Don't Miss!
- News దేశంలో ఫస్ట్ టైమ్, పోలీసులకు ఏసీ హెల్మెట్లు, ప్రభుత్వం అంటే ఇలా ఉండాలి, పండగే పండగ !
- Sports LSG vs CSK: రూ. కోట్లు పలికిన ఆ ఇద్దరిని తప్పించాం- రుతురాజ్
- Lifestyle ఇవి తింటే మీ జుట్టు చాలా బలంగా మారుతుంది.. బట్టతల కూడా రాదు..
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
Bigg Boss Non Stop: ఆ పొజిషన్ కోసం సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టిన కంటెస్టెంట్.. షాకింగ్?
బిగ్ బాస్ నాన్ స్టాప్ మొత్తానికి తుది దశకు చేరుకుంది ఇక ఈ సీజన్ లో ఎవరు గెలుస్తారు అనే విషయంలో అయితే ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది. అలాగే టాప్ 5 కంటెస్టెంట్స్ విషయంలో కూడా కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఒక కంటెస్టెంట్ మాత్రం టాప్ ఫైవ్ లో ఒక పొజిషన్ కోసం తన సొంత డబ్బులను భారీగా ఖర్చు పెట్టినట్లు గా తెలుస్తోంది. అంటే బిగ్ బాస్ కు లంచం ఇచ్చారా అనేది కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..
రికమండేషన్స్?
బిగ్ బాస్ అనేది సెలబ్రెటీ హోదా పెంచుకునేందుకు ఒక మంచి ఫ్లాట్ ఫార్మ్ అని చెప్పవచ్చు. అలాగే ఇతర రంగాలలో ఉండే వారికి కూడా చాలా బలంగా నిలదొక్కుకునేందుకు ఉపయోగపడుతుంది అని అందరూ అనుకుంటూ ఉంటారు. అందుకే బిగ్ బాస్ లో పాల్గొనాలి అని ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తున్నారు.
ఇందులో రాజకీయాలు కూడా ఉంటాయి అని ఇదివరకే చాలా సార్లు రుజువైంది. నిజానికి బిగ్ బాస్ హౌస్ లో ఒక నలుగురైదుగురు తప్పితే మిగతా కంటెస్టెంట్స్ అందరూ కూడా ఏదో ఒక విధంగా రికమండేషన్స్ తో వచ్చిన వారే అని చెప్పవచ్చు.
లంచం ఇచ్చి మరీ?
గతంలో చాలామంది కంటెస్టెంట్స్ కూడా బిగ్ బాస్ లో పాల్గొనాలి అని డైరెక్టుగా నిర్వాహకులను సంప్రదించినట్లు గా కూడా ఓపెన్ గానే తెలియజేశారు. ఈసారి కూడా డా అదే తరహాలో కొన్ని రికమండేషన్స్ కూడా నడిచినట్టుగా టాక్ అయితే వచ్చింది. ఇక అందుకోసం కొంతమంది కంటెస్టెంట్స్ అయితే బిగ్ బాస్ నిర్వాహకులకు లంచం ఇచ్చి మరి హౌస్ లోకి అడుగు పెట్టినట్లు సోషల్ మీడియాలో టాక్ అయితే వస్తుంది.
టాప్ 2లో..
ప్రస్తుతం బిగ్ బాస్ ఫైనల్ విన్నర్ బిందు మాధవి అని ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఎందుకంటే ఓట్ల విషయంలో అయితే ఆమెను మించిన వారు లేరు. ఇక ఆ తర్వాత అఖిల్ రెండో పొజిషన్లో ఫిక్స్ అనే ఒక క్లారిటీ వచ్చేసింది. వీరిద్దరిలో ఎవరో ఒకరు గెలుస్తారు అని ముందు నుంచి కూడా ఆడియన్స్ మాట్లాడుకుంటున్నారు. ఇక అందులో మాత్రం ఎలాంటి అనుమానాలు లేవని తెలుస్తోంది.
మూడో స్థానం..?
ఇక టాప్ 2 పోసిషన్ తర్వాత మిగతా పొజిషన్స్ లో ఎవరెవరు ఉంటారు అనే విషయం లోనే కొంత కన్ఫ్యూజన్ కొనసాగింది. నిన్నటి వరకు అయితే మూడో పొజిషన్లో మిత్రశర్మ కొనసాగిన విషయం తెలిసిందే. అసలు ఆమె ఇప్పటివరకు హౌస్ లో ఎలా కొనసాగింది అనేది మరొక పెద్ద మిస్టరీ అనే చెప్పాలి. ఆమె కంటే బలంగా కూడా చాలా తొందరగానే హౌస్ లో నుంచి వెళ్లిపోయారు.
చివరలో..?
ఇక మూడో స్థానంలో అయితే యాంకర్ శివ ఉంటాడు అని మొదటి నుంచి ఒక క్లారిటీ అయితే ఉంది. ఇక ఆ తర్వాత అరియానా మిత్రశర్మ పేర్లు చాలా వైరల్ అయ్యాయి. అనిల్ రాథోడ్ బాబా భాస్కర్ అయితే వెళ్ళిపోతారు అని ముందే తెలిసిపోయింది. కాబట్టి వారిపై పెద్దగా అంచనాలు లేవు. ఇక ఇక చివరి రెండు స్థానాల్లో అయితే మిత్రశర్మ యాంకర్ శివ అనే పేర్లు బాగా వైరల్ అయ్యాయి.
ఆ పొజిషన్ కోసం లంచం?
టాప్ ఫైవ్ లో ఉండడానికి మిత్రశర్మ భారీగానే బిగ్ బాస్ కు డబ్బులు ఇచ్చినట్లుగా కూడా సోషల్ మీడియాలో ఒక టాక్ అయితే వచ్చింది. ఆమె భారీ స్థాయిలో క్యాష్ పార్టీ కావడంతో బిగ్ బాస్ లో రికమండేషన్ ద్వారానే అడుగు పెట్టినట్లుగా కథనాలు వెలువడిన విషయం తెలిసిందే.
ఇక ఇప్పుడు ఏకంగా టాప్ ఫైవ్ లో ఉండడానికి కూడా ఆమె భారీ స్థాయిలోనే లంచం ఇచ్చినట్లుగా రూమర్స్ వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో ఎవరికీ తెలియదు. మరి బయటకు వచ్చిన తర్వాత మిత్రశర్మ ఈ కథనాలపై ఏదైనా క్లారిటీ ఇస్తుందో లేదో చూడాలి.