Bigg Boss Non Stop: బిగ్ బాస్‌లో షాకింగ్ సీన్.. ఒక్కటైన బిందు, అఖిల్.. వీళ్ల ప్లాన్‌తో ఆమెకు కష్టం

ఊహించని సంఘటనలు.. గతంలో ఎప్పుడూ చూడని టాస్కులు.. కంటెస్టెంట్ల మధ్య చిత్ర విచిత్రమైన ఎమోషన్స్ ఇలా ఎన్నో రకాల పరిణామాలతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగే షోనే బిగ్ బాస్. గతంలో ఎప్పుడూ చూడని కాన్సెప్టుతో నడుస్తున్నా తెలుగు ప్రేక్షకులు దీనికి భారీ స్పందనను అందిస్తున్నారు. ఫలితంగా ఈ షో ఐదు సీజన్లను రికార్డు స్థాయి రేటింగ్‌తో పూర్తి చేసుకుంది.

ఈ క్రమంలోనే ఇప్పుడు నిర్వహకులు ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్‌ మొదటి సీజన్‌ను మరింత ఆసక్తికరంగా నడుపుతున్నారు. ఇక, ఇందులో ఎప్పుడూ తిట్టుకుంటూ కనిపిస్తున్న అఖిల్ సార్థక్, బిందు మాధవి కలిసినట్లు తాజాగా తెలిసింది. వీళ్లిద్దరూ కలిసి మిగిలిన వాళ్లకు చుక్కలు చూపించారు. అసలేం జరిగిందో చూడండి!

మరింత ఆసక్తికరంగా బిగ్ బాస్

మరింత ఆసక్తికరంగా బిగ్ బాస్

ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలను ఏర్పరచుకున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్.. గతంలో కంటే ఆసక్తికరంగా సాగుతోంది. ఇందులో సెన్సార్ కూడా ఉండకపోవడంతో బూతులు కూడా చూపిస్తున్నారు. దీంతో ఇది ఆద్యంతం బోల్డుగా సాగుతోంది. ఫలితంగా ఈ సీజన్‌కు మరింత స్పందన లభిస్తోంది. తద్వారా ఇది కూడా సూపర్ సక్సెస్ అయిపోయింది.

 వాళ్లిద్దరు టైటిల్ ఫేవరెట్లుగానే

వాళ్లిద్దరు టైటిల్ ఫేవరెట్లుగానే

బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ అనుకున్నట్లుగానే సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. ఇందులోకి మొత్తం 17 మంది కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. ఇందులో కొత్త వాళ్లతో పాటు మాజీ కంటెస్టెంట్లు కూడా ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే ఇందులో ఇద్దరు టైటిల్ ఫేవరెట్లుగా బరిలోకి దిగారు. అందులో ఒకరు ప్రముఖ హీరోయిన బిందు మాధవి కాగా.. మరొకరు మాజీ రన్నరప్ అఖిల్ సార్థక్.

 ఆటకు ఆట.. మైండ్‌గేమ్‌తోనూ

ఆటకు ఆట.. మైండ్‌గేమ్‌తోనూ

నాన్ స్టాప్ సీజన్‌లో టైటిల్ ఫేవరెట్లుగా పేరొందిన బిందు మాధవి, అఖిల్ సార్థక్ ఇద్దరూ ఇద్దరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఆట పరంగా ఇద్దరూ పోటీ ఇచ్చుకుంటూ ముందుకెళ్తున్నారు. అలాగే, మైండ్ గేమ్ పరంగానూ ఎవరికి వారే అనిపించుకుంటున్నారు. అయితే, ఆరంభం నుంచే వీళ్ల మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. దీంతో రెండు గ్రూపులుగా విడిపోయి గేమ్ ఆడుతున్నారు.

ఇద్దరి మధ్యా అలాంటి గొడవ

ఇద్దరి మధ్యా అలాంటి గొడవ

ఆ మధ్య కెప్టెన్సీ టాస్కులో యాంకర్ శివను సపోర్ట్ చేయడానికి బిందు మాధవి.. అతడిని ఓడించడానికి అఖిల్ సార్థక్ ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య బిగ్ ఫైట్ జరిగింది. అప్పుడు బిందు.. ఫ్రెండ్ లేకుంటే బతకలేవు.. నువ్వు ఏ గేమ్ ఆడా అంటూ మాటలు అనడంతో అఖిల్ బాగా ఏడ్చేశాడు. ఆ తర్వాత కూడా వీళ్లిద్దరి మధ్య చాలా గొడవలు జరిగిన విషయం తెలిసిందే.

నామినేషన్స్‌లోనూ ఫైటింగ్‌లే

నామినేషన్స్‌లోనూ ఫైటింగ్‌లే

ఏడో వారానికి సంబంధించిన నామినేషన్స్ టాస్కును జంటలుగా మార్చి ఇచ్చారు. ఇద్దరిలో ఒకరు నామినేట్ అవడానికి ఒప్పుకునేలా మాట్లాడుకోవాలని చెప్పాడు. ఇందులో బిందు మాధవి, అఖిల్ సార్థక్‌ను ఒక జంటగా పంపాడు. కానీ, వీళ్లిద్దరూ ఆరంభం నుంచే గొడవ పడుతూ రచ్చ చేశారు. దీంతో చివరికీ నామినేట్ అవడానికి ఎవరూ ఒప్పుకోకపోవడంతో ఇద్దరినీ బుక్ చేసేశారు.

షోలో ఒక్కటైన బిందు.. అఖిల్

ఈ వారానికి సంబంధించిన జరగబోయే కెప్టెన్సీ టాస్కులో ఇంటిని ఐదు భాగాలుగా మార్చి.. పది మందిని ఐదు జంటలుగా విభజించాడు. ఈ టీమ్‌లు తమ ఆధీనంలో ఉన్న భాగాన్ని కాపాడుకోవాలి. అందులో బిందు మాధవి, అఖిల్ సార్థక్‌ను ఒక టీమ్‌గా మార్చాడు. ఇప్పటి వరకూ కొట్టకుంటూ తిట్టుకుంటూ కనిపించిన వీళ్లిద్దరూ ఇప్పుడు ఈ సారి జంటగా ఆట ఆడారు.

ప్లాన్‌తో ఆరియానాకు చుక్కలు

ప్లాన్‌తో ఆరియానాకు చుక్కలు

అందరూ శారీరకంగా కష్టపడుతుంటే.. బిందు మాధవి, అఖిల్ సార్థక్ మాత్రం తమ బుర్రకు పని చెప్పారు. మరీ ముఖ్యంగా బిందు.. ఆరియానా గ్లోరీ దగ్గర దాచుకున్న పాస్‌లను దొంగిలించుకుని వచ్చి అఖిల్‌కు అదించింది. దీంతో ఆరంభంలోనే వీళ్లు ఆధిపత్యం చూపించగా.. ఆరియానా మాత్రం కీలకమైన పాస్‌లను కోల్పోయింది. ఇలా మొదట్లోనే వీళ్లిద్దరూ చుక్కలు చూపిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X