద్దాం పదండి!

అలాంటి కంటెంట్‌కు స్పందన
బిగ్ బాస్ షో తెలుగులో ఎప్పుడూ ప్రసారం అయినా భారీ స్పందనను అందుకుంటూనే ఉంది. అయితే, ఇప్పటి వరకూ టీవీలో వచ్చిన ఈ షోను ప్రేక్షకులు ఆదరించారు. అలాగే, ఇప్పుడు ప్రసారం అవుతోన్న ఓటీటీ వెర్షన్‌కు కూడా అదే రీతిలో రెస్పాన్స్ దక్కుతోంది. దీనికి కారణం ఇందులో కనిపించే బోల్డు కంటెంటే అని చెప్పొచ్చు. అందుకే ఇది కూడా సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది.

బోల్డు బ్యూటీ మరింత హైలైట్
బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో ఎక్కువగా అమ్మాయిలే కంటెస్టెంట్లుగా వచ్చారు. అందులోనూ బోల్డ్ బ్యూటీలు చాలా మందే ఉన్నారు. ఇలా వచ్చిన వారిలో తెలుగు భామ అషు రెడ్డి ఒకరు. గతంలో మూడో సీజన్‌లో రచ్చ చేసిన ఈ బ్యూటీ.. మధ్యలోనే వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో ఛాన్స్ వచ్చింది. ఇందులో మాత్రం ఆమె మరింత హైలైట్ అవుతూనే ఉంటోంది.

అతడితో క్లోజ్... బోల్డుగా రచ్చ
సాధారణంగా అషు రెడ్డి ఎంత బోల్డుగా ఉంటుందో అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ హౌస్‌లోనూ ఈ అమ్మడు అదే ఫాలో అవుతోంది. గతంలో కంటే ఈ సారి ఆమె మరింత రెచ్చిపోతోంది. తరచూ బూతులు మాట్లాడడం.. బోల్డుగా కనిపించడం.. హాట్ డ్రెస్‌లతో రచ్చ రచ్చ చేస్తోంది. అలాగే, అఖిల్ సార్థక్‌తో చనువుగా ఉంటూ ట్రాక్ నడుపుతున్నట్లు ఈ అమ్మడు హాట్ టాపిక్ అవుతోంది.

హ్యూమన్స్ వర్సెస్ ఏలియన్స్
ప్రస్తుత వారానికి సంబంధించిన కెప్టెన్సీ పోటీదారులను ఎంపిక చేసుకునేందుకు 'హ్యూమన్స్ వర్సెస్ ఏలియన్స్' టాస్కును ఇచ్చారు. ఇందులో గెలిచిన జట్టు సభ్యులే ఈ వారం కెప్టెన్సీకి పోటీ చేసే అర్హతను పొందుతారని బిగ్ బాస్ చెప్పాడు. ఇందులో హ్యూమన్స్‌గా అఖిల్, శివ, అషు, అనిల్, మిత్రాలు ఉన్నారు. మిగిలిన వాళ్లు ఏలియన్స్‌గా, బాబా భాస్కర్ సంచాలకుడిగా చేశారు.

రంగు వాళ్లకు... పాట్స్ వీళ్లకు
ఈ వారం జరిగిన హ్యూమన్స్ వర్సెస్ ఏలియన్స్ టాస్కులో భాగంగా ఏలియన్స్‌గా ఉన్న వాళ్లు మనుషుల అరచేతులకు రంగులు పూయాలి. అలాగే, మనుషులుగా ఉన్న వాళ్లు ఏలియన్స్ దగ్గరున్న పాట్స్‌ను దక్కించుకుని పగలగొట్టాలి. దీనిబట్టి బ్యాటరీకి పవర్స్ వస్తాయి. ఇందులో హ్యూమన్సే విజయం సాధించారు. అయితే, ఇందులో ఎన్నో కొట్లాటలు, గొడవలు కూడా జరిగాయి.

అషు రెడ్డికి బిగ్ బాస్ భారీ షాక్
హ్యూమన్స్ టీమ్‌లో ఉన్న అషు రెడ్డిని మొదటి రోజే ఏలియన్స్ టీమ్ సభ్యులు ఔట్ చేశారు. అయినప్పటికీ ఆమె తన జట్టుకు సహకరిస్తూ కనిపించింది. ఇందులో భాగంగానే స్విమ్మింగ్ పూల్‌లో తన టీమ్ సభ్యురాలు మిత్రాకు ఏలియన్స్ రంగులు పూస్తుండగా.. అషు దానిపై నీళ్లు చల్లింది. దీంతో చాలా మంది మైక్‌లు తడిచిపోయాయి. దీంతో బిగ్ బాస్ ఆమెకు భారీ షాక్ ఇచ్చాడు.

షో చరిత్రలోనే తొలిసారి శిక్ష
ఈ టాస్కులో సంచాలకుడిగా ఉన్న బాబా భాస్కర్‌తో పాటు ఆరియానాను కన్‌ఫెషన్ రూమ్‌కు పిలిచిన బిగ్ బాస్.. అషు రెడ్డి మైక్‌ను ఈరోజంతా తీసుకోవాలని సూచించాడు. దీంతో ఆమె రోజంతా మైక్ లేకుండానే కనిపించింది. ఇక, మైక్ లేకపోతే హౌస్‌లో మాట్లాడకూడదు కాబట్టి.. చాలా సేపు సైలెంట్‌గానే ఉండిపోయింది. ఆ తర్వాత బిగ్ బాస్ ఆమెను హెచ్చరించాడు. ఇలా గతంలో ఎప్పుడూ జరగకపోవడం గమనార్హం.


Click it and Unblock the Notifications











