Bigg Boss Non Stop: అఖిల్ కంటే బిందు ఎక్కువ.. ఈ ఒక్క రికార్డు చాలు!
బిగ్ బాస్ నాన్ స్టాప్ షో మొత్తానికి తుది దశకు చేరుకుంది. ఇక ఇప్పుడు టాప్ కంటెస్టెంట్ ఎవరు అనేది హాట్ టాపిక్ గా మారింది. అసలు ఈ సీజన్ విజేతగా ఎవరు నిలుస్తారు అనే ఈ విషయంలో కాస్త కన్ఫ్యూజన్ అయితే నెలకొంది. కానీ ఎక్కువగా క్రేజ్ అందుకున్నది ఎవరు అనేది మాత్రం అందరికీ తెలిసిపోయింది. ఇక బిందుమాధవి అఖిల్ పేర్లు సోషల్ మీడియాలో ఏ స్థాయిలో వైరల్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక అఖిల్ కంటే బిందుమాధవి అన్ని విషయాల్లోనూ ఎక్కువ అని ఆమె అభిమానులు సోషల్ మీడియాలో క్లారిటీ ఇస్తున్నారు. కానీ ఇటీవల ఒక ముఖ్యమైన ఆధారం చూపిస్తూ ఆమె బ్రాండ్ ను మరింత పెంచుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

తీవ్రస్థాయిలో అసంతృప్తి..
బిగ్ బాస్ నాన్ స్టాప్ షో మొదలైన కొత్తలో అయితే ప్రేక్షకులు కొంతవరకూ తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు అని చెప్పాలి. ముఖ్యంగా పాతవారిని మళ్లీ బిగ్ బాస్ లోకి తీసుకు రావడం ఓ వర్గం వారికి ఏమాత్రం నచ్చలేదు. అయినప్పటికీ కూడా బిగ్ బాస్ మాత్రం సరికొత్త టాస్క్ లతో షోపై మంచి బజ్ అయితే క్రియేట్ చేశారు. సరికొత్తగా మొదలైన ఈ షో బిగ్ బాస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

అఖిల్ vs బిందుమాధవి
ఇక ప్రస్తుతం బిగ్ బాస్ కు సంబంధించిన మరొక ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లలో టాప్ విన్నర్ గా నిలిచేది ఎవరు? అసలు ఎవరికి ఓట్లు ఎక్కువగా వచ్చాయి? అనేది చర్చనీయాంశంగా మారింది. ఒక వైపు అఖిల్ మరొక వైపు బిందుమాధవి కూడా తీవ్రస్థాయిలో వారి అభిమాన కంటెస్టెంట్ పేర్లను వైరల్ అయ్యేలా చేస్తున్నారు.

బిందుమాధవి టాప్..
ఓట్ల పరంగా చూసుకుంటే అయితే అఖిల్ బిందుమాధవి ఇద్దరు కూడా పోటా పోటీగా ఉన్నట్లుగా బిగ్ బాస్ తరచూ వారిని హైలెట్ చేయడం జరుగుతోంది. అయితే ఒక విధంగా బిందుమాధవి కి ఎక్కువగా ఓట్లు వచ్చాయని వారి అభిమానులు ప్రచారాలు చేస్తున్నారు. అంతే కాకుండా సోషల్ మీడియాలో అందరి కంటే ఎక్కువగా బిందుమాధవి పేరు ట్రెండింగ్ లిస్ట్ లో చేరిపోయింది.

అఖిల్ కంటే ఎక్కువ
ఇక ఓట్లు ఎన్ని వచ్చాయి అనే విషయాన్ని పక్కన పెడితే మాత్రం సోషల్ మీడియాలో అఖిల్ కంటే బిందుమాధవి ఎక్కువగా క్రేజ్ అందుకుంటోంది అనే చెప్పాలి. ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్ ఎకౌంట్లో గమనిస్తే ఆమెకు గత రెండు మూడు నెలల్లో పెరిగిన ఫాలోవర్స్ సంఖ్య చాలా ఎక్కువ. అసలు సోషల్ మీడియాలో అఖిల్ కు పెరిగిన అభిమానం అయితే చాలా తక్కువ. బిందుమాధవి మాత్రం అతని కంటే పది రెట్లు ఎక్కువగా అభిమానులను సొంతం చేసుకుంది.

భారీగా ఫాలోవర్స్
ప్రస్తుతం బిందుమాధవి ఇన్స్టాగ్రామ్ లో 1 మిలియన్ ఫాలోవర్స్ ను అందుకునే దిశగా అడుగులు వేస్తోంది. గత నెలలోనే ఆమెకు ఒక్కసారిగా లక్ష మంది అభిమానులు పెరగడం విశేషం. బిగ్ బాస్ లోకి రాకముందు కు కేవలం 4 లక్షల ఫాలోవర్స్ ని సంపాదించుకున్న బిందుమాధవి ఇప్పుడు మాత్రం అంతకంటే ఎక్కువగా కేవలం 90 రోజుల్లోనే 8 లక్షల మంది ఫాలోవర్స్ ను సంపాదించుకోవటం విశేషం.


Click it and Unblock the Notifications











